»   » గర్వంగా ఉంది, శెట్టికి శాల్యూట్: 1000 కోట్ల మహాభారతంపై మోహన్ లాల్

గర్వంగా ఉంది, శెట్టికి శాల్యూట్: 1000 కోట్ల మహాభారతంపై మోహన్ లాల్

Posted By:
Subscribe to Filmibeat Telugu

హైదరాబాద్: భారతీయుల చారిత్రక చరిత్ర మహాభారతాన్ని ప్రపంచానికి చాటి చెప్పేలా రూ. 1000 కోట్లతో మహాభారతాన్ని సినిమాగా తీయబోతున్నట్లు యూఏఈకి చెందిన ఎన్నారై పారిశ్రామిక వేత్త బీఆర్ శెట్టి ప్రకటించిన సంగతి తెలిసిందే.

ప్రముఖ రచయిత ఎంటీ వాసుదేవన్ నాయర్ రాసిన రాండామూజమ్ నవల ఆధారంగా ఈ సినిమాను ప్లాన్ చేస్తున్నారు. మహాభారతంలో భీముని పాత్ర కోణంలో, పాండవుల కథ నేపథ్యంగా ఈ సినిమాను తెరకెక్కించేందుకు సన్నాహాలు చేస్తున్నారు. మళలయాల నటుడు మోహన్ లాల్ ఇందులో ప్రధానమైన భీముడి పాత్రలో కనిపించబోతున్నారు.

గర్వంగా ఉందన్న మోహన్ లాల్

గర్వంగా ఉందన్న మోహన్ లాల్

ఈ సినిమాపై మోహన్ లాల్ స్పందిస్తూ....‘ఈ చిత్రంలో భీముడి పాత్రను నేను పోషిస్తున్నానని చెప్పడానికి చాలా గర్వపడుతున్నాను. దీనిని నాకు లభించిన ప్రత్యేక అవకాశం, అదృష్టంగా భావిస్తున్నాను. నాపై నమ్మకం ఉంచి ఈ పాత్ర పోషించే అవకాశం ఇచ్చినందుకు ధన్యవాదాలు అని ఆయన తెలిపారు.

శెట్టికి శాల్యూటర్

శెట్టికి శాల్యూటర్

మహాభారతాన్ని చిన్నగా తీయలేం. తీస్తే...అత్యంత ఉత్తమమైన పద్ధతిలో అందంగా కళ్లకు కట్టినట్టుగా తెరకెక్కించాలి. భారతదేశ సంస్కృతిని చాటిచెప్పే అంశాన్ని ఎంపిక చేసుకుని,1000 కోట్ల రూపాయల బడ్జెట్ తో ఈ చిత్రాన్ని తెరకెక్కించనున్న మిస్టర్ శెట్టి లాంటి వ్యక్తులకు నా శాల్యూట్..' అని మోహన్ లాల్ తన ఫేస్ బుక్ పోస్టులో పేర్కొన్నారు.

సినిమా ఎప్పుడు వస్తుంది?

సినిమా ఎప్పుడు వస్తుంది?

మహాభారతాన్ని రెండు భాగాలుగా తీసేందుకు ప్లాన్ చేస్తున్నారు. తొలి భాగాన్ని 2020లో విడుదల చేసేందుకు ప్రయత్నాలు చేస్తున్నారు. ఈ సినిను మలయాళం, కన్నడ, తమిళం, తెలుగు, ఆంగ్ల భాషల్లో తెరకెక్కించేందుకు ప్లాన్ చేస్తున్నారు.

షూటింగ్ ఎప్పుడు?

షూటింగ్ ఎప్పుడు?

2018 సెప్టెంబర్లో ఈ సినిమా సెట్ష్ మీదకు వెళ్లే అవకాశం ఉంది. త్వరలోనే ఈ సినిమాకు సంబంధించిన పూర్తి వివరాలు వెల్లడించనున్నారు. ఈ చిత్రానికి ప్రముఖ యాడ్ ఫిల్మ్ మేకర్, విఏ శ్రీకుమార్ మీనన్ దర్శకత్వం వహించనున్నారు.

English summary
Actor Mohanlal has confirmed via a Facebook video message that he will play Bhima, the main lead in the film adaptation of MT Vasudevan Nair’s Jnanpeeth Award-winning novel Randamoozham (Second Turn), which will India’s biggest ever motion picture, with an investment of Rs 1000 crore.
 

తక్షణ సినీ వార్తలు, మూవీ రివ్యూలను రోజంతా పొందండి - Filmibeat Telugu