»   » కుమారి 21 ఎఫ్: మేఘాలు లేకున్నా సాంగ్ (మేకింగ్ వీడియో)

కుమారి 21 ఎఫ్: మేఘాలు లేకున్నా సాంగ్ (మేకింగ్ వీడియో)

Posted By:
Subscribe to Filmibeat Telugu

హైదరాబాద్: విభిన్న చిత్రాల దర్శకుడిగా ప్రేక్షకుల్లో తనకంటూ ఓ ప్రత్యేక గుర్తింపును సంపాందించుకున్న దర్శకుడు సుకుమార్ తొలిసారిగా నిర్మాతగా మారి ‘కుమారి 21 ఎఫ్' పేరుతో ఓ ప్రేమకథా చిత్రాన్ని నిర్మించిన సంగతి తెలిసిందే. ఈ చిత్రానికి ఆయనే స్వయంగా కథ, స్క్రీన్‌ప్లే కూడా అందించారు.

రాజ్ దరుణ్, హెబ్బా పటేల్ హీరో హీరోయిన్లుగా తెరకెక్కిన ఈచిత్రం .....నవంబర్ 20, 2015న విడుదలైన ఈచిత్రం బాక్సాఫీసు వద్ద మంచి ఫలితాలు రాబట్టింది. ఈ చిత్రానికి దేవిశ్రీ ప్రసాద్ సంగీతం అందించారు. ఇందులో ‘మేఘాలు లేకున్నా నా పైన ఈ వాన రాగాలు తీసే నీ వల్లేనా' అనే సాంగ్ బాగా పాపులర్ అయింది. తాజాగా ఈ చిత్రానికి సంబంధించిన మేకింగ్ వీడియో విడుదల చేసారు. ఆ వీడియోపై మీరూ ఓ లుక్కేయండి.దేవిశ్రీప్రసాద్ సంగీతం, రత్నవేలు ఫోటోగ్రఫీ చిత్రానికి హైలైట్‌గా నిలిచింది. రాజ్ తరుణ్ పాత్ర, అభినయం అందర్ని ఆకట్టుకునే విధంగా ఉంది. ఇక హెబ్బా పటేల్ గ్లామర్ ఈ సినిమాకు అదనపు ఆకర్షణ తెచ్చిపెట్టింది. ఈ మూవీ ఆడియో సూపర్ హిట్టయిన సంగతి తెలిసిందే.

English summary
Watch Kumari 21F - Meghaalu Lekunna Making Video. Starring Raj Tarun, Hebah Patel.
Please Wait while comments are loading...