»   » గౌతమ్ మీనన్ కి నచ్చింది, కానీ నాగచైతన్య కు నచ్చలేదా, అసలు కథేంటి?

గౌతమ్ మీనన్ కి నచ్చింది, కానీ నాగచైతన్య కు నచ్చలేదా, అసలు కథేంటి?

Posted By:
Subscribe to Filmibeat Telugu

హైదరాబాద్ : గౌతమ్ మీనన్, నాగచైతన్య కాంబినేషన్ లో వచ్చి రిలీజైన సాహసం శ్వాసగా సాగిపో గురించి కాదీ న్యూస్. అన్ని చిత్రాలు అందరికీ నచ్చాలని రూల్ లేదు. అవకాసం అంతకన్నా లేదు. అంతెందుకు... ఆ మధ్యన తమిళంలో మంచి హిట్టై, అందరి ప్రశంసలు అందుకున్న 'మెట్రో' చిత్రాన్ని ని తెలుగులో నాగచైతన్య రీమేక్ చేస్తాడని అంతా భావించారు.

అయితే చైతూ ఆ సినిమాని చూసి తన ఇమేజ్ కు సెట్ కాదని భావించారట. దాంతో ఆ ప్రాజెక్టు ముందుకు వెళ్లలేదు. కానీ ఈ చిత్రం దర్శకుడు గౌతమ్ మీనన్ కు తెగ నచ్చేసిందిట. ఆ విషయం ఆయనే స్వయంగా చెప్పారు. ఇక ఈ చిత్రాన్ని డబ్ చేసి తెలుగులో కి రిలీజ్ చేస్తున్నారు.

ప్రేమిస్తే, జర్నీ, షాపింగ్‌మాల్‌, పిజ్జా చిత్రాలను తెలుగువారికి అందించిన సురేష్‌ కొండేటి సమర్పణలో రజని తాళ్లూరి ఈ చిత్రాన్ని ప్రేక్షకుల ముందుకు తీసుకువస్తున్నారు. తాజాగా హైదరాబాద్‌లో 'మెట్రో' తెలుగు ట్రైలర్‌ని ప్రముఖ దర్సకుడు గౌతమ్ మీనన్ విడుదల చేశారు. ఆ ట్రైలర్ ని మీరు ఇక్కడ చూడండి.

మరి ఈ చిత్రం కథేంటయ్యా అంటే.. కన్న తల్లి చావుకు కారణమైన చైన్ స్నాచర్‌ను పట్టుకునే జర్నలిస్ట్ రోల్‌లో చైతూ కనిపిస్తాడట. ఈ క్రమంలో అతను తెలుసుకున్న నిజాలేమిటి? చైన్ స్నాచర్ల అసలు లక్ష్యం ఏమిటి? హీరో ఎలా పగ తీర్చుకున్నాడనే సబ్జెక్ట్‌తో తెరకెక్కిన చిత్రం మెట్రో. క్రిమినల్ మైండ్స్‌ను ఎక్స్‌పోజ్ చేస్తూ క్రైం థ్రిల్లర్‌గా తెలుగులో డబ్బింగ్ అయ్యి రాబోతున్న ఈ సినిమా ఇక్కడ వారినీ అలరిస్తుందని భావిస్తున్నారు.

గౌత‌మ్ మీన‌న్ మాట్లాడుతూ ... మెట్రో ఫెంటాస్టిక్ మూవీ. త‌మిళంలో రిలీజైన ఈ చిత్రం పెద్ద విజ‌యం సాధించింది. తెలుగులో అంత‌కుమించిన విజ‌యం సాధిస్తుంది. చైన్ స్నాచింగ్ బ్యాక్‌డ్రాప్‌లో ఇంట్రెస్టింగ్ ఎలిమెంట్స్‌తో తెర‌కెక్కిన న్యూ ఏజ్ సినిమా. న‌వ‌త‌రానికి బాగా న‌చ్చుతుంది. ఈ సినిమాకి ప‌నిచేసిన టీమ్‌కి మంచి పేరొచ్చింది. తెలుగులో రిలీజ్ చేస్తున్న సురేష్ కొండేటి- ర‌జ‌నీ తాళ్లూరికి నా బెస్ట్ విషెస్ అన్నారు.

Metro movie trailer launched by Gautham Menon

నిర్మాత ర‌జ‌నీ తాళ్లూరి మాట్లాడుతూ -డ‌బ్బింగ్ స‌హా అన్ని ప‌నులు పూర్తి చేసుకున్న ఈ సినిమా త్వ‌ర‌లో రిలీజ్‌కి వ‌స్తోంది. గౌత‌మ్ మీన‌న్ అంత‌టి స్టార్ డైరెక్ట‌ర్ మా సినిమా ట్రైల‌ర్ లాంచ్ చేసి, సినిమా తెలుగువారికి న‌చ్చుతుంద‌ని ప్ర‌శంసించ‌డం సంతోషాన్నిచ్చింది. ఈ సినిమా పెద్ద విజ‌యం సాధిస్తుంద‌న్న న‌మ్మ‌కం ఉంది అన్నారు.

స‌మ‌ర్ప‌కుడు సురేష్ కొండేటి మాట్లాడుతూ -ఏ నిర్మాత అయినా.. ఆయ‌న కాల్షీట్లు ఇస్తే త‌న‌తో సినిమా తీయాల‌నుకుంటారు. అంత గొప్ప స్టార్ డైరెక్ట‌ర్ గౌత‌మ్ మీన‌న్‌. ఆయ‌న మెట్రో ట్రైల‌ర్‌ని లాంచ్ చేయ‌డం చాలా సంతోషాన్నిచ్చింది. ఈ సినిమా నాకెంతో న‌చ్చిన సినిమా అని గౌత‌మ్ మీన‌న్ చెప్పారంటే విజ‌యంపై మా న‌మ్మ‌కం మ‌రింత రెట్టింపైంది. గౌత‌మ్ గారికి ప్ర‌త్యేక ధ‌న్య‌వాదాలు. నేను నిర్మించిన జ‌ర్నీ సినిమాని మించి మెట్రో విజ‌యం సాధిస్తుంద‌న్న న‌మ్మ‌కం ఉంది. అంద‌రూ ఆద‌రిస్తార‌ని ఆశిస్తున్నా అన్నారు.

English summary
Gautham Menon launched the trailer of Bobby Simha starrer 'Metro', directed by Ananda Krishnan. Suresh Kondeti is presenting the film.
 

తక్షణ సినీ వార్తలు, మూవీ రివ్యూలను రోజంతా పొందండి - Filmibeat Telugu