twitter
    For Quick Alerts
    ALLOW NOTIFICATIONS  
    For Daily Alerts

    కీరవాణి స్వరాలతో... శేఖర్ కమ్ముల

    By Srikanya
    |

    హైదరాబాద్ : హిందీలో విజయవంతమైన 'కహానీ' తెలుగులో 'అనామిక' పేరుతో పునర్నిర్మితమవుతున్న సంగతి తెలిసిందే. నయనతార హీరోయిన్ గా ప్రధాన పాత్రలో నటిస్తున్న ఈ చిత్రానికి శేఖర్‌ కమ్ముల దర్శకత్వం వహిస్తున్నారు. ఎమ్‌.ఎమ్‌.కీరవాణి ఈ చిత్రానికి స్వరాలు అందిస్తున్నారు.

    ఇటీవలే మ్యూజిక్ సిట్టింగ్ మొదలయ్యాయి. కీరవాణితో పని చేయడం శేఖర్‌కి ఇదే ప్రథమం. అనామిక చిత్రీకరణ హైదరాబాద్‌ పరిసరాల్లో సాగుతోంది. ఇందులో వైభవ్‌ ఓ ముఖ్య పాత్రలో కనిపిస్తారు. తెలుగుతోపాటు తమిళంలోనూ దీన్ని రూపొందిస్తున్నారు. ఎండెమోల్‌ ఇండియా, లాగ్‌లైన్‌ ప్రొడక్షన్స్‌, సెలెక్ట్‌ మీడియా హోల్డింగ్స్‌ సంస్థలు కలిసి ఈ చిత్రాన్ని నిర్మిస్తున్నాయి.

    అలాగే ఈ చిత్రంలో వైభవ్‌ పోలీసు కానిస్టేబుల్‌ పాత్రను పోషిస్తున్నారు. ఈ కథలో కీలకమైన పాత్ర ఇది. ప్రస్తుతం హైదరాబాద్‌లో సన్నివేశాలు చిత్రిస్తున్నారు.

    ఎండర్ మోల్ ఇండియా, లాగ్ లైన్ ప్రొడక్షన్స్, సెలక్ట్ మీడియా హోల్డింగ్ సంస్థలు సంయుక్తంగా ఈ చిత్రాన్ని నిర్మిస్తున్నాయి. కహానీ చిత్రం కోల్ కతా బ్యాక్ డ్రాప్‌తో సాగుతుంది. అయితే ఈ చిత్రాన్ని తెలుగు నేటివిటీకి తగిన విధంగా హైదరాబాద్ ఓల్డ్ సిటీ నేపథ్యాన్ని ఎంచుకున్నాడు దర్శకుడు శేఖర్ కమ్ముల.

    ఈ చిత్రానికి ప్రముక నావెలిస్ట్ యండమూరి వీరేంద్రనాధ్ ఈ చిత్రానికి సహాయ రచయితగా పని చేస్తున్నారు. విజయ్ సి. కుమార్ సినిమాగ్రఫీ చేయనున్నారు. సినిమా కథ విషయానికొస్తే... కనిపించకుండాపోయిన తన భర్త గురించి ఒక ఎన్ ఆర్ ఐ గర్భిణి చేసే అన్వేషణే ఈ కహానీ చిత్ర కథ. అనేక హాలీవుడ్ సినిమాల స్ఫూర్తి‌తో చేసిన ఈ సినిమా హిందీలో ఘన విజయం సాధించడంతో తెలుగులో కూడా మంచి విజయం సాధిస్తుందనే నమ్మకంతో ఉన్నారు దర్శక నిర్మాతలు.

    English summary
    Director Sekhar Kammula joins hands with senior music director M M Keeravani. All this for his current film, Anamika starring Nayanathara in the lead role.
     
    న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
    Enable
    x
    Notification Settings X
    Time Settings
    Done
    Clear Notification X
    Do you want to clear all the notifications from your inbox?
    Settings X
    X