»   » సూపర్ హాట్ అండ్ సెక్సీ‌గా కరీనా ఐటం సాంగ్ (వీడియో)

సూపర్ హాట్ అండ్ సెక్సీ‌గా కరీనా ఐటం సాంగ్ (వీడియో)

Posted By:
Subscribe to Filmibeat Telugu

బాలీవుడ్‌ నటులు అక్షయ్‌ కుమార్‌, సిద్ధార్థ్‌ మల్హోత్రా ముఖ్య పాత్రల్లో నటించిన చిత్రం 'బ్రదర్స్‌'. ఇందులో కరీనా కపూర్‌ ఖాన్‌ 'మేరా నామ్‌ మేరీ' అనే ఓ ఐటం సాంగ్‌లో కనిపించనుంది. ఇటీవల సాంగ్ టీజర్ రిలీజ్ చేసి అభిమానులను ఊరించిన నిర్మాతలు తాజాగా పూర్తి సాంగును రిలీజ్ చేసారు. సూపర్ హాట్ లుక్ తో కరీనా కపూర్ ఆకట్టుకుంటోంది. సాంగ్ సినిమాకు మరింత ప్లస్ అవడంతో యూత్ ను థియేటర్ల వైపు పరుగులు పెట్టించే విధంగా ఉంది.

‘బ్రదర్స్' సినిమానికొస్తే...
ఈ చిత్రం 2011లో వచ్చిన హాలీవుడ్‌ చిత్రం 'వారియర్‌'కి రీమేక్‌. ధర్మా ప్రొడక్షన్స్‌ నిర్మిస్తున్న ఈ చిత్రంలో సిద్ధార్థ్‌ మల్హోత్రా, అక్షయ్‌ కుమార్‌, జాక్వెలీన్‌ ఫెర్నాండెజ్‌, జాకీ ష్రాఫ్‌ ముఖ్య పాత్రల్లో నటిస్తున్నారు. ఈ చిత్రం ఆగస్టు 14న ప్రేక్షకుల ముందుకు రానుంది.

Kareena Kapoor

అక్షయ్‌ కుమార్‌, సిద్ధార్థ్‌ మల్హోత్రా కలిసి నటించిన బ్రదర్స్‌ చిత్రంలో ఇద్దరూ సరికొత్త లుక్‌లో కనిపించనున్నారు. ఈ చిత్రంలో జాకీష్రాఫ్‌ కీలకమైన పాత్రలో నటించారు. ముగ్గురూ ఈ చిత్రంలో చిరుగడ్డంతో రఫ్‌గా కనిపించనున్నారు.

English summary
Watch Kareena Kapoor Khan sizzle in the hottest song of the year 'Mera Naam Mary' from Brothers. The movie stars Akshay Kumar, Sidharth Malhotra, Jackie Shroff and Jacqueline Fernandes, releases on August 14th, 2015.
Please Wait while comments are loading...
 

తక్షణ సినీ వార్తలు, మూవీ రివ్యూలను రోజంతా పొందండి - Filmibeat Telugu