»   » నా కడుపు నిండలేదు, ఖరీదైన కారు కూడా లేదు: కీరవాణి

నా కడుపు నిండలేదు, ఖరీదైన కారు కూడా లేదు: కీరవాణి

Posted By:
Subscribe to Filmibeat Telugu

హైదరాబాద్: భారతదేశంలో సొంత థియేటర్‌, ఖరీదైన కారు లేని పెద్ద సంగీత దర్శకుడ్ని నేనే అని అన్నారు ప్రముఖ సంగీత దర్శకుడు కరీవాణి. బాహుబలి 2 ప్రమోషన్లో భాగంగా ఓ ప్రముఖ పత్రిక ఇంటర్వ్యూలో కీరవాణి పలు ఆసక్తికర వ్యాఖ్యలు చేసారు.

నన్ను చూసిన చాలా మంది కీరవాణిది కడుపు నిండిన బేరం అనుకుంటారు. కానీ నేనేం పెద్దగా సంపాదించలేదు. నా భార్యా బిడ్డల్ని క్షేమంగా చూసుకొనేంత మాత్రమే సంపాదించా అని కీరవాణి చెప్పుకొచ్చారు.


నా కడుపు నిండలేదు

నా కడుపు నిండలేదు

నా కడుపు నిండలేదు. కడుపు అంటే ఇక్కడ తిండి కాదు. ఆత్మ సంతృప్తి. నేను చేయగలిగే పని వేరు. చేస్తోంది వేరు. నేను ఎంత సంపాదిస్తే అంతలోనే బతికా. ‘మగధీర' తరవాత కూడా ఖరీదైన కారు కొనలేకపోయా అని కీరవాణి చెప్పుకొచ్చారు.


పారితోషికం నచ్చకపోతే పనిచేయను

పారితోషికం నచ్చకపోతే పనిచేయను

కొందరు గాయనీ గాకులకు పారితోషికాలు చాలా తక్కువ ఇస్తున్నారనే విమర్శలపై దానిపై కీరవాణి స్పందిస్తూ... ఎంత ఇస్తే ఎక్కువ, ఎంత ఇస్తే తక్కువ అనేదానికి కొలమానం లేదు. ఓ గాయకుడికి పారితోషికం నచ్చలేదంటే మరోసారి పిలిచినప్పుడు రాడు. వచ్చాడంటే తనకొస్తున్న పారితోషికం విషయంలో సంతోషంగా ఉన్నాడన్నమాటే. నా వరకూ నేను పారితోషికం నచ్చకపోతే పనిచేయను. గాయనీ గాయకులు కూడా ఇలానే ఉండాలి అని కీరవాణి అన్నారు.


దర్శకులను తిట్టే గీతరచయితల కొరత ఉంది

దర్శకులను తిట్టే గీతరచయితల కొరత ఉంది

వేటూరి, సిరివెన్నెల లాంటి గీత రచయితలకు ఒక్క పాట రాసినా, పాటలన్నీ వాళ్లే రాసినా కథ చెప్పి తీరాల్సిందే. ‘ఇదేం కథ..' అని తిట్టిన సందర్భాలు నాకు తెలుసు. గీత రచయిత పని పాట రాయడం మాత్రమే కాదు. కొన్ని కొన్ని సార్లు దర్శకుడికి దిశా నిర్దేశం చేయాలి. అలాంటి రచయితలు ఎవరైనా ఉన్నారా? నాకు తెలిసినంత వరకూ జొన్నవిత్తుల గారిది ఇదే పద్ధతి. ఆయన మహా పండితుడు. సన్నివేశం నచ్చకపోతే తిట్టరు గానీ, అక్కడ్నుంచి లేచి వెళ్లిపోతారు. నాతో సహా మిగిలినవాళ్లంతా నాలుగు డబ్బుల కోసం పనిచేస్తాం. మేమెక్కడ తిడతాం? నోరు మూసుకొని పనిచేయాలి. ఏదైనా అందామంటే ఉద్యోగం పోతుంది. వేటూరి, సిరివెన్నెల ఏనాడూ రాజీ పడలేదు. కాబట్టే.. ఆమధ్య ట్విట్టర్‌లో ‘వాళ్ల తరవాత ఇంకెవరూ లేరు' అని అన్నాను అని కీరవాణి చెప్పుకొచ్చారు.


వివాదాస్పద కామెంట్లతో చెలరేగిన కీరవాణి

వివాదాస్పద కామెంట్లతో చెలరేగిన కీరవాణి

ఇటీవలు బాహుబలి 2 ప్రీ రిలీజ్ ఫంక్షన్ సమయంలోనూ... మరో సందర్భంలో కీరవాణి ట్విట్టర్లో విదాదాస్పద ట్వీట్లు చేస్తూ రెచ్చిపోయారు. అందుకు సంబంధించిన విశేషాల కోసం క్లిక్ చేయండి.English summary
MM Keeravani about his remuneration and work. Check out Keeravani interview details here.Koduri Marakathamani Keeravaani, better known as M. M. Keeravani, is an Indian film music composer and playback singer, who works in Telugu, Tamil, Kannada, Malayalam and Hindi cinema.
 

తక్షణ సినీ వార్తలు, మూవీ రివ్యూలను రోజంతా పొందండి - Filmibeat Telugu