»   » ‘మొగలి పువ్వు’: ప్రతి మగాడు టెంప్ట్ అవుతాడు (ట్రైలర్)

‘మొగలి పువ్వు’: ప్రతి మగాడు టెంప్ట్ అవుతాడు (ట్రైలర్)

Posted By:
Subscribe to Filmibeat Telugu

హైదరాబాద్ : వివాదాస్పద దర్శకుడు రామ్ గోపాల్ వర్మ త్వరలో ‘మొగిలి పువ్వు' అనే చిత్రం ద్వారా ప్రేక్షకుల ముందుకు రాబోతున్నారు. తాజాగా ఈ చిత్రానికి సంబంధించిన ట్రైలర్ విడుదల చేసారు. వివాహేతర సంబంధాల నేపథ్యంలో ఈ చిత్రం తెరకెక్కించారు.

ప్రతి పెళ్ళైన మగాడూ బయట ఒక అందమైన అమ్మాయి కనిపిస్తే టెంప్ట్ అవుతాడు..ప్రతి భార్య తన భర్తకేదైనా ఒక సీక్రెట్ ఎఫైర్ ఉందేమోనని భయపడుతూ వుంటుంది. ప్రతి పెళ్ళైన వాడి సెల్ ఫోన్ లో తన భార్యకి తెలియని సీక్రెట్ లు ఉంటాయి. ఎఫైర్ లు అనేవి పెళ్లి వ్యవస్థ పుట్టినప్పటినుంచీ వున్నాయి.

కాని సెల్ ఫోన్లలో పాస్ వర్డ్ లు, వాట్స్అప్ లు, పేస్ టైం లు కెమెరాలు వగైరా వచ్చినప్పటినుంచి అవి ఒక భయంకర స్థితికోచ్చేసాయి.... టెక్నాలజీయే కాకుండా స్త్రీల పై అత్యచారాలని అరికట్టడానికి కొత్తగా వచ్చిన నిర్భయ లాంటి చట్ట సవరణలు స్త్రీ పురుష సంబంధాలలో భూకంపాలు పుట్టిస్తున్నాయి. ఇలాంటి బ్యాక్ గ్రౌండ్ తీసుకుని రాసిన కధే "మొగలిపువ్వు". ఇది ఒక రొమాన్సు, ఫ్యామిలీ డ్రామాలతో కూడిన సైకాలాజికల్ క్రైమ్ థ్రిల్లర్ అంటున్నారు రామ్ గోపాల్ వర్మ.

English summary
Mogali Puvvu Movie Official Trailer. “Every husband has secrets hidden inside his cell phone and If wives can access them, 75% marriages will end .”- A prominent social psychologist.
Please Wait while comments are loading...
 

తక్షణ సినీ వార్తలు, మూవీ రివ్యూలను రోజంతా పొందండి - Filmibeat Telugu