»   » మంచు వారి మనవరాలు కూడా తెరమీదికి వస్తున్నట్టేనా..?

మంచు వారి మనవరాలు కూడా తెరమీదికి వస్తున్నట్టేనా..?

Posted By:
Subscribe to Filmibeat Telugu

కలెక్షన్ కింగ్ మోహన్ బాబు ఇటు హీరోగానే కాకుండా అటు విలన్‌గా కూడా అలరించిన సంగతి తెలిసిందే. అప్పట్లో మోహన్ బాబు చెప్పే డైలాగ్స్‌కు ఆడియన్స్‌లో యమ క్రేజ్ ఉండేది. ఆయన బాటలోనే తనయులు మంచు విష్ణు, మంచు మనోజ్ లు హీరోలుగా రాణిస్తుండగా, తనయ మంచు లక్ష్మీ వైవిధ్యమైన పాత్రలలో నటిస్తూ ఆకట్టుకుంటుంది.

ముద్దుల మనుమరాలితో మోహన్ బాబు ...బాగా ఎంజాయ్ చేస్తున్నారు. మంచు లక్ష్మి కుమార్తె ..విద్యా నిర్వాణ తో ఆయన ఇదిగో ఇలా ఆడుకుంటున్నారు. తన మనుమరాలికి పాలు పట్టిస్తూ ఇదిగో ఇలా కెమెరాకు దొరికిపోయారు. మొన్నటివరకూ తన పెద్ద కుమారుడు మంచు విష్ణు కుమార్తెలు అరియానా, ఇరియానా లతో కాలం సరదాగా కాలక్షేపం చేసారు. ఆయన తాత గా ఇలా ఎంజాయ్ చేస్తున్నారు.

Mohan babu with Lakshmi Manchu's Daughter Vidya Nirvana

న‌టి, నిర్మాత‌, టెలివిజ‌న్ వ్యాఖ్యాత‌గా పేరొందిన మంచుల‌క్ష్మి అన్ని రంగాల్లోనూ త‌న‌దైన శైలిలో గుర్తింపు తెచ్చుకుంది. ఎప్పుడు చూసినా ల‌క్ష్మి నే క‌నిపిస్తుంది, త‌న భ‌ర్త ఎక్కువ‌గా ఎక్క‌డా క‌నిపించ‌డు అనుకునే వాళ్ల కోస‌మే ఏమో సాఫ్ట్ వేర్ గా స్థిర‌ప‌డిన ల‌క్ష్మి భ‌ర్త ఆనంద్ ఇప్పుడు హోటల్ రంగంలో అడుగుపెట్టి, అంద‌రి కంటా ప‌డ‌నున్నాడు. 'జూనియ‌ర్ కుప్ప‌న్న‌' పేరుతో ఒక ఫ్యామిలీ రెస్టారెంట్ ను ప్రారంభించనున్నాడు. ఈ ఫ్రాంచైజ్ లో మొద‌టి రెస్టారెంట్ ను హైద‌రాబాద్ లోని హైటెక్ సిటీలో మంచు మోహ‌న్ బాబునిన్న ఉద‌యం ప్రారంభించారు.

ఇప్పుడు లక్ష్మీ డాటర్ విద్యా నిర్వాణ కూడా తన యాక్టింగ్‌తో అందరిని మెస్మరైజ్ చేస్తుంది. మోహన్ బాబు పర్యవేక్షణలో నిర్వాణ చేస్తున్న యాక్టింగ్ అక్కడున్న వారందరిని ఆశ్చర్యానికి గురి చేస్తోంది. బహుశా ఇక ఈ మంచు మనవరాలు కూడా బాల నటిగా తెరమీదికి వసుందనటానికి ఇది సూచనేమో అనుకుంటున్నారు కొందరు. ప్రస్తుతం దీనికి సంబంధించిన ఓ వీడియో సోషల్ సైట్స్‌లో చక్కర్లు కొడుతుంది. మరి ఆ వీడియోపై మీరు ఓ లుక్కేయండి.

English summary
Manchu laxmi husband Anand who is a software engineer is now planning to step into a business with a Hotel. He is opening a restaurant named 'Junior Kuppanna'. Mohan babu opened this Hotel today morning at hitech city and he playd with his grand doughter Vidhya Nirvana.
 

తక్షణ సినీ వార్తలు, మూవీ రివ్యూలను రోజంతా పొందండి - Filmibeat Telugu