TRENDING ON ONEINDIA
-
మంత్రి ఆదికి షాక్: జమ్మలమడుగు అభ్యర్ధిని తేల్చేసారు
-
మీ పాత కారుని కొత్తగా మార్చటం ఎలా.?
-
రూ.4999కే led hd smart tv, ఎలా సొంతం చేసుకోవాలో తెలుసుకోండి
-
వాళ్లంతా మహానుభావులు.. అమ్మాయిల క్లీవేజ్, తొడలు చూసేస్తారు.. నాగబాబు ఘాటు వ్యాఖ్యలు!
-
కోబ్రా దెబ్బకు షారుఖ్ కంపెనీ గింగిరాలు?
-
చీర కట్టుకోవడాన్ని అమితంగా ఇష్టపడుతారా ? ప్రయాణాలకు ఈ చీరలు
రూ. 60 కోట్ల నష్టం.... రూ. 250 కోట్ల వసూళ్లు, భారీ లాభాలు ఉత్తిదేనా?

తమిళ నటుడు విజయ్ హీరోగా నటించిన 'మెర్సల్' మూవీ విడుదలైన తర్వాత వివాదాల్లో ఇరుక్కున్న సంగతి తెలిసిందే. ఈ వివాదాల్లోనూ సినిమా భారీ విజయం సాధించిందని, రూ. 250 కోట్ల వసూళ్లు సాధించింది నిర్మాతలకు భారీ లాభాలు తెచ్చినట్లు ప్రచారం జరిగింది. ఇదే చిత్రం తెలుగులో 'అదిరింది' పేరుతో విడుదలైన సంగతి తెలిసిందే.
అయితే ఈ సినిమా విషయంలో లాభాలు వచ్చినట్లు జరుగుతున్న ప్రచారంలో నిజం లేదని, నష్టాలు వచ్చాయంటూ కొత్త వివాదం తెరపైకి వచ్చింది. బీజేపీ నేత, నటుడు ఎస్ వి శేఖర్ ఈ చిత్రం విషయంలో సంచలన కామెంట్స్ చేశారు.
‘మెర్సల్’ చిత్రానికి రూ. 60 కోట్ల నష్టం
‘మెర్సల్' సినిమా విషయంలో నిర్మాతలు చూపుతున్న లెక్కలు తప్పడు లెక్కలే అని, ఈ చిత్రానికి రూ. 60 కోట్ల నష్టం వచ్చిందని, సినిమాకు పెట్టిన కొన్ని అనవసరమైన ఖర్చులే ఇందుకు కారణమని తెలిపారు.
హీరో, డైరెక్టర్ భారీగా తీసుకున్నారు
ఈ సినిమాకు విజయ్ తన రావాల్సిన రెమ్యూనరేషన్ తీసుకున్నారు. గత సినిమాకు రూ. 3 కోట్ల పారితోషికం తీసుకున్న దర్శకుడు అట్లీ ఈ చిత్రానికి రూ. 13 కోట్లు తీసుకున్నారు. ఇది చాలా దారుణం. ఒక సినిమాకు రూ. 3 కోట్లు తీసుకున్న డైరెక్టర్ తర్వాతి సినిమాకు రూ. 5 కోట్ల వరకు తీసుకోవచ్చు. కానీ రూ. 13 కోట్లు తీసుకోవడం ఏమిటి? ఇలాంటి అనవసర ఖర్చులు చాలా పెట్టారు. అందుకే సినిమా ఇంత భారీ నష్టాల్లోకి వెళ్లింది అని ఎస్.వి.శేఖర్ అన్నారు.
నిర్మాతలు బయటకు చెప్పడం లేదు
సినిమాకు ఇంత భారీ నష్టాలు వచ్చినా నిర్మాతలు బయటకు చెప్పడం లేదు. తమ సినిమా బాహుబలి తర్వాత భారీ వసూళ్లు సాధించిన చిత్రం అంటూ..... నష్టాల విషయాన్ని దాచే ప్రయత్నం చేస్తున్నారు అని పలువురు ఆరోపిస్తున్నారు.
జిఎస్టీ కూడా చెల్లించాలి
సినిమాకు లాభాలు వస్తే దానికి ప్రకారం ప్రభుత్వానికి జిఎస్టీ కూడా చెల్లించాలి. ఈ రోజుల్లో సినిమా అనేది గాంబ్లింగ్ అయిపోయింది. నిజాన్ని మనం ఒప్పుకోవాలి. మరి నిర్మాతలు లాభాలకు జిఎస్టీ చెల్లిస్తారో? లేదో? మార్చి 31, 2018 వరకు వెయిట్ చేద్దాం అంటూ... ఎస్.వి.శేఖర్ ట్వీట్ చేశారు.
మెర్సల్
మెర్సల్ సినిమాకు అట్లీ దర్శకత్వం వమించారు. విజయ్, కాజల్, సమంత, నిత్యా మీనన్, ఎస్.జె.సూర్య నటించిన ఈ చిత్రాన్ని అక్టోబర్ 18న విడుదల చేశారు. ఇండియా టుడే రిపోర్ట్ ప్రకారం ఈ చిత్రం రూ. 220 కోట్లు వసూలు చేసింది. ఇందులో రూ. 150 కోట్లు ఇండియా నుండే వచ్చాయి. ఐబి టైమ్స్ రిపోర్ట్ ప్రకారం ఈ చిత్రం ఒక్క చెన్నైలోనే రూ. 14 కోట్లు వసూలు చేసి బాహుబలి 2 తర్వాత సిటీలో హయ్యెస్ట్ గ్రాస్ సాధించిన చిత్రంగా నిలిచింది.