»   » దాసరి నన్ను బూటుకాలితో తన్నడం వల్లే ఇలా : మోహన్ బాబు

దాసరి నన్ను బూటుకాలితో తన్నడం వల్లే ఇలా : మోహన్ బాబు

Posted By:
Subscribe to Filmibeat Telugu

హైదరాబాద్: ప్రముఖ తెలుగు నటుడు మోహన్ బాబు సినిమా పరిశ్రమలో 40 ఏళ్ల ప్రస్థానాన్ని పూర్తి చేసుకున్న సంగతి తెలిసిందే. ఈ సందర్భంగా హైదరాబాద్ లో జరిగిన కార్యక్రమంలో ఆయన పలు ఆసక్తికర విషయాలు చెప్పుకొచ్చారు. గురువుగారు దాసరి నారాయణరావు చేతిచలవ వల్లే తాను ఇపుడు ఈ స్థాయిలో ఉన్నానని చెప్పుకొచ్చారు.

నాకు తండ్రి తర్వాత తండ్రి లాంటి వారు దాసరిగారు. నా జీవితంలో నేనెవరికైనా రుణపడి ఉన్నానంటే అది ఆయనకే. ఆయన సినిమాలో అవకాశం ఇచ్చి, నా పేరు మార్చి, నాకు సినిమా జీవితాన్ని ప్రసాదించారు. ఆయన శిక్షణలోనే నడిగా ఎదిగాను. ఎన్టీఆర్ తర్వాత ఆ స్థాయిలో డైలాగులు చెప్పగలననే పేరు తెచ్చుకున్నాను. ఓ సినిమాలో డైలాగు సరిగా చెప్పకపోతే దాసరిగాను నన్ను బూటికాలితో తన్ని ఇలా చెప్పాలి అని నేర్పించారు. ఆరోజు బాధతో వెనక్కి వెళ్లిపోదామనుకున్నాను. కానీ దాసరిగారు అ పునాది వేసి ఉండక పోతే నేను ఇపుడు ఈ స్థాయిలో ఉండే వాన్ని కాదన్నారు.

ఇక దాసరి మాట్లాడుతూ...అందరూ నటులను పరిచయం చేసి వదిలేస్తారు. కానీ నేను మోహన్ బాబులోని పరిపూర్ణమైన నటుడిని పరిచయం చేసే వరకు వదల్లేదు. విలన్ గా, హీరోగా, నిర్మాతగా రాణించడం కేవలం మోహన్ బాబుకే సాధ్యమైంది. మోహన్ బాబు నా పెద్ద కొడుకు లాంటి వాడని, అతని కుటుంబం అంటే నా కుటుంబమే. మోహన్ బాబు 50 ఏళ్ల పండగను మరింత గ్రాండ్ గా చేసుకోవాలి అన్నారు.

Mohan Babu 40 Years in Film Industry Celebrations

సాధార‌ణ మ‌ధ్య త‌ర‌గ‌తి కుటుంబంలో పుట్టిన భ‌క్త‌వ‌త్స‌లం నాయుడు సినిమాల‌పై ఆస‌క్తితో చెన్నై న‌గ‌రాన్ని చేరుకున్నారు. దాసరి నారాయ‌ణ‌రావు ద‌ర్శ‌క‌త్వంలో1975, న‌వంబ‌ర్ 22న విడుద‌లైన స్వ‌ర్గం-న‌ర‌కం సినిమాతో న‌టుడుగా తెలుగు తెర‌కు మోహ‌న్‌బాబుగా ప‌రిచయం అయ్యారు. ప్ర‌స్తుతం టాలీవుడ్‌లో డైలాగ్స్ ఏ స్ట‌యిల్‌లో చెబితే ప్రేక్ష‌కులకు రీచ్ అవుతుందో ఆ స్ట‌యిల్లో చెప్ప‌గ‌ల దిట్ట‌. పాత్రేదైనా అందులో ప‌ర‌కాయ ప్ర‌వేశం చేసి ఆ పాత్ర‌ను ర‌క్తి క‌ట్టించ‌గ‌ట బ‌హుకొద్దిమంది న‌టుల్లో క‌లెక్ష‌న్‌కింగ్ ఒక‌రు. అందుకే ఆయ‌న ఒక‌టి కాదు..రెండు కాదు..ఏకంగా 520 చిత్రాల‌కు పైగా న‌టించి మెప్పించారు.

ప్ర‌తినాయకుడిగా విల‌క్ష‌ణ విల‌నిజాన్ని పండించిన మోహ‌న్‌బాబు అల్లుడుగారు, అసెంబ్లీరౌడీ, రౌడీ గారి పెళ్ళాం, పెద‌రాయుడు, మేజ్ చంద్ర‌కాంత్..ఇలా 181 చిత్రాల్లో నాయ‌కుడిగా న‌వ‌ర‌సాలు పండించారు. ఆయ‌న హీరోగా న‌టించిన చిత్రాల‌న్నీ బాక్సాఫీస్ వ‌ద్ద కలెక్ష‌న్స్‌ను కొల్ల‌గొట్ట‌డంతో ప్రేక్ష‌కులు, అభిమానుల గుండెల్లో క‌లెక్ష‌న్ కింగ్ అయ్యారు. అలాగే ల‌క్ష్మీ ప్ర‌స‌న్న పిక్చ‌ర్స్ బ్యాన‌ర్‌ను స్టార్ట్ చేసి 50కి పైగా విజ‌య‌వంత‌మైన చిత్రాల‌ను నిర్మించి స‌క్సెస్‌ఫుల్ నిర్మాత‌గా పేరు తెచ్చుకున్నారు.

English summary
Dasari Narayana Rao Praises Mohan Babu At Mohan Babu 40 Years in Film Industry Celebrations.
Please Wait while comments are loading...
 

తక్షణ సినీ వార్తలు, మూవీ రివ్యూలను రోజంతా పొందండి - Filmibeat Telugu