»   » ఇంతకీ బాలయ్య పెగ్ తెమ్మన్నది ఎవరిని?: పైసా వసూల్ సాంగ్ పై మోహన్ బాబు సెటైర్

ఇంతకీ బాలయ్య పెగ్ తెమ్మన్నది ఎవరిని?: పైసా వసూల్ సాంగ్ పై మోహన్ బాబు సెటైర్

Posted By:
Subscribe to Filmibeat Telugu

'పైసా వసూల్' ఆడియో సక్సెస్ మీట్ లో మోహన్ బాబు గెస్ట్ గా పాల్గొన్నాడు. ఈ కార్యక్రమానికి రావాలని బాలయ్య స్వయంగా పిలిచాడని, తనకు చెన్నై వెళ్లాల్సిన పని వున్నా, ఇది తన ఇంటి ఫంక్షన్ గా భావించి వచ్చానని చెప్పిన మోహన్ బాబు ఈ మూవీలో బాలకృష్ణ తన తండ్రి ఎన్టీర్ నటించిన సినిమాలోని ఒక పాటను 'పైసా వసూల్' మూవీ కోసం రీమిక్స్ చేసిన విషయం తెలిసిందే. ఈ విషయం పై మోహన్ బాబు స్పందిస్తూ ఎన్టీఆర్ డ్యాన్సుల్ని అనుకరించే ప్రయత్నం ఎవరు చేసినా అది సాహసమే అవుతుంది అని అంటూ ఎన్టీఆర్ లాగా బాలయ్యే కాదు ఎవ్వరూ చేయలేరని అంటూ షాకింగ్ కామెంట్స్ చేసాడు.

మామా ఏక్ పెగ్ లా

మామా ఏక్ పెగ్ లా

బాలయ్య ‘మామా ఏక్ పెగ్ లా..' అంటూ పాట పాడాడని.. ఐతే అతను ఎవరిని ఉద్దేశించి ఆ పాట పాడాడో తనకు తెలియాలని మోహన్ బాబు అన్నారు. బాలయ్య మావా అంటున్నది ఎవరి గురించా అని తనకు కుతూహలంగా ఉందని చెప్పారు. బాలయ్య బావ చంద్రబాబు అయితే మద్యం ముట్టరని.. తనకు ఆ విషయం తెలుసని.. ఈ విషయం చంద్రబాబును కూడా ఫోన్ చేసి అడుగుదామనుకుంటున్నానని.. మరి బాలయ్య ఎవరిని ‘మావా ఏక్ పెగ్ లా' అని అడిగాడో తెలియాలని మోహన్ బాబు చమత్కరించారు.

101 కోట్లు కలెక్షన్స్

101 కోట్లు కలెక్షన్స్

ఐతే బాలయ్య ఈ పాట మాత్రం చాలా బాగా పాడాడని మోహన్ బాబు అభిప్రాయపడ్డారు. ఈ మూవీ బాలకృష్ణ నటిస్తున్న 101వ సినిమా కాబట్టి ఈ సినిమాకు 101 కోట్లు కలెక్షన్స్ రావ్వాలి అంటూ మరో ట్విస్ట్ ఇచ్చి ఈమూవీ కలెక్షన్స్ కు సంబంధించి కొత్త టార్గెట్స్ ఇచ్చాడు. అయితే ఈ కార్యక్రమానికి వచ్చిన చాలామంది మాత్రం మోహన్ బాబు తన అభిప్రాయాలను వెల్లడించడంలో తన సన్నిహితులను కూడ వదలడు అని కామెంట్ చేసుకున్నట్లు టాక్.

ఎన్టీఆర్ ని అనుకరించే ప్రయత్నం

ఎన్టీఆర్ ని అనుకరించే ప్రయత్నం

‘పైసా వసూల్'లోని ఓ పాటలో బాలయ్య తన తండ్రి ఎన్టీఆర్ డ్యాన్సుల్ని అనుకరించే ప్రయత్నం చేశాడని.. ఐతే ఎన్టీఆర్ లాగా బాలయ్యే కాదు ఎవ్వరూ చేయలేరని.. ఈ సినిమా చూసి బాలయ్య సరిగా చేయలేదని అనిపిస్తే ఫోన్ చేసి బాలయ్యకు ఆ విషయం చెబుతానని మోహన్ బాబు అన్నారు.

గురువు దాసరి నారాయణరావు ఎలాగో.

గురువు దాసరి నారాయణరావు ఎలాగో.

తనకు తన తల్లిదండ్రులు.. గురువు దాసరి నారాయణరావు ఎలాగో.. ఎన్టీఆర్ అన్నా అంతే అభిమానమని మోహన్ బాబు చెప్పారు. పూరి జగన్నాథ్ తో తాను ‘బుజ్జిగాడు' సినిమా చేశానని.. అతనంత వేగంగా షూటింగ్ చేసే దర్శకులు చాలా అరుదని.. అతను గొప్ప దర్శకుడని కితాబిచ్చారు మోహన్ బాబు.

English summary
Mohan Babu setire om Blakrishna song in Paisa Vasool movie
 

తక్షణ సినీ వార్తలు, మూవీ రివ్యూలను రోజంతా పొందండి - Filmibeat Telugu