»   » ఫన్నీగా సాగిన ‘మోహబూబా’ టీం సూప్ గేమ్

ఫన్నీగా సాగిన ‘మోహబూబా’ టీం సూప్ గేమ్

Posted By:
Subscribe to Filmibeat Telugu

పూరి జగన్నాథ్ దర్శకత్వంలో ఆకాష్ పూరి, నేహా శెట్టి జంటగా లావణ్య సమర్పణలో పూరి జగన్నాథ్‌ టూరింగ్‌ టాకీస్‌ పతాకంపై రూపొందుతున్న చిత్రం 'మెహబూబా'. 1971 ఇండియా-పాకిస్తాన్‌ యుద్ధ నేపథ్యంలో సాగే ప్రేమకథగా ఈ చిత్రాన్ని తెరకెక్కిస్తున్నారు. మే 11న సమ్మర్‌ స్పెషల్‌గా 'మెహబూబా' ప్రపంచవ్యాప్తంగా విడుదల కానుంది. ఈ నేపథ్యంలో సినిమా ప్రమోషన్లు మొదలయ్యాయి. ఇందులో భాగంగా హీరో, హీరోయిన్ కలిసి సూప్ గేమ్ ఆడారు.

ఈ సందర్భంగా హోస్ట్ అడిగిన ప్రశ్నకు ఆకాష్ పూరి ఆసక్తికర సమాధానాలు ఇచ్చారు. తన తండ్రి పూరి జగన్నాథ్ కాకుండా రాజమౌళి, సుకుమార్‌లలో ఎవరిని మీ లాంచింగ్ సినిమాకు దర్శకుడిగా ఎంచుకుంటారు అనే ప్రశ్నకు సుకుమార్ అని సమాధానం ఇచ్చారు.

సమంత, కాజల్, రకుల్ ఈ ముగ్గురి గురించి ఓ చిలిపి ప్రశ్న ఎదురవ్వగా.... తకు ముగ్గురు సిస్టర్స్ లాంటి వారే అంటూ ఆకాష్ సమాధానం చెప్పడం గమనార్మం. హీరోయిన్ నేహా శెట్టికి కూడా ఇలాంటి ప్రశ్నలే ఎదురయ్యాయి. ఇక్కడ వీడియోలో వారు ఇంకా ఏమేం సమాధానాలు చెప్పారో ఓ లుక్కేయండి.

ట్రైలర్ విడుదల తర్వాత మెహబూబా చిత్రంపై మంచి అంచనాలు ఏర్పడ్డాయి. ట్రైలర్లో ఆకాష్ పూరి పెర్ఫార్మెన్స్ ఆకట్టుకునే విధంగా ఉంది. ముఖ్యంగా వార్ సీన్లు, యాక్షన్ సీన్లలో అదరగొట్టాడు. ఈ సినిమాతో ఆకాష్ పూరికి నటుడిగా మంచి గుర్తింపు వస్తుందని చెప్పడంలో ఎలాంటి సందేహం లేదు అని అంటున్నారు ట్రైలర్ చూసిన ఫ్యాన్స్.

Mehbooba Soup Game video

'మెహబూబా' చిత్రంతో ప్రముఖ నిర్మాత దిల్ రాజు అసోసియేట్ అయిన సంగతి తెలిసిందే. ఈ చిత్రాన్ని ఆయన గ్రాండ్‌గా విడుదల చేయబోతున్నారు. ఓ వర్సీస్ రైట్స్ 'బ్లూ స్కై సినిమా' వారు దక్కించుకున్నారు. మెహబూబా టీం మే 10 నుండి మే 24 వరకు యూఎస్ఏలో వివిధ ప్రాంతాలు పర్యటిస్తూ ప్రమోషన్స్ నిర్వహించనున్నారు. మే 10న న్యూజెర్సీలో జరిగే ప్రీమియర్ షోకు హాజరవ్వడం ద్వారా వీరి ప్రమోషన్స్ మొదలు కానున్నాయి. హీరో, హీరోయిన్‌తో చిత్ర బృందం ఈ పర్యటనలో పాల్గొంటారు.

ఈ చిత్రానికి సంగీతం: సందీప్‌ చౌతా, సినిమాటోగ్రఫీ: విష్ణుశర్మ, ఎడిటింగ్‌: జునైద్‌ సిద్ధిఖీ, యాక్షన్‌: రియల్‌ సతీష్‌, ఆర్ట్‌: జానీ షేక్‌, కథ, స్క్రీన్‌ప్లే, మాటలు, నిర్మాత, దర్శకత్వం: పూరి జగన్నాథ్‌.

English summary
Watch Team Mehbooba Soup Game by Akash Puri, Neha Shetty , Vishu Reddy. The movie Directed By Puri Jagannadh, Produced By Puri Connects and Charm Kaur.
 

తక్షణ సినీ వార్తలు, మూవీ రివ్యూలను రోజంతా పొందండి - Filmibeat Telugu

X