twitter
    For Quick Alerts
    ALLOW NOTIFICATIONS  
    For Daily Alerts

    బాలకృష్ణకు ఒక న్యాయం.. చిరంజీవికి మరో న్యాయమా? ఘాటుగా స్పందించిన పేర్ని నాని

    |

    తెలుగు సినిమా పరిశ్రమలో నెలకొన్న సమస్యలను ఏపీ ప్రభుత్వం దృష్టికి తీసుకొచ్చేందుకు మంత్రి పేర్ని నానితో సినీ పంపిణీ దారులు భేటీ అయ్యారు. ఈ సమావేశంలో ఏపీలోని 13 జిల్లాలకు చెందిన ప్రతినిధులు పాల్గొన్నారు. తెలుగు ఫిల్మ్ ఛాంబర్ ఆఫ్ కామర్స్ కార్యదర్శి, వీరు నాయుడు నేతృత్వంలో మంత్రిని కలిశారు. ఈ భేటీ తర్వాత మంత్రి పేర్ని నాని మాట్లాడుతూ..

    ఏపీలో థియేటర్ యాజమాన్యాలు

    ఏపీలో థియేటర్ యాజమాన్యాలు

    ఏపీలో థియేటర్ యాజమాన్యాలు నిబంధనలు పాటించడం లేదు. అగ్నిమాపక దళం నుంచి ఎన్‌వోసీ తీసుకోవడం లేదు. సినిమా థియేటర్ నడపాలంటే రెవెన్యూ డిపార్ట్ మెంట్ నుంచి అనుమతులు తీసుకోవాలి. అలా అనుమతులు తీసుకోకుండానే సినిమా హాళ్లను నడుపుతున్నారు. అయితే అనుమతులు తీసుకోని వారిపై రెన్యూవల్ చేయించుకోమని తనిఖీలు చేశాం. అంతే కానీ కక్ష సాధింపు చర్యలు మాత్రం కాదు. గతంలో సెప్టెంబర్‌లో డిస్ట్రిబ్యూటర్లు, ఎగ్జిబిటర్లతో సమావేశం పెట్టాం. కానీ వారు సరిగా స్పందించలేదు అని మంత్రి పేర్ని నాని చెప్పారు.

    అభూత కల్పనతో ఆపాదిస్తున్నారంటూ

    అభూత కల్పనతో ఆపాదిస్తున్నారంటూ

    ఇండస్ట్రీకి సంబంధించి ఏ సమస్యలను వినడానికి వైఎస్ జగన్ ప్రభుత్వం సిద్దంగా ఉంది. అవాస్తవాలను, అభూత కల్పనతో ప్రభుత్వానికి ఎదో అపాదించి మాట్లాడటం ధర్మం కాదు. ప్రజలకు మెరుగైనటువంటి, వినోదాన్ని అందిస్తాం. కోర్టు ఆదేశాల మేరకే ప్రభుత్వ విధానాలు ఉన్నాయి. ఒకరి మీద సినిమా పరిశ్రమ నడుస్తుందా? నేనే సినిమా ఇండస్ట్రీ అంటే అమాయకత్వమే అని ఓ ప్రశ్నకు పేర్ని నాని ఘాటుగా స్పందించారు.

    RRR సినిమా గురించి పేర్ని నాని

    RRR సినిమా గురించి పేర్ని నాని

    RRR సినిమా గురించి గానీ, పెద్ద సినిమా అని మేము కామెంట్ చేయలేదు. ప్రభుతానికి విధానాలు, చట్టాల ప్రకారమే మేము స్పందిస్తాం. అంతే కానీ.. ఒకరికి ఒకరకంగా, మరొకరికి మరో రకంగా ప్రభుత్వం నిర్ణయాలు తీసుకోదు. గతంలో చంద్రబాబు తమ బామ్మర్ది తీసే సినిమాకి రాయితీ ఇచ్చారు. కానీ చిరంజీవి తీస్తే రాయితీ ఇవ్వలేదు. కానీ సీఎం జగన్ అందరిని ఒకేలా చూస్తారు అని పేర్ని నాని చెప్పారు.

    ఎగ్జిబిటర్లు అనుమతులు లేకుండా

    ఎగ్జిబిటర్లు అనుమతులు లేకుండా

    మంత్రి పేర్ని నానితో భేటి అనంతరం సినిమా పంపిణి దారులు మాట్లాడుతూ.. సినిమా టికెట్ల ధరలు పెంచమని వారు అడిగాం. మేము పలు సినిమాలలో పెట్టుబడి పెట్టి ఉన్నాం. కార్పొరేషన్‌లో కనిష్టంగా ఏసీ థియేటర్లలో రూ. 50 గరిష్టంగా రూ. 150 ఆడిగాం. అన్ని కేటగిరీలలో రేట్లు పెంచాలని కోరాం. కొందరు ఎగ్జిబిటర్లు అనుమతులు లేకుండా కొన్ని థియేటర్లు నడిపారు. లైసెన్స్‌లు పునరుద్ధరించేందుకు నాలుగు వారాల సమయం ఆడిగాం. థియేటర్లు మూసేస్తే మాకు వ్యాపారపరంగా నష్టం వాటిల్లుతుంది. అందుకే వెసలుబాటు కల్పించాలని వారి తరఫున మేము ప్రభుత్వాన్ని కోరాం అని ఎగ్జిబిటర్లు వెల్లడించారు.

    English summary
    Andhra Pradesh Cinemotography minister Perni Nani met Film exhibitors in Amaravathi. In this occassion, Minister Perni Nani Comments on Chandrababu, Balakrishna, Chiranjeevi
     
    న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
    Enable
    x
    Notification Settings X
    Time Settings
    Done
    Clear Notification X
    Do you want to clear all the notifications from your inbox?
    Settings X
    X