»   »  ‘మెహబూబా’ ట్రైలర్: రోమాలు నిక్కబొడిచేలా పూరి జగన్నాథ్ టేకింగ్

‘మెహబూబా’ ట్రైలర్: రోమాలు నిక్కబొడిచేలా పూరి జగన్నాథ్ టేకింగ్

Posted By:
Subscribe to Filmibeat Telugu
‘మెహబూబా’ ట్రైలర్: రోమాలు నిక్కబొడిచేలా పూరి జగన్నాథ్ టేకింగ్

పూరి జగన్నాథ్ దర్శకత్వంలో ఆకాష్ పూరి, నేహా శెట్టి జంటగా తెరకెక్కుతున్న చిత్రం 'మెహబూబా'. భారీ అంచనాలతో తెరకెక్కుతున్న ఈ చిత్రం థియేట్రికల్ ట్రైలర్ సోమవారం విడుదలైంది. మైండ్ బ్లోయింగ్ విజువల్స్, డైలాగులతో రొమాలు నిక్కబొడిచేలా ట్రైలర్ అద్భుతంగా ఉంది. ముఖ్యం సినిమాకు ఎంచుకున్న బ్యాక్ డ్రాప్, అందుకు తగిన విధంగా అద్భుతమైన విజువల్స్ ప్రేక్షకుల్లో అంచనాలు పెరిగేలా చేసింది.

ట్రైలర్ సూపర్బ్

1971 ఇండో-పాక్ యుద్ధం నేపథ్యంలో జరిగే లవ్ స్టోరీ ఈచిత్రం. తన కుమారుడిని ఇండస్ట్రీలో హీరోగా నిలబెట్టేందుకు ఎపిక్ లవ్ స్టోరీ ఎంచుకున్న పూరి తనదైన టేకింగ్, అద్భుతమైన డైలాగులతో ప్రేక్షకులను మంత్రముగ్దులను చేయబోతున్నాడని ట్రైలర్ చూస్తే స్పష్టమవుతోంది.

డైలాగులు అదరగొట్టిన పూరి

డైలాగులు అదరగొట్టిన పూరి

‘దేశాన్ని ప్రేమించే మనసు కేవలం ఒక సైనికుడికే ఉంటుంది. ఆ మనసులో ఓ చిన్న స్థానం దొరికినా చాలు', ‘మమ్మల్ని చంపేస్తే మళ్లీ పుడతాం' అంటూ ట్రైలర్లో హీరో హీరోయిన్ చెప్పే డైలాగులు ఆకట్టుకుంటున్నాయి.

ఆకాష్ పూరి పెర్ఫార్మెన్స్

ఆకాష్ పూరి పెర్ఫార్మెన్స్

ట్రైలర్లో ఆకాష్ పూరి పెర్ఫార్మెన్స్ ఆకట్టుకునే విధంగా ఉంది. ముఖ్యంగా వార్ సీన్లు, యాక్షన్ సీన్లలో అదరగొట్టాడు. ఈ సినిమాతో ఆకాష్ పూరికి నటుడిగా మంచి గుర్తింపు వస్తుందని చెప్పడంలో ఎలాంటి సందేహం లేదు అని అంటున్నారు ట్రైలర్ చూసిన ఫ్యాన్స్.

దిల్ రాజుకు థియేట్రికల్ రైట్స్

దిల్ రాజుకు థియేట్రికల్ రైట్స్

గతంలో పూరి జగన్నాథ్ దర్శకత్వంలో వచ్చిన ‘ఇడియట్', ‘పోకిరి' చిత్రాలతో దిల్ రాజు అసోసియేట్ అయ్యారు. చాలా కాలం తర్వాత వీరి అసోసియేషన్లో ‘మెహబూబా' సినిమా ప్రేక్షకుల ముందుకు రాబోతోంది.

పూరి జగన్నాథ్ టూరింగ్ టాకీస్

పూరి జగన్నాథ్ టూరింగ్ టాకీస్

పూరి జగన్నాథ్ టూరింగ్ టాకీస్ బేనర్లో రూపొందుతున్న ‘మెహబూబా' చిత్రాన్ని మే 11న ప్రేక్షకుల ముందుకు తీసుకురావడానికి సన్నాహాలు చేస్తున్నారు.

English summary
Presenting you Puri Jagannadh's #MehboobaTrailer. Mehbooba features Akash Puri & Neha Shetty, Music composed by Sandeep Chowta and produced under Puri Jagannadh Touring Talkies banner. Mehbooba is scheduled to release worldwide on 11th May 2018.
 

తక్షణ సినీ వార్తలు, మూవీ రివ్యూలను రోజంతా పొందండి - Filmibeat Telugu

X