»   » మహానటి: ఎస్వీ రంగారావు పాత్రలో మోహన్ బాబు?

మహానటి: ఎస్వీ రంగారావు పాత్రలో మోహన్ బాబు?

Posted By:
Subscribe to Filmibeat Telugu

హైదరరాబాద్: ప్రముఖ నటి సావిత్రి జీవితం ఆధారంగా తెరకెక్కుతున్న బయోపిక్ 'మహానటి'లో సీనియర్ ఎన్టీఆర్ పాత్రలో జూ ఎన్టీఆర్ నటించబోతున్నారంటూ ప్రచారం మొదలైన సంగతి తెలిసిందే. అయితే ఈ విషయం ఇంకా అఫీషియల్‌గా ఖరారు కాలేదు.

తాజాగా ఈ సినిమాకు సంబంధించి మరో ఆసక్తికరమైన వార్త వెలుగులోకి వచ్చింది. ఈ సినిమాలో ప్రముఖ నటుడు మోహన్ బాబు నటించబోతున్నారని, ఆయన లెజెండరీ తెలుగు యాక్టర్ ఎస్వీ రంగారావు పాత్రలో కనిపించబోతున్నారని టాక్.


Mohan Babu to Play SVR in Mahanati

మొదట ఈ పాత్రకు ప్రకాష్ రాజ్ ను అనుకున్నారని, అయితే మోహన్ బాబు కంటే ప్రకాష్ రాజ్ బెటరనే కారణంతో ఈ నిర్ణయం తీసుకున్నట్లు సమాచారం. ఎస్వీ రంగారావు పాత్ర చేయడం అంటే ఏ నటుడికైనా గర్వకారణమే.


'మహానటి'లో సావిత్రి పాత్రలో కీర్తి సురేష్ నటిస్తోంది. మళయాలం హీరో దుల్కర్ సల్మాన్ ఈ చిత్రంలో జెమినీ గణేశన్ పాత్రకు ఎంపికయ్యాడు. నాగ్ అశ్విన్ దర్శకత్వం వహిస్తున్న ఈ చిత్రాన్ని అశ్వినీదత్ కూతురు నిర్మిస్తోంది. ఈ చిత్రంలో సమంత, విజయ్ దేవరకొండ కూడా ముఖ్యమైన పాత్రలు పోషిస్తున్నట్లు సమాచారం.


English summary
There is no confirmation yet over whether NTR Jr will be essaying the role of Sr NTR in 'Mahanati', but the makers have reportedly pulled off a major casting master stroke. As per the buzz in film circles, veteran actor Manchu Mohan Babu has been roped in to play the character of legendary Telugu actor SV Ranga Rao. Versatile actor Prakash Raj was earlier under consideration to essay this role.
Please Wait while comments are loading...
 

తక్షణ సినీ వార్తలు, మూవీ రివ్యూలను రోజంతా పొందండి - Filmibeat Telugu