»   » అక్కడ రోడ్డు ప్రమాదం..ఇక్కడ ఎన్టీఆర్ టీం టెన్షన్

అక్కడ రోడ్డు ప్రమాదం..ఇక్కడ ఎన్టీఆర్ టీం టెన్షన్

Posted By:
Subscribe to Filmibeat Telugu

హైదరాబాద్: మళయాల స్టార్ మోహన్ లాల్ భారీ రోడ్డు ప్రమాదం నుండి కొద్ది పాటిలో తప్పించుకున్నారు. ఆయన ప్రయాణిస్తున్న కారు కేరళలోని మళయత్తూర్ సమీపంలో గురువారం ప్రమాదానికి గురైంది. అయితే ఈ ఘటనలో మోహన్ లాల్ ఎలాంటి గాయాలు కాకుండా సురక్షితంగా బయటపడ్డారు.

పులిమురుగన్ సినిమా షూటింగులో పాల్గొనేందుకు ఆయనకారులో వెలుతుండగా వేగంగా వచ్చిన టిప్పర్ ఢీకొట్టింది. ఆయనకు ఎలాంటి ఘాయాలు కాక పోవడంతో అటు చిత్ర యూనిట్ సభ్యులు, ఇటు అభిమానులు ఊపిరి పీల్చుకున్నారు. ఈ విషయం తెలిసిన వెంటనే తెలుగు స్టార్ ఎన్టీఆర్, దర్శకుడు కొరటాల శివ ఈ విషయమై ఆరా తీసినట్లు సమాచారం. ప్రమాదం విషయం తెలిసి ఎన్టీఆర్ సిినిమా టీం కాస్త టెన్షన్ పడ్డప్పటికీ సేఫ్ అని తేలియడంతో రిలాక్స్ అయినట్లు సమాచారం.

Mohanlal meets with an accident, unhurt

ఎన్టీఆర్ హీరోగా, కొరటాల శివ డైరక్షన్ లో రెడీ అవుతున్న సినిమా జనతా గ్యారేజ్ లో కీలకపాత్రలో మెహన్ లాల్ నటించబోతున్న సంగతి తెలిసిందే. కేరళనుండి మరో యంగ్ హీరో నటించబోతున్నారని సమాచారం. ఎన్టీఆర్ సినిమాలో ఇతని పాత్రకు కూడా ఎక్కువ ప్రాధాన్యం ఉండే అవకాశం వుందని తెలుస్తోంది. అతను మరెవరో కాదు కేరళ స్టార్ హీరో అయిన ఫహాద్ ఫాజిల్.

ఈ సినిమా ఫిబ్రవరి మెదటివారంలో మెదలయ్యే అవకాశం వుందని సమాచారం. ఈ సినిమాలో ఎన్టీఆర్ కొత్త లుక్ తో కనిపిస్తారని, ఇందులో మెకానిక్ గా ఉండబోతున్నారని ఫిల్మ్ నగర్ వర్గాల సమాచారం.

English summary
Malayalam superstar Mohanlal met with an accident on 28 January. The actor miraculously escaped after the car, in which he was travelling, was hit by a speeding tipper on Thursday morning.
 

తక్షణ సినీ వార్తలు, మూవీ రివ్యూలను రోజంతా పొందండి - Filmibeat Telugu