»   » ‘మెహబాబూ’ ఫస్ట్ లుక్ టీజర్: పూరి మేకింగ్ అదిరిపోయింది!

‘మెహబాబూ’ ఫస్ట్ లుక్ టీజర్: పూరి మేకింగ్ అదిరిపోయింది!

Posted By:
Subscribe to Filmibeat Telugu
‘మెహబాబూ’ ఫస్ట్ లుక్ టీజర్

పూరి జగన్నాధ్ స్వీయ నిర్మాణ దర్శకత్వంలో రూపొందుతున్న చిత్రం 'మెహబూబా'. పూరి తనయుడు ఆకాష్ హీరోగా నటిస్తుండగా, కన్నడబ్యూటీ నేహా శెట్టి హీరోయిన్. తాజాగా ఈ చిత్రానికి సంబంధించిన ఫస్ట్ లుక్ టీజర్ విడుదల చేశారు.

టీజర్ అదుర్స్

‘మెహబాబూ' ఫస్ట్ లుక్ టీజర్ అదిరిపోయింది. 50 సెకన్ల నిడివి ఉన్న ఈ వీడియో ద్వారా ఈ సినిమా ఎలా ఉండబోతోందో ప్రేక్షకులు ఒక అంచనాకు వచ్చేలా చేశాడు పూరి. టీజర్ విడుదలైన తర్వాత సినిమాపై అంచనాలు మరింత పెరిగాయి.

ఎపిక్ లవ్ స్టోరీ

ఎపిక్ లవ్ స్టోరీ

1971 ఇండో-పాక్ యుద్ధం నేపథ్యంలో జరిగే లవ్ స్టోరీ ఈచిత్రం. తన కుమారుడిని ఇండస్ట్రీలో హీరోగా నిలబెట్టేందుకు ఎపిక్ లవ్ స్టోరీ ఎంచుకున్నారు పూరి. అందుకే తనే స్వయంగా నిర్మాణ బాధ్యతలు తీసుకున్నారు. టీజర్ చూసిన తర్వాత నిజంగానే ఈ చిత్రం ‘ఎపిక్' అనే పదానికి న్యాయం చేస్తుందనే నమ్మకం కలిగించింది.

పూరి కెరీర్లోనే ది గ్రేట్ మూవీ కాబోతోందా?

పూరి కెరీర్లోనే ది గ్రేట్ మూవీ కాబోతోందా?

ఈ చిత్రం పూరి కెరీర్లోనే ది గ్రేట్ మూవీ కాబోతోందనే కామెంట్స్ ఇండస్ట్రీ ప్రముఖుల నుండి వినిపిన్నాయి. టీజర్ చూసిన రామ్ గోపాల్ వర్మ, వరుణ్ తేజ్, అనిల్ రావిపూడి, ప్రియమణి, కోన వెంకట్ తదితరులు ట్వీట్ చేశారు.

రామ్ గోపాల్ వర్మ

‘మెహబూబా' ఫస్ట్ లుక్ టీజర్ చూసిన అనంతరం ప్రముఖ దర్శకుడు, పూరి గురువు రామ్ గోపాల్ వర్మ ట్విట్టర్ ద్వారా స్పందించారు. లుక్ అదిరిపోయిందని, వెరీ బెస్ట్ ఎపిక్ లవ్ స్టోరీ మూవీ అవుతుందనే నమ్మకం వ్యక్తం చేశారు.

ఆకాష్‌కు బ్రైట్ ఫ్యూచర్: ప్రియమణి

‘మెహబూబా' ఫస్ట్ లుక్ టీజర్ చూసిన అనంతరం ప్రియమణి స్పందిస్తూ... ఆకాష్‌కు బ్రైట్ ఫ్యూచర్ ఉంటుందని, ఆల్ ది బెస్ట్ అంటూ ట్వీట్ చేసింది.

వరుణ్ తేజ్ ట్వీట్

‘మెహబూబా' టీజర్ చూసిన అనంతరం ఆకాష్, పూరిలను విష్ చేస్తూ మెగా హీరో వరుణ్ తేజ్ ట్వీట్ చేశారు.

మనసు దోచుకుంది: కోన వెంకట్

ప్రముఖ సినీ రచయిత కోన వెంకట్ స్పందిస్తూ....‘మెహబూబా' టీజర్ మా మనసులను దోచుకుందని ట్వీట్ చేశారు.

English summary
Watch Mehbooba First Look Teaser / Trailer of Puri jagannadh's #Mehbooba Staring Akash Puri, Neha shetty, vishu Reddy, sayaji shinde, Murali Sharma, Ashwini kalsekar . Mehobooba is directed and Produced by Puri Jagannadh under Puri Jagannadh touring Talkies and Co produced by Puri Connects. Music by Sandeep Chowta .
 

తక్షణ సినీ వార్తలు, మూవీ రివ్యూలను రోజంతా పొందండి - Filmibeat Telugu