Just In
Don't Miss!
- Sports
ఇంటికి రాగానే దెబ్బ తగిలిన ప్రతి చోట ముద్దులు పెట్టింది: పుజారా
- News
Capital Gains Tax అంటే ఏంటి..? బడ్జెట్ వేళ పూర్తి వివరాలు మీకోసం..!
- Lifestyle
డయాబెటిస్ ఉన్నప్పటికీ సుదీర్ఘకాలం మరియు ఆరోగ్యకరమైన జీవితాన్ని గడపడానికి ఇక్కడ కొన్ని ముఖ్యమైన చిట్కాలు ఉన్నాయ
- Finance
ఫ్యూచర్ గ్రూప్ డీల్, అమెజాన్‌కు షాక్: రిలయన్స్‌కు గుడ్‌న్యూస్, షేర్ జంప్
- Automobiles
భారత్‌లో అడుగుపెట్టిన కొత్త బిఎమ్‌డబ్ల్యూ 3 సిరీస్ గ్రాన్ లిమోసిన్; ధర & వివరాలు
- Technology
వన్‌ప్లస్ నార్డ్ స్మార్ట్‌ఫోన్ ప్రీ-ఆర్డర్స్ ఇండియాలో జూలై 15 మధ్యాహ్నం 1.30 గంటల నుండి మొదలు
- Travel
కర్ణాటక జూన్ 1 నుండి ఈ ఆధ్యాత్మిక ప్రదేశాలను తెరవనుంది..
చిరంజీవితో 24 ఏళ్ల క్రితమే సినిమా: గతాన్ని గుర్తు చేస్తూ డైరెక్టర్ ఎమోషనల్.. లూసీఫర్ అప్‌డేట్ కూడా!
నలభై ఏళ్లుగా తెలుగు సినీ ఇండస్ట్రీలో స్టార్ హీరోగా వెలుగొందుతున్నారు మెగాస్టార్ చిరంజీవి. సుదీర్ఘ ప్రయాణంలో ఆయన ఎన్నో సూపర్ హిట్ చిత్రాలను తన ఖాతాలో వేసుకున్నారు. ఫలితంగా తిరుగులేని, చెరిగిపోని ఎన్నో రికార్డులను క్రియేట్ చేశారు. రాజకీయాల కోసం సినిమాలకు బ్రేకిచ్చిన ఆయన.. చాలా గ్యాప్ తర్వాత రీఎంట్రీ ఇచ్చారు. అప్పటి నుంచి వరుసగా ప్రాజెక్టులను ప్రకటిస్తూ దూసుకుపోతున్నారు. ఈ క్రమంలోనే చిరంజీవిని డైరెక్ట్ చేసే అవకాశం అందుకున్నాడు మోహన్ రాజా. తాజాగా ఆయన చేసిన ట్వీట్ వైరల్ అవుతోంది. ఆ వివరాలు మీకోసం!

రెండు సినిమాలు.. వేరు వేరు ఫలితాలు
సుదీర్ఘ విరామం తర్వాత ‘ఖైదీ నెంబర్ 150'తో సినిమాల్లోకి రీఎంట్రీ ఇచ్చారు మెగాస్టార్ చిరంజీవి. మాస్ డైరెక్టర్ వీవీ వినాయక్ తెరకెక్కించిన ఈ సినిమా సూపర్ హిట్ అవడంతో పాటు ఎన్నో రికార్డులను బద్దలు కొట్టేసింది. అయితే, దీని తర్వాత వచ్చిన ‘సైరా: నరసింహారెడ్డి' మాత్రం అంతగా ఆకట్టుకోలేదు. దీన్ని స్టైలిష్ డైరెక్టర్ సురేందర్ రెడ్డి రూపొందించిన విషయం తెలిసిందే.

ఆచార్యలా మారిన చిరు.... చరణ్ కూడా
మెగాస్టార్ చిరంజీవి ప్రస్తుతం చేస్తున్న చిత్రం ‘ఆచార్య'. టాలీవుడ్ బడా డైరెక్టర్ కొరటాల శివ రూపొందిస్తోన్న ఈ సినిమా మ్యాట్నీ ఎంటర్‌టైన్‌మెంట్స్‌తో కలిసి రామ్ చరణ్ నిర్మిస్తున్నాడు. ఇప్పటికే చాలా వరకు షూటింగ్ పూర్తి చేసుకున్న ఈ చిత్రంలో మెగా పవర్ స్టార్ కూడా కీలక పాత్రను పోషిస్తున్నాడు. కాజల్ అగర్వాల్ కథానాయిక. మణిశర్మ సంగీతం సమకూర్చుతున్నాడు.

సూపర్ హిట్ రీమేక్‌ను ప్రకటించిన చిరు
రీఎంట్రీలో తెగ స్పీడు చూపిస్తున్నారు మెగాస్టార్ చిరంజీవి. ఇప్పటికే పలు చిత్రాలను పట్టాలెక్కించిన ఆయన.. త్వరలోనే మరిన్ని ప్రాజెక్టులు చేయడానికి సన్నాహాలు చేస్తున్నారు. ఇందులో భాగంగానే మెహర్ రమేశ్, బాబీ తదితర దర్శకులతో సినిమాలు ప్రకటించారు. అంతేకాదు, మలయాళంలో సూపర్ డూపర్ హిట్ అయిన ‘లూసీఫర్'ను తెలుగులో రీమేక్ చేస్తున్నారు.

కోలీవుడ్ డైరెక్టర్‌కు అవకాశం ఇచ్చారుగా
‘లూసీఫర్' రీమేక్ కోసం ముందుగా సాహో దర్శకుడు సుజిత్‌కు అవకాశం కల్పించారు మెగాస్టార్ చిరంజీవి.. కానీ, అనివార్య కారణాలతో అతడు ఈ ప్రాజెక్టు నుంచి తప్పుకున్నాడు. దీంతో ఆయన స్థానంలో ఎంతో మంది దర్శకులను అనుకున్నారు. కానీ, ఎవరూ సెట్ అవలేదు. ఇలాంటి సమయంలో కోలీవుడ్ డైరెక్టర్ ‘తని ఒరువన్' ఫేం మోహన్ రాజాను ఎంపిక చేశారు.

చిరంజీవితో 24 ఏళ్ల క్రితమే సినిమా చేసి
మోహన్ రాజా ‘హనుమాన్ జంక్షన్' అనే తెలుగు సినిమాతో దర్శకుడిగా పరిచయం అయ్యారు. దాని తర్వాత తమిళంలో తన సోదరుడు రవిని హీరోగా పరిచయం చేస్తూ ‘జయం' అనే సినిమా చేశారు. అప్పటి నుంచి చాలా చిత్రాలను తెరకెక్కించిన ఆయన.. 24 ఏళ్ల క్రితమే మెగాస్టార్ చిరంజీవి చేసిన ఓ సూపర్ హిట్ మూవీలో భాగం అయ్యారు. ఆ విషయాన్ని తాజాగా గుర్తు చేశారాయన.

లూసీఫర్ అప్‌డేట్ ఇచ్చిన మోహన్ రాజా
చిరంజీవి కెరీర్‌లో ‘హిట్లర్' ఎంతటి విజయాన్ని అందుకుందో తెలిసిందే. దీనికి ఎడిటర్ మోహన్ (మోహన్ రాజా తండ్రి) నిర్మాతగా వ్యవహరించారు. నేటితో ఈ మూవీ 24 ఏళ్లు పూర్తి చేసుకుంది. ఈ సందర్భంగా మోహన్ రాజా ‘నాన్నతో కలిసి ఈ సినిమా ప్రొడక్షన్‌లో భాగమైనందుకు ఎంతో గర్వంగా ఉందం'టూ ట్వీట్ చేశాడు. అలాగే, లూసీఫర్ అప్‌డేట్ త్వరలోనే వస్తుందని ప్రకటించాడు