»   » మొదటి టికెట్ మెగాస్టార్ కొనేసాడు, సుక్కూ'స్ మూవీ హైప్ మామూలుగా లేదుగా

మొదటి టికెట్ మెగాస్టార్ కొనేసాడు, సుక్కూ'స్ మూవీ హైప్ మామూలుగా లేదుగా

Posted By:
Subscribe to Filmibeat Telugu

లెక్కల మాస్టారు సుకుమార్ నిర్మాణంలో రూపొందిన చిత్రం దర్శకుడు. ఈ మూవీ క్యాప్షన్ హిస్ ప్యాషన్ .. హార్ లవ్ . అశోక్ ,ఈషా ప్రధాన పాత్రలుగా రూపొందుతున్న ఈ చిత్రాన్ని హరిప్రసాద్ జక్కా డైరెక్ట్ చేస్తున్నాడు. ఇటీవల దర్శకుడు మూవీ ఫస్ట్ లుక్ విడుదల చేసి అభిమానులకు సడెన్ సర్ ప్రైజ్ ఇచ్చాడు సుక్కూ. ఈ లుక్ సినీ లవర్స్ ని అలరించింది. రొమాంటిక్ ఎంటర్ టైనర్ గా రూపొందుతున్న ఈ చిత్ర షూటింగ్ తుది దశకు చేరుకోగా ఈ ఆగస్టు 4వ తేదీన ఈ సినిమా రిలీజ్ అవుతోంది. ఈ నేపథ్యంలో, 'దర్శకుడు' సినిమా తొలి టికెట్ ను మెగాస్టార్ చిరంజీవి కొనుగోలు చేశారు.

చిన్న‌ప్పుడే ద‌ర్శ‌కుడు కావాల‌ని ఓ యువ‌కుడి కోరిక కాగా, అందుకోసం తనజీవితంలో జ‌రిగిన ప్ర‌తి స‌న్నివేశాన్ని సినిమాలో వాడుతుంటాడు ఆ కుర్రాడు. మ‌రి ఈ క్ర‌మంలో ఆ కుర్రాడు ఏ రేంజ్ ద‌ర్శ‌కుడిగా మార‌తాడు, త‌న జీవితంలో ఎలాంటి సంగ‌తులు చోటు చేసుకుంటాయి అనే విష‌యాలు మాత్రం వెండితెర‌పై చూడాల్సిందే అంటున్నారు మేక‌ర్స్.


Megastar to purchase Darshakudu's first ticket

సుకుమార్ తొలి సారి కుమారి 21ఎఫ్ చిత్రంతో నిర్మాతగా మారిన సంగతి తెలిసిందే. ఓ వైపు ఈ సినిమా నిర్మాణ బాధ్యతలను చూసుకుంటూనే, రామ్ చరణ్ హీరోగా 'రంగస్థలం' సినిమాను తెరకెక్కిస్తున్నాడు సుకుమార్. సుకుమార్ రైటింగ్స్ బ్యానర్ లో వస్తున్న రెండో సినిమా, హీరోగా తన అన్న కొడుకు పరిచయం అవుతుండటంతో దర్శకుడిపై ఆసక్తి నెలకొంది. సినిమా ప్రమోషన్ లో సుకుమార్ చిత్రాల్లో నటించిన అగ్ర హీరోలు పాల్గొంటుండటంతో దర్శకుడుపై మంచి హైప్ క్రియేట్ అయ్యింది. సెన్సార్ బోర్డ్ నుంచి క్లీన్ యు సర్టిఫికేట్ పొందిన ఈ సినిమాను ఆగస్టు 4న రిలీజ్ చేస్తున్నట్టుగా ప్రకటించారు.


Darshakudu Movie Press Meet Part 2
English summary
Megastar Chiranjeevi himself will be part of Darshakudu’s promotions. Chiru will be purchasd Darshakudu’s first ticket
Please Wait while comments are loading...