»   » పవన్, నాగార్జునపై సెటైరిక్‌గా మోహన్ బాబు కామెంట్!

పవన్, నాగార్జునపై సెటైరిక్‌గా మోహన్ బాబు కామెంట్!

Posted By:
Subscribe to Filmibeat Telugu

హైదరాబాద్: పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ మొన్న నరేంద్రమోడీని కలిసి తన మద్దతు ప్రకటించిన సంగతి తెలిసిందే. ఆ సంగటన జరిగిన కొన్ని రోజులకే అక్కినేని నాగార్జున కూడా స్వయంగా అహ్మదాబాద్ వెళ్లి మోడీని కలిసారు. మోడీ భారత ప్రధాని కావాలని, అప్పుడే అభివృద్ధి జరుగుతుందని వ్యాఖ్యానించారు.

పవన్ కళ్యాణ్, నాగార్జున వరుసగా మోడీని వెళ్లి కలిసిన నేపథ్యంలో.....మోహన్ బాబు కూడా బీజేపీ తీర్థం పుచ్చుకునే అవకాశం ఉందనే ప్రచారం మీడియాలో మొదలైంది. ఆ మధ్య మెడీ హైదరాబాద్ వచ్చినపుడు మోహన్ బాబు కుటుంబ సమేతంగా వెళ్లి ఆయన్ను కలవడమే ఈ ప్రచారానికి మూలం.

Mohan Babu deny rumours about their political entry

అయితే తాను బీజేపీలో చేరబోతున్నట్లు వస్తున్న వార్తలను మోహన్ బాబు ఖండించారు. మేం రాజకీయాల్లోకి ప్రవేశించబోతున్నట్లు ఊహాగానాలు వినిపించాయి. నేను అందరి లాంటి వాడిని కాదని మోహన్ బాబు ట్విట్టర్లో వ్యాఖ్యానించారు. ఇలా వ్యాఖ్యానించడం ద్వారా మోహన్ బాబు పరోక్షంగా పవన్ కళ్యాణ్, నాగార్జునపై సెటైర్లు వేసారనే అభిప్రాయం వ్యక్తం అవుతోంది.

మరో వైపు మోహన్ బాబు కూతురు మంచు లక్ష్మి కూడా బీజేపీలో చేరుతున్నట్లు వార్తలు వినిపించాయి. దీనిపై లక్ష్మి స్పందిస్తూ తనకు అలాంటి ఉద్దేశ్యం లేదని, తాను ఎన్నికల్లో పోటీ చేయడం లేదని స్పష్టం చేసారు. అయితే మోడీ లాంటి వారికి తన మద్దతు ఎప్పుడూ ఉంటుందని తెలపారు.

English summary
“Hearing some absurd news coming in TV channels that I am getting ready to take a plunge into Politics. As of now It’s humbug! Unlike others, I don’t change my colours,” Mohan Babu posted on Twitter.
 

తక్షణ సినీ వార్తలు, మూవీ రివ్యూలను రోజంతా పొందండి - Filmibeat Telugu