»   »  మిర్చిలాంటి కుర్రాడికి రిలీజ్ డేట్ ఇచ్చారు...

మిర్చిలాంటి కుర్రాడికి రిలీజ్ డేట్ ఇచ్చారు...

Posted By:
Subscribe to Filmibeat Telugu

హైదరాబాద్: బాలకృష్ణతో ‘లయన్‌' వంటి హిట్‌ మూవీని నిర్మించిన నిర్మాత రుద్రపాటి రమణారావు నిర్మాతగా అభిజిత్‌, ప్రగ్యాజైశ్వాల్‌ హీరో హీరోయిన్లుగా రుద్రపాటి ప్రేమలత సమర్పణలో ఎస్‌.ఎల్‌.వి.సినిమా బ్యానర్‌పై రూపొందిన చిత్రం ‘మిర్చిలాంటి కుర్రాడు'. జయనాగ్‌ దర్శకుడు. ఈ సినిమాని జూలై 31న వరల్డ్‌ వైడ్‌గా గ్రాండ్‌ లెవల్లో విడుదల చేస్తున్నారు.

ఈసందర్భంగా.... చిత్ర నిర్మాత రుద్రపాటి రమణారావు మాట్లాడుతూ ‘‘నటసింహ నందమూరి బాలకృష్ణ హీరోగా విడుదల చేసిన లయన్‌ సినిమా పెద్ద విజయాన్ని సాధించిన సంగతి విదితమే. ఇప్పుడు యంగ్‌ హీరోతో అభిజీత్‌తో చేసిన మిర్చిలాంటి కుర్రాడు చిత్రాన్ని విడుదల చేస్తున్నాం. ఈ సినిమాకి జె.బి. బ్యూటిఫుల్‌ మ్యూజిక్‌ ఇచ్చారు. ఈ మధ్య కాలంలో విడుదలైణ థియేట్రికల్‌ ట్రైలర్‌, పాటలకు మంచి స్పందన వచ్చింది. మంచి యూత్‌ ఫుల్‌ ఎంటర్‌టైనర్‌గా తెరకెక్కుతోన్న ఈ సినిమా ద్వారా జయనాగ్‌ దర్శకుడిగా పరిచయం అవుతున్నారు. అభిజిత్‌, ప్రగ్యా జైశ్వాల్‌ సహా మంచి టీమ్‌ ఈ సినిమాకి పనిచేసింది. జె.బి. మ్యూజిక్‌, ప్రవీణ్‌పూడి ఎడిటింగ్‌, ఆర్‌.ఎం.స్వామి సినిమాటోగ్రఫీ సినిమాకి ప్లస్‌ పాయింట్స్ అవుతాయి' అన్నారు.

Mirchi Lanti Kurradu release on 31 July

లవ్‌తో పాటు, యాక్షన్‌, సెంటిమెంట్‌ సహా అన్నీ ఎలిమెంట్స్‌ ఉన్న చిత్రమిది. ఎక్కడా కాంప్రమైజ్‌ కాలేదు. సెన్సార్‌ సహా అన్నీ కార్యక్రమాలను పూర్తి చేసి సినిమాని జూలై 31న వరల్డ్ వైడ్‌గా విడుదల చేస్తున్నామని తెలిపారు. రావు రమేష్‌, షకలక శంకర్‌, పృథ్వి, సుప్రీత్‌ తదితరులు ఇతర తారాగణంగా నటిస్తున్నారు. ఈ చిత్రానికి మాటలు: వీరబాబు బాసిన, కెమెరా: ఆర్‌.ఎం.స్వామి, సంగీతం: జె.బి, ఎడిటర్‌: ప్రవీణ్‌పూడి, డ్యాన్స్‌: రమేష్‌, సాహిత్యం: భాస్కరభట్ల, వరికుప్పల యాదగిరి, వశిష్ఠశర్మ, నిర్మాతం రుద్రపాటి రమణారావు, కథ,స్క్రీన్‌ప్లే, దర్శకత్వం: జయనాగ్‌.

English summary
Tollywood movie Mirchi Lanti Kurradu release on 31 July.
Please Wait while comments are loading...