»   » తెలంగాణ శకుంతల హఠాన్మరణం బాధాకరం

తెలంగాణ శకుంతల హఠాన్మరణం బాధాకరం

Posted By:
Subscribe to Filmibeat Telugu

హైదరాబాద్: తెలుగు తెరపై టిపికల్ తెలంగాణ స్లాంగుతో అదరగొట్టిన నటి తెలంగాణశకుంతల విలనిజం,కామెడీ, సెంటిమెంట్...ఇలా ఎటువంటి పాత్రనైనా అవలీలగా పోషించగల సత్తా ఉన్న నటి ఆమె. అటువంటి మహానటి నేడు మన మధ్య లేక పోవడం బాధాకరం. నాతో పాటు పలు చిత్రాల్లో నటించిన తెలంగాణ శంకుతల మేంరూపొందిన అన్ని చిత్రాల్లోనూ కీలక పాత్రలు పోషించింది.

'పాండవులు పాండవులు తుమ్మెద' చిత్రంలో కూడా తన నటనతో అదరగొట్టింది. స్వతహాగా స్టేజ్ ఆర్టిస్ట్ అయిన తెలంగాణ శకుంతల స్వయం శక్తితో నటిగా వెలుగొందిన వైనం ప్రశంసనీయం. తెలుగు చిత్రసీమలో తెలంగాణ శకుంతల స్థానం భర్తీ చేయడం అనితరసాధ్యం.

Mohan Babu condolence to Shakuntala

సినీ నటి తెలంగాణ శకుంతల(65) శుక్రవారం అర్ధరాత్రి కన్నుమూశారు. కొంపల్లిలోని తన స్వగహంలో శకుంతల గుండెపోటుతో మృతి చెందారు. తెలుగులో వచ్చిన 'మాభూమి' చిత్రం ద్వారా తెరంగ్రేటం చేసిన ఆమె తెలంగాణ యాసతో తనకంటూ ప్రత్యేక గుర్తింపు తెచ్చుకున్నారు.

English summary
Telangana Shakuntala, popular comedian actress who stole the hears of many of fans across the world is no more.
 

తక్షణ సినీ వార్తలు, మూవీ రివ్యూలను రోజంతా పొందండి - Filmibeat Telugu