»   » సినిమా చూసి ... హీరో, నిర్మాతపై మెంటల్ టార్చర్ కేసు

సినిమా చూసి ... హీరో, నిర్మాతపై మెంటల్ టార్చర్ కేసు

Posted By:
Subscribe to Filmibeat Telugu

ముంబై : మన దేశంలో రకరకాల కారణాలతో కేసులు ఫైల్ అవుతూంటాయి. తాజాగా ఓ గమ్మత్తైన కేసుని డిస్ట్రిక్ట్ కన్సూమర్ కోర్ట్ లో ఫైల్ చేసారు. షారూఖ్ ఖాన్ లేటెస్ట్ బాలీవుడ్ చిత్రం ఫ్యాన్ పై నమైదైన కేసు వింటే మీకు ఆశ్చర్యమనిపిస్తుంది. మెంటల్ టార్చర్, హెరాస్ మెంట్ కేసుని ఈ సినిమా పై పెట్టారు.

సంగీత అనే ఆమె పెట్టిన ఈ కేసు..పీవీఆర్ సినిమాస్ (ధియోటర్స్) పైనా , యష్ రాజ్ ఫిల్మ్ పైనా, షారూఖ్ ఖాన్ పైనా ఆ కేసు నమోదైంది. ఆ కేసులో ఆరోపణ ఏమిటీ అంటే... ప్రమోషన్ లో ఉన్న జబ్రా సాంగ్ సినిమాలో లేదని దాంతో తాము చాలా డిజప్పాయింట్ ఫీల్ అయ్యామన్నారు.

అంతేకాకుండా తాము తమ కుటుంబ సభ్యులందరూ ఒక్కొక్కరూ 650 రూపాయలు చొప్పున టిక్కెట్ కు పే చేసామని అన్నారు. అంత ఖర్చు పెట్టి , కష్టపడి వెళ్లిన సినిమాలో ప్రచారం చేసిన పాట లేకపోవటం తమను చాలా మానసిక వ్యధకు గురి చేసిందని అన్నారు.

తమ టిక్కెట్ ఛార్జెస్ 2, 600 లు తిరిగి ఇవ్వటమే కాకుండా యాభై వేల రూపాయలు తమకు ఇంత మానసిక వ్యధ కలిగించినందుకు ఇప్పించాలని కోరారు. ఈ కేసు ఏప్రియల్ 22 న తేలనుంది.

షారుక్ ఖాన్ తాజా సినిమా 'ఫ్యాన్' సరికొత్త రికార్డును తన ఖాతాలో వేసుకుంది. విడుదలైన తొలి వారాంతంలోనే రూ.52.35 కోట్లు కలెక్ట్ చేసి.. 2016లో తొలి వీకెండ్ లో భారీ కలెక్షన్లు రాబట్టిన సినిమాగా రికార్డు సృష్టించింది. ఇప్పటివరకు రూ.44.30 కోట్ల కలెక్షన్లతో తొలి స్థానంలో నిలిచిన అక్షయ్ కుమార్‌ 'ఎయిర్ లిఫ్ట్' ను ఫ్యాన్ అధిగమించింది. శుక్రవారం ప్రేక్షకుల ముందుకు వచ్చిన ఈ సినిమా మూడు రోజుల్లో రూ. 52 కోట్ల అదిరే కలెక్షన్లను సొంతం చేసుకుంది.

Mental torture case filed on Sharukh's Fan film

ఆర్యన్ ఖన్నా అనే సినీ హీరోను అమితంగా అభిమానించే గౌరవ్ అనే కుర్రాడు.. కొన్ని సంఘటనల అనంతరం అతడిని ద్వేషించడం మొదలుపెడతాడు. సదరు ఫ్యాన్ కి, సినీ హీరోకి మధ్య జరిగే కథే 'ఫ్యాన్' సినిమా. షారుక్.. ఆర్యన్ గా, గౌరవ్ గా ద్విపాత్రాభినయం చేసిన విషయం తెలిసిందే.

తన చిన్న కుమారుడు అబ్ రామ్ సినిమా చూస్తూ 'టూ టూ పప్పాస్' (ఇద్దరిద్దరు నాన్నలు) అంటూ సంభ్రమాశ్చర్యాలు వ్యక్తం చేసిన విషయాన్ని మురిసిపోతూ ట్వీట్ చేశాడు కింగ్ ఖాన్.

ఫ్యాన్ సృష్టిస్తున్న రికార్డులను చూసి కింగ్ ఖాన్ ఫుల్ ఖుషీగా ఉన్నాడు. కాగా 2015లో సల్మాన్ 'భజరంగీ భాయ్ జాన్' రూ.102.6 కోట్ల తొలి వీకెండ్ కలెక్షన్లతో సునామీ సృష్టించగా.. ఆమిర్ 'పీకే' రూ. 95.21 కోట్ల కలెక్షన్లతో రెండో స్థానంలో నిలిచింది. చూడబోతే ఫ్యాన్ ఈ ఏడాది భారీ వసూళ్ల లిస్ట్ లో చేరే అవకాశం కనిపిస్తోంది.

English summary
A case has been filed recently in court by a customer for mental torture and harassment at cinemas for watching the recent Bollywood biggie ShahRukh’s Fan. The complaint was filed by Sangeeta Chandgothia against PVR Cinemas (Elante Mall), Yash Raj Films Private Limited and Shahrukh Khan. It was alleged in the complaint that though the whole film promotion had Jabra song as title song but it was not there in the film.
 

తక్షణ సినీ వార్తలు, మూవీ రివ్యూలను రోజంతా పొందండి - Filmibeat Telugu