twitter
    For Quick Alerts
    ALLOW NOTIFICATIONS  
    For Daily Alerts

    వెంకటేష్‌, రామ్‌చరణ్‌, అఖిల్‌, శ్రీకాంత్‌ కలసి...(ఫొటోలు)

    By Srikanya
    |

    హైదరాబాద్ :హుద్‌హుద్‌ తుపాను ధాటికి రూపురేఖలు కోల్పోయిన ఉత్తరాంధ్ర జిల్లాలను ఆదుకోవడానికి తెలుగు చిత్ర పరిశ్రమ ఎంచుకున్న మార్గం 'మేముసైతం'. ఈ నెల 30న 12 గంటలపాటు సాగనున్న ఈ మహా కార్యక్రమంలో తారల క్రికెట్‌ పోటీ ఉంది. పోటీల్లో పాల్గొనే జట్లను లాటరీ పద్ధతిలో గురువారం హైదరాబాద్‌లో ప్రకటించారు.

    కోట్ల విజయభాస్కరరెడ్డి ఇండోర్‌ స్టేడియంలో 2.30 నుంచి ఆరు వరకు క్రికెట్‌ పోటీలు నిర్వహిస్తారు. వెంకటేష్‌, నాగార్జున, ఎన్టీఆర్‌, రామ్‌ చరణ్‌ కెప్టెన్లుగా నాలుగు టీమ్‌లు ఈ మ్యాచ్‌లో ఆడనున్నాయి.

    జట్ల సభ్యులు వేసుకొనే దుస్తులు (జెర్సీలు) ప్రదర్శించారు. కార్యక్రమంలో కె.రాఘవేంద్రరావు, కె.ఎల్‌.నారాయణ, జెమిని కిరణ్‌తోపాటు జట్ల సభ్యులు, పలువురు నటులు, దర్శకులు తదితరులు పాల్గొన్నారు. కెప్టెన్లు తమ జట్లతో సిద్ధమయ్యారు. మరి మీరు వినోదాల జల్లును ఆస్వాదించడానికి సిద్ధంకండి.

    ట్రోఫీ ఆవిష్కరణ..

    ట్రోఫీ ఆవిష్కరణ..

    వెంకటేష్‌, రామ్‌చరణ్‌, అఖిల్‌, శ్రీకాంత్‌ కలసి ట్రోఫీని ఆవిష్కరించారు.

    వెంకటేష్‌ జట్టు (నేవీ రంగు జెర్సీ) లో...

    వెంకటేష్‌ జట్టు (నేవీ రంగు జెర్సీ) లో...

    వెంకటేష్‌ (కెప్టెన్‌), విష్ణు, రాజశేఖర్‌, మనోజ్‌, నితిన్‌, నారా రోహిత్‌, సుశాంత్‌, నవీన్‌ చంద్ర, దాసరి అరుణ్‌కుమార్‌, మాదాల రవి, ఆదర్శ్‌, సమంత, లక్ష్మీ మంచు, సంజన, ప్రియా బెనర్జీ, తేజస్వి

    రామ్‌చరణ్‌ (పసుపు జెర్సీ) జట్టులో...

    రామ్‌చరణ్‌ (పసుపు జెర్సీ) జట్టులో...

    రామ్‌చరణ్‌ (కెప్టెన్‌), తరుణ్‌, గోపీచంద్‌, సుమంత్‌, సుధీర్‌బాబు, ఆది, తారకరత్న, వరుణ్‌సందేశ్‌, వడ్డే నవీన్‌, ఖయ్యూమ్‌, అజయ్‌, కాజల్‌, ఛార్మి, అర్చన, పూనమ్‌ కౌర్‌, రీతూవర్మ

    నాగార్జున (ఎరుపు జెర్సీ) జట్టులో...

    నాగార్జున (ఎరుపు జెర్సీ) జట్టులో...

    నాగార్జున (కెప్టెన్‌), అఖిల్‌, కల్యాణ్‌రామ్‌, అల్లరి నరేష్‌, నిఖిల్‌, నాగశౌర్య, సచిన్‌ జోషి, సాయికుమార్‌, శర్వానంద్‌, శివాజీరాజా, రాజీవ్‌ కనకాల, రకుల్‌ ప్రీత్‌సింగ్‌, ప్రణీత, మధుశాలిని, సోనియా, దిశా పాండే

    ఎన్టీఆర్‌ (నీలం జెర్సీ) జట్టులో...

    ఎన్టీఆర్‌ (నీలం జెర్సీ) జట్టులో...

    ఎన్టీఆర్‌ (కెప్టెన్‌), శ్రీకాంత్‌, రవితేజ, నాని, సాయిధరమ్‌తేజ్‌, సందీప్‌కిషన్‌, ప్రిన్స్‌, తనీష్‌, తమన్‌, సమీర్‌, రఘు, అనుష్క, దీక్షాసేత్‌, నిఖిల్‌, శుభ్రా అయ్యప్ప, అస్మితా సూద్‌

    కబడ్డీ పోటీలు..

    కబడ్డీ పోటీలు..

    మంచు వారి ఫ్యామిలీ కబడ్డీ పోటీలు నిర్వహిస్తోంది. ఈ పోటీల్లో రెండు జట్లు ఉన్నాయి. జట్టు (ఏ)కి విష్ణు సారధ్యం వహించగా జట్టు (బి)కి మనోజ్‌ సారధ్యం వహిస్తారు.

     కబడ్డీ...

    కబడ్డీ...

    టీం (ఏ)లో విష్ణుతో పాటు వెన్నెల కిశోర్‌, శ్రవణ్‌, పృధ్వీరాజ్‌, సంపూర్ణేష్‌బాబు, వరుణ్‌ సందేశ్‌, సామ్రాట్‌, లావణ్య త్రిపాఠి, హ న్సిక ఉంటారు. టీం (బి)లో మనోజ్‌ లీడర్‌గా సుప్రీత్‌, నాని, నిఖిల్‌, తనీష్‌, రవి, ధనరాజ్‌, మంచు లక్ష్మి, తాప్సీ, ఉన్నారంటూ ఓ లిస్ట్‌ విడుదల చేశారు.

    రిఫరీగా...

    రిఫరీగా...

    ఈ మ్యాచ్‌కి రిఫరీగా మోహన్‌బాబు వ్యవహరిస్తారని సమాచారం. కబడ్డీ పోటీల్లో హీరోయిన్స్‌ పాల్గొనడంతో ఈ కార్యక్రమం అందర్ని ఆకట్టుకుంటుందని కోరుకుంటున్నారు.

    బాలకృష్ణ పాటలు..

    బాలకృష్ణ పాటలు..

    ‘మేము సైతం' కార్యక్రమంలో పాల్గొనడమే కాకుండా పలు ప్రోగ్రామ్స్ కూడా చేయనున్నారు. ఇలా పలు ప్రోగ్రామ్స్ చేస్తున్న వారి లిస్టులో నందమూరి బాలకృష్ణ కూడా చేరాడు. మ్యూజిక్ డైరెక్టర్ కోఠి అండ్ టీంతో కలిసి స్టేజ్ మీద నందమూరి బాలకృష్ణ రెండు పాటలను పాడనున్నాడు.

    బాలయ్య డాన్స్ లు..

    బాలయ్య డాన్స్ లు..

    అంతే కాకుండా ‘లెజెండ్' ఫేం సోనాల్ చౌహాన్ తో కలిసి బాలయ్య ఓ స్పెషల్ ప్రోగ్రాం కూడా చెయ్యడానికి సిద్దమవుతున్నాడు. ప్రస్తుతం ఈ రెండిటికి సంబందించిన రిహార్సల్స్ పై బాలకృష్ణ దృష్టి సారించాడు.

    తంబోలా

    తంబోలా

    హుద్‌హుద్‌ పెను తుపాను బాధితుల సహాయార్థం నిర్వహించబోతున్న ‘మేము సైతం' కార్యక్రమంలో భాగంగా మెగా తంబోలా ఈవెంట్‌ను డిజైన్‌ చేశామని క్రియేటివ్‌ కమర్షియల్స్‌ అధినేత కె.ఎస్‌. రామారావు చెప్పారు.

    మోడల్స్ తో షో..

    మోడల్స్ తో షో..

    29వ తేదీ రాత్రి నేషనల్‌, ఇంటర్నేషనల్‌ ఫ్యాషన్‌ మోడల్స్‌తో షో ఏర్పాటు చేసారు.

    పాస్ లతో తీసుకుంటే..

    పాస్ లతో తీసుకుంటే..

    రూ.15 వేల విలువ చేసే పాస్‌లు తీసుకున్న వాళ్లకు అదే రోజు రాత్రి 6.30 నుంచి రెండు గంటల పాటు జరిగే ‘తంబోలా విత్‌ స్టార్స్‌' ఈవెంట్‌లో తారలతో కలిసి తంబోలా ఆడే చక్కని అవకాశం ఉంటుంది.

    బంపర్ ప్రైజ్..

    బంపర్ ప్రైజ్..

    తంబోలాలో పాల్గొన్న వాళ్లకు రూ. 10 లక్షల బంపర్‌ప్రైజ్‌ ఉందని కమిటీ సభ్యురాలు విజయశ్రీ తెలిపారు.

    పవన్, మహేష్,

    పవన్, మహేష్,

    ముఖ్యంగా తెలుగు నుంచి స్టార్ హీరోలు మహేష్, పవన్,ఎన్టీఆర్ పాల్గొంటున్నారు. త్రివిక్రమ్ దర్శకత్వంలో పవన్,మహేష్ ఈ స్కిట్ జరుగుతుంది.

    రైట్స్ ని..

    రైట్స్ ని..


    ఈ పోగ్రాం ట్రాన్సిమిషన్ రైట్స్ కు విపరీతమైన డిమాండ్ ఏర్పడింది. ఫైనల్ గా జెమినీ టీవి వారు ఈ ప్రసార హక్కులను సొంతం చేసుకున్నారు.

    13 గంటల సేపు..

    13 గంటల సేపు..

    ఈ పోగ్రాం.. నవంబర్ 30న హైదరాబాద్ లో జరగనుంది. దాదాపు 13 గంటల పాటు కంటిన్యూగా జరిగే లైవ్ ప్రోగ్రాం.

    లోగో విషయానికి వస్తే...

    లోగో విషయానికి వస్తే...

    సహాయం అందించడానికి సిద్దంగా ఉన్న చేతులను ఒక చెట్టు ఆకారంలో పొందుపరిచారు. కింద మేము సైతం అక్షరాలను, చెట్టును గ్రీన్, బ్లూ కలర్ లో రాశారు. సింబాలిక్ గా గ్రీన్ కలర్లో రాయడం అంటే విశాఖ పర్యావరణం అభివృద్ధికి, పూర్వవైభవం తీసుకురావడానికి కృషి చేస్తాం, శక్తిని ఇస్తాం అని అర్ధం. బ్లూ కలర్లో రాయడం అంటే త్రికరణ శుద్ధితో, మనస్పూర్తితో, నిజాయితిగా పని చేస్తున్నాం. మీలో విశ్వాసాన్ని నింపుతాం అని అర్ధం. లోతుగా అధ్యయనం చేసి ఆలోచించిన తర్వాత ఈ లోగోను రూపొందించినట్టు చెప్తున్నారు.

    తమిళం నుంచి...

    తమిళం నుంచి...

    తమిళ పరిశ్రమ నుండి రజినీకాంత్, కమల్ హాసన్, సూర్య, కార్తి, విక్రమ్ తదితరులు హాజరవుతున్నారు. నవంబర్ 30న టాలీవుడ్ కి సెలవు ప్రకటించారు.

    English summary
    Telugu film industry is getting together to rise funds for the welfare of Cyclone Hudhud victims. Here are full details of Cricket With Stars teams and list of actors who got picked through a draw from.
     
    న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
    Enable
    x
    Notification Settings X
    Time Settings
    Done
    Clear Notification X
    Do you want to clear all the notifications from your inbox?
    Settings X
    X