»   » మోహన్ బాబు ట్వీట్...శృతి హాసన్ కి ఇబ్బంది

మోహన్ బాబు ట్వీట్...శృతి హాసన్ కి ఇబ్బంది

Posted By:
Subscribe to Filmibeat Telugu

హైదరాబాద్ ముక్కుసూటితనానికి పేరొందిన మోహన్ బాబు తను చేసిన ఓ ట్వీట్ ద్వారా శృతి హాసన్ ని ఇబ్బందుల్లో పడేసారు. అయితే అది పొరపాటున చేసిన ట్వీట్. రీసెంట్ గా రజనీకాంత్ కుమార్తె సౌందర్య దర్శకత్వంలో రూపొందుతున్న కొచ్చాడియన్ చిత్రం పంక్షన్ కి ఆయన హాజరుకావాల్సింది... బిజీ షెడ్యూల్స్ తో వెళ్లలేకపోయారు. అయితే ఈ విషయాన్ని తెలుపుతూ విషెష్ తెలియచేస్తూ ఆయన ట్వీట్ చేయాలనుకున్నారు. కానీ ఆ ట్వీట్ లో సౌందర్య అని ట్యాగ్ చేయాల్సిన పొరపాటున శృతి హాసన్ అని చేసారు. దాంతో ఫేస్ బుక్,ట్విట్టర్ లలో ఈ విషయమై కొద్ది సేరు జోకులు పేలాయి. ట్విట్టర్ లో శృతి అభిమానులు ఈ విషయమై ఆమెకు ట్వీట్స్ చేసారు. దాంతో శృతి హాసన్ కి సైతం ఆ విషయం తలనొప్పిగా మారింది. కాకపోతే కాస్సేపటికి మోహన్ బాబు దాన్ని సరిచేసారు.

Mohan Babu tweet puts Shruthi in trouble!

ఇంతకీ మోహన్ బాబు ఇచ్చిన ట్వీట్ ఏమిటంటే.."Unavoidable circumstances had me miss dear friend Rajinikanth's daughter @ shrutihaasan event. Here's wishing her very best with the movie (sic)." ఇందులో రజనీ కుమార్తె శృతి హాసన్ అని ఉండటం జరిగింది.

ఇక మోహన్ బాబు, ఆయన తనయుడు ముఖ్య పాత్రల్లో సంచలన దర్శకుడు రాం గోపాల్ వర్మ దర్శకత్వంలో ఎ.వి. పిక్చర్స్ పతాకంపై విజయ్ కుమార్,ఆర్.పి.గజేంద్రనాయుడు-ఎం, పార్థసారధినాయుడు సంయుక్తంగా నిర్మిస్తున్న చిత్రం రౌడీ. ఈ సినిమా లో మోహన్ బాబుకు జంటగా జయసుధ,విష్ణు సరసన శాన్వి నటిస్తున్నారు.

ఈ సినిమాను రామ్ గోపాల్ వర్మ రికార్డు స్థాయిలో చాలా తక్కువ రోజుల్లో పూర్తి చేయడం విశేషం. అంతే స్పీడుతో ఈ నెల 28న సినిమాను విడుదల చేయడానికి సన్నాహాలు చేస్తున్నారు. ఈ చిత్రం ఆడయోను త్వరలో విడుదల చేయడానికి స్నాహాలు చేస్తున్నారు. ఇటీవల విడుదలైన రౌడీ సినిమా టీజర్ కు చాలా మంచి స్పందన లభించింది. ఈ టీజర్ తో సినిమా మీద ఎక్స్ పెక్టేషన్స్ పెరిగాయి. ఈ సినిమా తప్పకుండా మంచి విజయం సాధిస్తుందనే నమ్మకం ఉంది అన్నారు నిర్మాతలు.

English summary

 Mohan Babu tweeted “Unavoidable circumstances had me miss dear friend Rajinikanth’s daughter shrutihaasan event. Here’s wishing her very best with the movie (sic).”
 

తక్షణ సినీ వార్తలు, మూవీ రివ్యూలను రోజంతా పొందండి - Filmibeat Telugu