»   » పూరి ప్లాన్ మామూలుగా లేదుగా: దిల్ రాజు చేతికి ‘మెహబూబా’, డేట్ ఫిక్స్

పూరి ప్లాన్ మామూలుగా లేదుగా: దిల్ రాజు చేతికి ‘మెహబూబా’, డేట్ ఫిక్స్

Posted By:
Subscribe to Filmibeat Telugu
Puri Jaganath's Son Getting Launched Dil Raju

పూరీ జగన్నాథ్ ప్రస్తుతం తన ఫోకస్ అంతా తన కుమారుడు ఆకాష్ పూరిని ఇండస్ట్రీలో హీరోగా నిలబెట్టడంపైనే పెట్టారు. ఆకాష్ హీరోగా సొంత బేనర్లో 'మెహబూబా' చిత్రాన్ని రూపొందిస్తున్న ఆయన.... విడుదల విషయంలో కూడా ప్రత్యేక శ్రద్ద తీసుకున్నారు. సినిమా ఎంత బాగా తీసినా దాన్ని గ్రాండ్‌గా విడుదల చేసినపుడే ఫలితం దక్కుతుంది. అందుకే ఆయన ఈ చిత్రాన్ని దిల్ రాజు చేతిలో పెట్టారు.

దిల్ రాజు పవర్... పైగా లక్కీ హ్యాండ్

దిల్ రాజు పవర్... పైగా లక్కీ హ్యాండ్

తెలుగు సినిమా పరిశ్రమలో ఉన్న పవర్ ఫుల్ డిస్ట్రిబ్యూటర్లలో దిల్ రాజు ఒకరు. ఆయన చేతికి సినిమా వెళ్లిందంటే కావాల్సినన్ని థియేటర్లు దొరుకుతాయి. సినిమాకు కూడా ఊహించిన దానికంటే ఎక్కువ హైప్ వస్తుంది. పైగా ఆయనది లక్కీ హ్యాండ్. అందుకే మెహబూబా చిత్రాన్ని ఆయన చేతిలో పెట్టారు.

నెల జీతం సరిపోవడం లేదు: చిన్నారి కోసం ఓ వెయిటర్ తండ్రి ఆవేదన

అఫీషియల్‌గా ప్రకటన

అఫీషియల్‌గా ప్రకటన

ఈ మేరకు ‘పూరీ కనెక్ట్స్‌' చిత్ర నిర్మాణ సంస్థ నుండి అఫీషియల్ ప్రకటన వెలువడింది. ఈ సినిమా కోసం దిల్‌రాజుకు చెందిన శ్రీ వెంకటేశ్వర క్రియేషన్స్‌తో చేతులు కలిపినట్లు అందులో పేర్కొన్నారు.

గతంలో పూరి-దిల్ రాజు కాంబినేషన్లో

గతంలో పూరి-దిల్ రాజు కాంబినేషన్లో

గతంలో పూరి జగన్నాథ్ దర్శకత్వంలో వచ్చిన ‘ఇడియట్', ‘పోకిరి' చిత్రాలతో దిల్ రాజు అసోసియేట్ అయ్యారు. చాలా కాలం తర్వాత వీరి అసోసియేషన్లో ‘మెహబూబా' సినిమా ప్రేక్షకుల ముందుకు రాబోతోంది.

మే 11న గ్రాండ్ రీజ్

మే 11న గ్రాండ్ రీజ్

‘మెహబూబా' చిత్రంలో ఆకాష్ పూరికి జోడీగా బెంగళూరు భామ నేహాశెట్టి నటిస్తోంది. ఈ చిత్రాన్ని మే 11న ప్రేక్షకుల ముందుకు తీసుకురావడానికి సన్నాహాలు చేస్తున్నారు.

అదిరిపోయే మేకింగ్

అదిరిపోయే మేకింగ్

1971 ఇండో-పాక్ యుద్ధం నేపథ్యంలో జరిగే లవ్ స్టోరీ ఈచిత్రం. తన కుమారుడిని ఇండస్ట్రీలో హీరోగా నిలబెట్టేందుకు ఎపిక్ లవ్ స్టోరీ ఎంచుకున్నారు పూరి. అందుకే తనే స్వయంగా నిర్మాణ బాధ్యతలు తీసుకున్నారు. టీజర్ చూసిన తర్వాత నిజంగానే ఈ చిత్రం ‘ఎపిక్' అనే పదానికి న్యాయం చేస్తుందనే నమ్మకం కలిగించింది.

English summary
Puri Jagannadh’s latest film, an intense romantic drama titled Mehbooba, has been in news ever since the film’s stunning teaser was unveiled a month ago. Leading producer Dil Raju has acquired Mehbooba’s theatrical rights. In the past, Dil Raju had released Puri’s Idiot and Pokiri and both the movies went on to become huge blockbusters.
 

తక్షణ సినీ వార్తలు, మూవీ రివ్యూలను రోజంతా పొందండి - Filmibeat Telugu

X