»   » తూ.చా. తప్పకుండా ఠాగూర్ సెంటిమెంట్లన్నీ పాటించినట్టే : ఖైదీ 150 సెంటిమెంట్లివే

తూ.చా. తప్పకుండా ఠాగూర్ సెంటిమెంట్లన్నీ పాటించినట్టే : ఖైదీ 150 సెంటిమెంట్లివే

Posted By:
Subscribe to Filmibeat Telugu

చిరంజీవి రీఎంట్రీ మూవీ కోసం కొన్నేళ్లుగా ఎదురు చూస్తున్నారు మెగా అభిమానులు. ఆ నిరీక్షణ ఎట్టకేలకు గత ఏడాదే ఫలించి.. ఆ సినిమాకు సంబంధించి ప్రకటన వచ్చింది. అంత మాత్రాన ఉత్కంఠకు తెరపడలేదు. చిరు చేయబోయే సినిమా ఏదన్న విషయంలో చాలా సస్పెన్స్ నడిచింది. చివరికి 'కత్తి' రీమేక్ కు ఫిక్సయ్యారు. కానీ మళ్లీ నిరీక్షణ తప్పలేదు. స్క్రిప్టు పనుల్లో విపరీతమైన జాప్యం జరిగింది.

Megastar Directs Vinayak

ఎట్టకేలకు ఏప్రిల్లోఈ సినిమా ప్రారంభోత్సవం జరుపుకుంది. కానీ మళ్లీ సినిమా సెట్స్ మీదికి వెళ్లడానికి మళ్లీ నిరీక్షణే. ఏవేవో కారణాలు.. ఏవేవో వార్తలు.. మెగా అభిమానుల్లో కన్ఫ్యూజన్. ఇదిగో అదిగో అంటూ రెండు నెలలు గడిచిపోయాయి. ఐతే ఎట్టకేలకు వాళ్లు ఎదురు చూస్తున్న రోజు రానే వచ్చింది. చిరు సినిమా షూట్ పూర్తి చేసుకొని గుమ్మడి కాయ కూడా కొట్టేసింది. అయితే గుమ్మడికాయ పగిలాక కొన్ని ఆసక్తి కరమైన సంగతులు బయటికొచ్చాయి. అప్పట్లో ఠాగూర్ షూటింగ్ లో స్పెషల్ గా జరిగిన ప్రతీ సంఘటననీ వదలకుండా సెంటిమెంట్ గా తీసుకొని ఇప్పుడు కూదా అదే పద్దతి పాటించారట. హిట్ విషయం లో ఏ చిన్న "చాన్స్" నీ మిస్ చేసుకునే ఉద్దేశం లేనట్టు ఆనాటి సెంటిమెంట్లన్నీ వాడేశారని వినికిడి. ఇంతకీ ఆ సెంటిమెంట్లు ఏమిటంటే ..

చిరు-వినాయక్ కాంబినేషన్లో ఇంతకుముందు వచ్చిన 'ఠాగూర్' ఎంత పెద్ద హిట్టో ప్రత్యేకంగా చెప్పాల్సిన పని లేదు. విశేషం ఏంటంటే.. అది కూడా రీమేకే. పైగా మురుగదాస్ కథతో తెరకెక్కిందే. ఇప్పుడు 'కత్తి' కూడా మురుగదాస్ సినిమా అన్న సంగతి తెలిసిందే. ఇక 'ఠాగూర్' సినిమాలో లారెన్స్ చిరుకు డ్యాన్స్ కంపోజ్ చేయించాడని.. ఇప్పుడు కొరియోగ్రఫీకి పూర్తిగా దూరం అయిపోయినప్పటికీ లారెన్స్ నే తీసుకొచ్చి ఒక పాట చేయించుకున్నారు. తాజాగా చిరు వినాయక్ ను డైరెక్ట్ చేసిన వీడియో ఒకటి హల్ చల్ చేస్తున్న సంగతి తెలిసిందే. ఇందులోనూ సెంటిమెంటుంది. 'ఠాగూర్ 'లో వినాయక్ చిన్న క్యామియో రోల్ చేసిన నేపథ్యంలో ఈ సినిమాలోనూ అతడితో అలాంటి పాత్రే చేయించారు.

English summary
Incidentally, Vinayak also did a small but important role in Chiru’s Tagore. Now, the team seems to be repeating this sentiment and have planned this cameo today. Seen here in the picture is Chiru himself explain the scene to Vinayak.
 

తక్షణ సినీ వార్తలు, మూవీ రివ్యూలను రోజంతా పొందండి - Filmibeat Telugu

X