»   » ఎన్టీఆర్‌ ఫ్యాన్స్ కు సారీ చెప్పిన మోహన్‌లాల్‌,ఎందుకంటే

ఎన్టీఆర్‌ ఫ్యాన్స్ కు సారీ చెప్పిన మోహన్‌లాల్‌,ఎందుకంటే

Posted By:
Subscribe to Filmibeat Telugu

హైదరాబాద్‌: కొరటాల శివ దర్శకత్వంలో ఎన్టీఆర్‌ హీరోగా రూపుదిద్దుకుంటున్న 'జనతా గ్యారేజ్‌' చిత్రం ఆడియో విడుదల వేడుక శుక్రవారం సాయంత్ర శిల్పకళా వేదికలో జరిగింది. సుమ యాంకరింగ్‌ చేసిన ఈ పోగ్రాంకు మోహన్ లాల్ హాజరుకాలేదు.

ఆయన ఈ చిత్రంలో కీలకపాత్రను పోషిస్తున్నారు. ఈ నేపధ్యంలో ఆయన కోసం ఎదురుచూసే ఎన్టీఆర్ అభిమానులకు ఆయన సారీ చెప్తూ ఓ వీడియో బైట్ ని పంపారు. ఆ వీడియోలో ఏముందంటే..

'ఫంక్షన్‌కు రావడానికి వీలైనంత వరకు ట్రై చేశాను. కానీ బిజీ షెడ్యూళ్ల వల్ల కుదరలేదు. ఎన్టీయార్‌ అభిమానులందరికీ సారీ. కేరళలో జరిగే ఓనం పండగ సందర్భంగా మా జనతాగ్యారేజ్‌ విడుదలవడం ఆనందంగా ఉంది. ఎన్టీయార్‌ ఈజ్‌ మై లవబుల్‌ బ్రదర్‌' అని ఆ వీడియోలో చెప్పారు.

ఇక ఈ చిత్రంలో సమంత, నిత్యా మేనన్‌ ఈ చిత్రంలో హీరోయిన్స్ గా నటిస్తున్నారు. మలయాళ నటుడు మోహన్‌లాల్‌ ఈ చిత్రంలో కీలక పాత్రను పోషిస్తున్నారు. సాయికుమార్‌, దేవయాని, సితార, అజయ్‌, కాజల్‌ తదితరులు చిత్రంలో ప్రధాన పాత్రల్లో నటిస్తున్నారు.

ఈ సందర్భంగా చిత్ర థియేట్రికల్‌ ట్రైలర్‌ను ప్రముఖ నిర్మాతలు దిల్‌రాజు, పీవీపీ, బీవీఎస్‌ఎన్‌ ప్రసాద్‌ విడుదల చేశారు. ఇందులో ప్రకృతిని అమితంగా ప్రేమించే యువకుడిగా ఎన్టీఆర్‌, మనుషులంటే ఇష్టపడే వ్యక్తిగా మోహన్‌లాల్‌ కనిపిస్తున్నారు. వీరిద్దరికీ, జనతాగ్యారేజ్‌కి సంబంధమేంటి? ఇద్దరూ కలిసి ఏం చేశారు? అంటూ సాగే ట్రైలర్‌ సినిమాపై ఆసక్తిని రేకెత్తిస్తోంది.

మైత్రి మూవీ మేకర్స్‌ పతాకంపై తెరకెక్కిస్తున్న ఈ చిత్రానికి దేవిశ్రీ ప్రసాద్‌ సంగీతం సమకూరుస్తున్నారు. సెప్టెంబరు 2న ఈ చిత్రాన్ని ప్రేక్షకుల ముందుకు తీసుకురావడానికి సన్నాహాలు చేస్తున్నారు.

English summary
Malayalam star hero Mohanlal, who will be seen playing a crucial role in NTR’s ‘Janatha Garage,’ has now apologized to the actor’s fans.
 

తక్షణ సినీ వార్తలు, మూవీ రివ్యూలను రోజంతా పొందండి - Filmibeat Telugu