»   » మెగా హీరోయిన్లు వీరేనా..?

మెగా హీరోయిన్లు వీరేనా..?

Posted By:
Subscribe to Filmibeat Telugu

మెగా ఫ్యామిలీ టాప్ హీరోలు చిరంజీవి, పవన్ కళ్యాణ్ సినిమాలపైనే ఇప్పుడు అందరి దృష్టి. ఇద్దరికీ ఇంకా హీరోయిన్ దొరకనే లేదు. ఒక వైపు సినిమాలు సెట్స్ మీదకి వెళ్ళేందుకు రెడీ అయిపొయాయి. ఇప్పుడేమో టాలీవుడ్, కొలీవుడ్,బాలీవుడ్ ఇలా ఎంత వెతికినా ఈ అన్నదమ్ములిద్దరికీ పిల్ల దొరకటం లేదు..

దాదాపు 8 ఏళ్ళ తర్వాత మెగాస్టార్ వెండితెరపై ఫుల్ లెంగ్త్ రోల్‌లో కనిపించడం, పవన్ త్వరలోనే సినిమాలకు గుడ్‌బై చెప్పడం. ఈ రెండు కారణాల వలన ఈ ఇద్దరు మెగా హీరోల సినిమలూ అందరి దృష్టినీ ఆకర్షిస్తున్నాయి. ఇటీవలే ఈ ఇద్దరు హీరోల చిత్రాలు పూజా కార్యక్రమాలు పూర్తి చేసుకొని సెట్స్‌పైకి వెళ్ళేందుకు సిద్ధమయ్యాయి.

 Megastar Chiru's 150th movie heroine confirmed?

ఇటు చిరు , అటు పవన్ ఇద్దరి సినిమాలకు టెక్నీషియన్స్ అందరు దాదాపు కన్‌ఫాం అయినట్టే. కానీ అదేం చిత్రమో హీరోయిన్లు మాత్రం ఇంకా కుదరటం లేదు .

చిరంజీవి సినిమాకు హీరోయిన్‌గా నయనతార అని అనుకున్నా, ఇటీవల ఈ అమ్మడు స్టేట్‌మెంట్‌తో ఈ మలయాళీ భామ చిరు హీరోయిన్ కాదని తేలిపోయింది. అయితే ప్రస్తుత సమాచారం ప్రకారం మిల్కీ బ్యూటీ తమన్నానే కథానాయికగా ఫిక్స్ అయినట్టు తెలుస్తుంది. ఇక పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ సినిమా ఫ్యాక్షన్ లవ్ స్టోరీ నేపధ్యంలో ఉండగా, పవన్‌తో రొమాన్స్ చేసే ఛాన్స్ బెంగళూర్ డేస్ హీరోయిన్ పార్వతీ ని సెలక్ట్ చేసి నట్టు మెగా కాంపౌండ్ నుండి అందుతున్న సమాచారం....

English summary
Chiranjeevi to romance with Tamanna in his 150th movie and Pawan to benguluru days Parwathi..?
 

తక్షణ సినీ వార్తలు, మూవీ రివ్యూలను రోజంతా పొందండి - Filmibeat Telugu