»   » ప్రాక్టికల్ జోక్ చేసినందుకు బాలీవుడ్ నటికి మూడేళ్ళ జైలు శిక్ష

ప్రాక్టికల్ జోక్ చేసినందుకు బాలీవుడ్ నటికి మూడేళ్ళ జైలు శిక్ష

Posted By:
Subscribe to Filmibeat Telugu

మామూలుగా అయితే ప్రాక్తికల్ జోక్ కి నవ్వుకుంటాం, కాస్త చిరాకు వచ్చినా పర్లేదు లే అని వదిలేస్తాం కానీ భద్రతా అధికారులతో అదీ ఎయిర్ పోర్ట్ సిబ్బంది తో జోకులేస్తే ఊరుకుంటారా? జోకేసింది మోడల్ అయినా, నటి అయినా తమకు సంబన్స్దం లేదంటూ అమ్మగారి చేతికి అరదండాలేసారు.

ముంబై మోడల్ కం నటి కంచన్ ఠాకూర్ చేసిన చిలిపి పనికి ఎయిర్ ఇండియా విమానం గంట ఆలస్యంగా బయలుదేరింది. విచారణ చేపట్టిన అధికారులు.. చెడ్డ రూమర్లను వ్యాప్తి చేసినందుకు ఐపిసి 505 (1) (బి) చట్టం క్రింద కంచన్ పై ఎఫ్.ఐ.ఆర్ నమోదు చేశారు. ఆమెకు మూడు సంవత్సరాల కారాగార శిక్ష పడే ఛాన్సుంది. ఇంతకీ ఈ మేడమ్ గారేం చేసారూ అంటే....

గురువారం రాత్రి కంచన్ ఠాకూర్ అనే మోడల్, నటి తన ముగ్గురు స్నేహితులతో కలసి ఎయిరిండియా విమానంలో ఢిల్లీ వెళ్లేందుకు ఎయిర్ పోర్టుకు వచ్చింది. ఆమె బోర్డింగ్ గేట్ దాటిన తర్వాత విమాన భద్రత సిబ్బంది దగ్గరకు వెళ్లి తన స్నేహితురాలి హ్యాండ్ బ్యాగ్‌లో బాంబు ఉందని, జాగ్రత్తగా తనిఖీ చేయాలని కోరింది. దీంతో అక్కడున్నవారు భయపడిపోయారు.

Model arrested for bomb scare at Mumbai International Airport

భద్రత సిబ్బంది వెంటనే ఈ విషయాన్ని సీఐఎస్ఎఫ్, విమానాశ్రయ అధికారులకు తెలియజేశారు. సీఐఎస్ఎఫ్ అధికారులు వెంటనే వచ్చి మోడల్, ఆమె స్నేహితులను ప్రశ్నించారు. నలుగురిని, వారి లగేజీని వదిలి వెళ్లాల్సిందిగా ఎయిరిండియా సిబ్బందికి సూచించారు. దీంతో కంగారు పడిపోయిన మోడల్ తాను జోక్ చేశానని, స్నేహితురాలి బ్యాగ్‌లో బాంబు లేదని చెప్పింది.

ఈ దశలో సీఐఎస్ఎఫ్‌ సిబ్బందికి, మోడల్‌కు వాగ్వాదం జరిగింది. మోడల్‌తో పాటు ఆమె స్నేహితులను వదిలేసి గంట ఆలస్యంగా విమానం బయల్దేరింది. షెడ్యూల్ సమయం ప్రకారం రాత్రి 9 గంటలకు బయల్దేరాల్సిన ఉండగా, 10 గంటలకు వెళ్లింది.

ఇష్టమొచ్చినట్లే జోకులేస్తే తీసుకోవడానికి ఇదేమన్నా సినిమా ఏంటండీ? సినిమాల్లో అయితే ఎటువంటి ప్రభుత్వం ఉద్యోగిపైనానా.. అలాగే ఎలాంటి ప్రదేశంలోనైనా జోకులు వేయొచ్చు. కాని రియల్ లైఫ్ లో అలాగే చేసినందుకు మాత్రం.. ఈ సెక్సీ మోడల్ ఇప్పుడు జైలు ఊచలు లెక్కెట్టడానికి రెడీ అవుతోంది.

English summary
A model from Mumbai didn't know that her thoughtless prank at Mumbai International Airport would land her into trouble.
 

తక్షణ సినీ వార్తలు, మూవీ రివ్యూలను రోజంతా పొందండి - Filmibeat Telugu