»   » విభజన సెగ: వద్దనేది నా వ్యక్తిగతమన్న మోహన్ బాబు

విభజన సెగ: వద్దనేది నా వ్యక్తిగతమన్న మోహన్ బాబు

Posted By:
Subscribe to Filmibeat Telugu
 Mohan Babu
హైదరాబాద్ : కేంద్ర నుంచి వెలువడిన విభజన నిర్ణయం తర్వాత రాష్ట్రంలో నెలకొన్న ఆందోళనకర పరిస్థితుల నేపథ్యంలో తెలుగు సినిమా వందేళ్ల పండగ జరుపుకోవడం మంచిది కాదనేది నా వ్యక్తిగత అభిప్రాయమే అని నటుడు, నిర్మాత మోహన్ బాబు స్పష్టం చేసారు. మంగళవారం నటుడు అంబరీష్, సుమలతతో పాటు తిరుమల శ్రీవారిని దర్శించుకోవడానికి వచ్చిన ఆయన మీడియాతో మాట్లాడారు.

రాష్ట్ర విభజనపై ప్రజలు తీవ్ర ఆందోళనలతో ఉన్న ఈ సమయంలో సినిమా పండుగ వద్దని, వాయిదా వేయాలని లేఖ రాసిన మాట వాస్తవమే అని, అయితే అది తన వ్యక్తి గత అభిప్రాయమే, వారు నా మాట వినాలని కాదు, నా మనసులో ఉన్న ఆవేదనను లేఖ ద్వారా బయట పెట్టాను, అంతకు మించి ఏమీ లేదు అని ఆయన వ్యాఖ్యానించారు.

ఈ నెల 21, 22, 23, 24 తేదీల్లో చెన్నైలో నిర్వహించాలనుకున్న వందేళ్ల సినిమా పండుగను జరుపాలని నిర్ణయించిన సంగతి తెలిసిందే. ప్రజలు కన్నీరు పెడుతుంటే పన్నీరు చల్లుకోవడం ఏమిటని ఆయన లేఖలో రాశారు. సీమాంధ్ర, తెలంగాణ ప్రాంతాలు చిత్రసీమకు రెండు కళ్లలాంటివని ఆయన అన్నారు.

ఈ వేడుకలను వాయిదా వేయాలని వేయాలని కోరుతూ మోహన్ బాబు ఫిల్స్ చేంబర్‌కు శనివారం లేఖ రాశారు. రాష్ట్ర విభజన విషయంపై సీమాంధ్ర, తెలంగాణ ప్రాంతాల్లో ఉద్యమాలు జరుగుతున్న ఈ నేపథ్యంలో వందేళ్ల సినిమా పండుగ చేసుకోవడం అవసరమా? అని ఆయన ప్రశ్నించారు.

English summary
Mohan Babu to write letter to AP Film Chamber. He has questioned the move for celebrating the centenary of Telugu Cinema at a time when the entire Telugu state is in turmoil.
 

తక్షణ సినీ వార్తలు, మూవీ రివ్యూలను రోజంతా పొందండి - Filmibeat Telugu