ఎన్టీఆర్ మూవీ విషయంలో మోహన్ లాల్ అసంతృప్తి
హైదరాబాద్: యంగ్ టైగర్ జూ ఎన్టీఆర్ ఈ సంక్రాంతికి ‘నాన్నకు ప్రేమతో' చిత్రం ద్వారా ప్రేక్షకులను ఎంటర్టెన్ చేయబోతున్నాడు. ఈ చిత్రం తర్వాత ఎన్టీఆర్ కొరటాల శివ దర్శకత్వంలో ఓ సినిమా చేస్తున్న సంగతి తెలిసిందే. ప్రస్తుతం ఈ చిత్రాన్ని ‘జనతా గ్యారేజ్' అనే వర్కింగ్ టైటిల్ తో పిలుస్తున్నారు.
ఈ చిత్రంలో మలయాళం సూపర్ స్టార్ మోహన్ లాల్ కూడా ముఖ్య పాత్రలో నటిస్తున్నారు. అయితే ఈ సినిమాలో తన పాత్రపై మోహన్ లాల్ అసంతృప్తిగా ఉన్నారట. తన పాత్ర సరిగా డిజైన్ చేయలేదని, దీంతో పాటు సినిమాలో సరైన ప్రాధాన్యం లేదని ఫీలయ్యారట. ఆయన కోసం పాత్రలో కొన్ని మార్పులు చేస్తున్నట్లు సమాచారం.

ఈ సినిమాలో మరో ముఖ్యమైన పాత్ర కోసం మలయాళ హీరో ఫహద్ ఫాజిల్ ని తీసుకోనున్నారని సమాచారం. ఆయనో పాటు తెలుగు నటుడు ఉత్తేజ్ కూతురు చేతన కూడా ఈ చిత్రంలో ఓ పాత్రలో కనిపించబోతోందని సమాచారం. త్వరలో సినిమాకు సంబంధించిన పూర్తి వివరాలు వెల్లడి కానున్నాయి.
ఈ మూవీ కోసం హైద్రాబాద్ సారధి స్టూడియోస్ లో భారీ సెట్ వేస్తున్నారు. ఎన్టీఆర్ వర్క్ చేయబోయే జనతా గ్యారేజ్ పేరుగల మెకానిక్ షెడ్ ని దాని చుట్టుపక్కలుండే ప్రాంతాలను సెట్ వేస్తున్నారు. ఇందుకోసం 2 వారాలకు పైగా సమయం పట్టనుందని తెలుస్తోంది. ఆర్ట్ డైరెక్టర్ ఏఎస్ ప్రకాష్ ఇప్పటికే సెట్ నిర్మాణ పనులను దగ్గరుండి పర్యవేక్షిస్తున్నాడు.
ఈ చిత్రానికి సినిమాటోగ్రఫి - తిరు . ఎడిటింగ్ - కోటగిరి వెంకటేశ్వర రావు . ఆర్ట్ - ఎ. ఎస్. ప్రకాష్. సంగీతం - దేవీ శ్రీ ప్రసాద్ నిర్మాతలు - నవీన్ యెర్నేని, వై. రవిశంకర్, మోహన్ కథ - మాటలు - స్క్రీన్ ప్లే - దర్శకత్వం - కొరటాల శివ.


Click it and Unblock the Notifications











