»   » ‘జనతా గ్యారేజ్’...లాస్ట్ మినట్లో షాకిచ్చిన సమంత!

‘జనతా గ్యారేజ్’...లాస్ట్ మినట్లో షాకిచ్చిన సమంత!

Posted By:
Subscribe to Filmibeat Telugu

హైదరాబాద్: యంగ్ టైగర్ ఎన్టీఆర్ నటించిన జనతా గ్యారేజ్ ఆడియో రిలీజ్ ఫంక్షన్ మరికొన్ని గంటల్లో గ్రాండ్ గా జరుగబోతున్న తరుణంలో తాను రావడం లేదంటూ నిర్వాహకులకు షాకిచ్చింది ఈ చిత్ర హీరోయిన్ సమంత. తనకు ఒంట్లో బాగోలేదని, ఆడియో వేడుకను మిస్సవుతున్నందుకు బాధగా ఉందంటూ ట్వీట్ చేసింది.

సమంత ఆడియో వేడుకకు హాజరైంది అంటే ఆమె డ్రెస్సింగ్ స్టైల్.... ఆడియో వేడుకలో ఆమె మాట్లాడే తీరు ఆకట్టుకునే విధంగా ఉంటుంది. దీంతో పాటు అభిమానులకు అందాల ఆరబోత అదనం. అయితే సమంత గైర్హాజరుతో ఎంతో కొంత వెలితి కనిపించడం ఖాయం.యంగ్ టైగర్ ఎన్టీఆర్ హీరో గా, సక్సెస్ఫుల్ డైరెక్టర్ కొరటాల శివ దర్శకత్వం లో మైత్రీ మూవీస్ సంస్థ నిర్మిస్తోన్న భారీ చిత్రం 'జనతా గ్యారేజ్' . ఎన్టీఆర్ సరసన సమాంతా, నిత్యా మీనన్ లు కథానాయికలు గా కనిపిస్తారు. ప్రఖ్యాత మళయాళం నటుడు మోహన్ లాల్ ఈ చిత్రం లో ఒక ప్రధాన పాత్రను పోషిస్తున్నారు. దేవి శ్రీ ప్రసాద్ సంగీతం అందిస్తోన్న ఈ చిత్రం ఆడియో ను లహరి మ్యూజిక్ ద్వారా విడుదల చేయటం జరుగుతుంది.


సాయి కుమార్, ఉన్ని ముకుందన్, అజయ్, బ్రహ్మాజీ, బెనర్జీ , జాన్ ,సితార, దేవయాని వంటి ప్రఖ్యాత నటులు ఈ చిత్రం లో ముఖ్య పత్రాలను పోషిస్తున్నారు.


ఈ చిత్రానికి సినిమాటోగ్రఫి - తిరు . ఎడిటింగ్ - కోటగిరి వెంకటేశ్వర రావు . ఆర్ట్ - ఎ. ఎస్. ప్రకాష్. ఫైట్స్ - ఆణల్ అరసు. సంగీతం : దేవీ శ్రీ ప్రసాద్ . ఎక్సిక్యుటివ్ ప్రొడ్యూసర్ - చంద్రశేఖర్ రావిపాటి . నిర్మాతలు - నవీన్ యెర్నేని, వై. రవిశంకర్, మోహన్ (C. V. M.) రచన - దర్శకత్వం - కొరటాల శివ.


English summary
"Not doing so well today 😭Miss you at the audio😘 #JanathaGarage #amaze #audioout" Samantha tweeted.
 

తక్షణ సినీ వార్తలు, మూవీ రివ్యూలను రోజంతా పొందండి - Filmibeat Telugu