»   »  ముందు రోజు మణి తో బీర్ తీసుకున్నా...పోలీస్ ఎంక్వైరీలో

ముందు రోజు మణి తో బీర్ తీసుకున్నా...పోలీస్ ఎంక్వైరీలో

Posted By:
Subscribe to Filmibeat Telugu

హైదరాబాద్ : కళాభవన్ మణి మరణాన్ని కేరళ పోలీసులు అసహజ మరణం గా కేసు నమోదు చేసిన సంగతి తెలిసిందే. ఆయన శరీరంలో మిధైల్ ఆల్కహాల్ ఉండటం గమనించంలో ఇలా కేసుని రిజిస్టర్ చేసామని చెప్పారు. ఈ మృతిపై సందేహాలు వ్యక్తం చేసారు. ఈ నేపధ్యంలో ఎంక్వైరీ జరుగుతోంది.

మణి స్నేహితుడు, నటుడు జప్పర్ మాట్లాడుతూ... మణి మరణానికి ముందు రోజు ఆయన అవుట్ హౌస్ లో మిత్రులందరం కలిసామని చెప్పారు. అలాగే ఆయనతో కలిసి ఓ బీర్ తీసుకున్నానని పోలీసులకు చెప్పారు. ఆయన స్నేహితులు, బంధువులు అందరూ ఓ పదిమంది దాకా కలిసామని అన్నారు. అప్పుడు మణి చాలా ఆరోగ్యంగా, సంతోషంగా ఉన్నారని అన్నారు.

మణి కూడా ఓ బీర్ ని మాత్రమే నాతో కలిసి తీసుకున్నారు. ఇంకెవరూ మధ్యం తీసుకోలేదు. నేను ఓ సినిమా విషయమై డిస్కస్ చేయటానికి వెళ్లాను. అలాగే మణిని చంపాలని ఎవరూ అనుకోరని, అలాంటివారు ఉన్నారంటే నమ్మబుద్ది కావటం లేదని అన్నారు. అలాగని మణిది సూసైడ్ చేసుకునే మనస్తత్వం కూడా కాదని చెప్పారు. ఆయన రక్తంలో విషం ఉన్న విషయాన్ని ఎంక్వైరీ చేసి బయిట పెట్టాలని ఆయన కోరారు.

Met Kalabhavan Mani to discuss a film, says Jaffer Idukki...

ఈ విషయమై ఆయన సోదరుడు రామకృష్ణన్ ...సెక్షన్ 174 క్రింద ఎఫైర్ ఫైల్ చేసారు . దాంతో కంప్లైంట్ తీసుకున్న స్టేషన్ కు చెందిన పోలీస్ సర్కిల్ ఇన్సిపెక్టర్ తో పాటు ఓ టీమ్ ని ఈ కేసు ని డిప్యూటి సూపర్ డెంట్ ఆఫ్ పోలీస్ సుధాకరన్ ఆధర్వంలో నియమించటం జరిగింది.

త్రిసూల్ రూరల్ ఎస్సై కార్తీక్ మాట్లాడుతూ.. " ఎఫైర్ ని ఫైల్ చేసాం, డాక్టర్స్ ని, మిగతా వారని క్వచ్చిన్ చేస్తున్నాం. పోస్ట్ మార్టం రిపోర్ట్, మిగతా మెడికల్ రిపోర్ట్ లు వచ్చిన తర్వాత పూర్తి ధృవీకరణకు రాగలం ." అన్నారు.

మొదట ఆయన శరీరాన్ని ఆయన ఎక్కడైతే మరణించారో... అదే ( కొచ్చిలోని అమృత) హాస్పటిల్ లోని మార్చురికి షిప్ట్ చేసారు. తర్వాత దాన్ని త్రిసూర్ లోని మెడికల్ కాలేజి కు తరలించారు.

Met Kalabhavan Mani to discuss a film, says Jaffer Idukki...

మణి శరీరంలో మిధైల్ ఆల్కహాల్ ఉందని వస్తున్న వార్తలపై మాట్లాడుతూ... ఇప్పుడేం ఏం చెప్పలేం...ఏ విషయంలోనూ కంక్లూజన్ కు రాలేం. మెడికల్ రిపోర్ట్ లు రావాల్సిందే అని తేల్చి చెప్పారు పోలీసులు.

ఇక శనివారం ఆయన త్రిసూర్ లోని తన అవుట్ హౌస్ లో కాన్షష్ లో లేని స్దితిలో హాస్పటిల్ కు తరలించారు. మొదట ఆయన్ను లోకల్ హాస్పటిల్ లో ఎడ్మిట్ చేసారు. అయితే కండీషన్ మరీ చేజారిపోయేటట్లు ఉండటంతో ఎలర్టై అమృత హాస్పటిల్ కు పంపారు.

అమృత హాస్పటిల్ లో ఆయన శరీరంలో మోతాదు కు మించిన మిధైల్ ఆల్కహాల్ ఉండటం గమనించి, పోలీసులను ఎలర్ట్ చేసారు. కానీ ఆ పరిస్దితుల్లో మణి మాట్లాడే స్ధితిలో లేకపోవటంతో స్టేట్ మెంట్ తీసుకోలేకపోయారు. అయితే పోలీసులు అవుట్ హౌస్, ఆయన ఇంటి దగ్గరలోనూ, ఆయన ముగ్గరు స్నేహితులతో గడిపిన చోట సెర్చ్ చేసారు. ఆయన స్నేహితుల నుంచి కూడా స్టేట్ మెంట్ తీసుకోనున్నారు.

మిమిక్రీ కళాకారుడిగా గుర్తింపు పొందిన ఆయన 'అక్షరం' అనే మలయాళ సినిమాతో నటుడిగా తన ప్రయాణాన్ని మొదలుపెట్టారు. మలయాళ, తమిళ, తెలుగు భాషల్లో దాదాపు 200కు పైచిలుకు సినిమాల్లో విలన్, హాస్య పాత్రల్లో నటించిన కళాభవన్ మణి 'వాసంతియుమ్ లక్ష్మియుమ్ పిన్నెన్జానుమ్' (ఈ సినిమానే తెలుగులో ఆర్.పి. పట్నాయక్ 'శ్రీను వాసంతి లక్ష్మీ' పేరుతో రీమేక్ చేశారు) సినిమాతో జాతీయ అవార్డ్ (స్పెషల్ జ్యూరీ) అందుకున్నారు.

నెగిటివ్ పాత్రలకు మిమిక్రీ జోడించి దక్షణాది ప్రేక్షకులకు చేరువైన మణి తెలుగులో 'జెమిని', 'ఆయుధం', 'అర్జున్', 'నరసింహుడు', 'ఎవడైతే నాకేంటి' సినిమాల్లో నటించారు. 1971 జనవరి 1న కేరళలోని చలక్కుడిలో జన్మించిన ఆయన సినీ పరిశ్రమకు రాకమునుపు ఆటో డ్రైవర్‌గానూ పనిచేశారు. గాయకుడిగా, సంగీత దర్శకుడిగాను చేసిన మణి ఓ సినిమాకు కథ కూడా అందించారు.

English summary
Malayalam actor Jaffer Idukky has said that he met actor Kalabhavan Mani before a day of his death and had a beer with him. Police have grilled Jaffer yesterday.
Please Wait while comments are loading...
 

తక్షణ సినీ వార్తలు, మూవీ రివ్యూలను రోజంతా పొందండి - Filmibeat Telugu