»   » అసలేం జరుగుతోంది?? సినిమా బడ్జెట్‌ 600 కోట్లా..!? , తర్వాత మోహన్‌లాల్‌ రిటైర్మెంట్..!?

అసలేం జరుగుతోంది?? సినిమా బడ్జెట్‌ 600 కోట్లా..!? , తర్వాత మోహన్‌లాల్‌ రిటైర్మెంట్..!?

Posted By:
Subscribe to Filmibeat Telugu

ప్రస్తుతం, మలయాళ సూపర్ స్టార్ మోహన్ లాల్ టైంకి తిరుగులేకుండా పోయింది. మలయాళంలో అగ్రకథానాయకుడంటే మోహన్‌లాల్‌ అనే చెబుతారు. కంప్లీట్‌ యాక్టర్‌గా అభిమానులు పిలుచుకునే మోహన్‌లాల్‌ ప్రతి సినిమాలోనూ తనను తాను కొత్తగా ఆవిష్కరించుకునేందుకు తపిస్తాడు. ఈ ఏడాది విడుదలైన 'ఒప్పమ్‌'లో సినిమా మొత్తం అంధుడిగా నటించే సాహసం చేయడమే అందుకు తార్కాణం.

ఇటీవల విడుదలైన 'పులిమురుగన్‌' కూడా ఆయనలోని తృష్ణకు అద్దంపట్టేదే. ఇందులో మోహన్‌లాల్‌ పులుల వేటగాడిగా సాహసోపేతమైన పాత్రలో నటించారు. తెలుగులో జనతా గ్యారేజ్ చిత్రం విజయంతో మంచి క్రేజ్ సొంతం చేసుకున్న, మనమంతా సినిమా తో తెలుగు ప్రేక్షకులకు మరింత చేరువైన మోహన్ లాల్ ఇప్పుడు తన మార్కెట్ పరిధిని మరింత పెంచుకునేందుకు ప్లాన్ చేస్తున్నాడు. ఇదే ఊపులో మోహన్ లాల్ మరో సాహసం చేయ బోతున్నాడు

Mohanlal Planning To Retire After His Rs 600 Cr Film

ప్రస్తుతం అత్యధిక బడ్జెట్‌ చిత్రాలుగా చెప్పుకుంటున్న 'బాహుబలి', 'రోబో 2.0'లను తలదన్నే రీతిలో అత్యంత భారీ బడ్జెట్‌ చిత్రం త్వరలో రూపొందబోతోందట. మలయాళ సూపర్‌స్టార్‌ మోహన్‌లాల్‌ హీరోగా దాదాపు 600 కోట్ల రూపాయల బడ్జెట్‌తో ఓ సినిమా రూపొందనుందట. ఈ సినిమా తర్వాత సినిమాల నుంచి మోహన్‌లాల్‌ పూర్తిగా రిటైర్మెంట్‌ తీసుకోబోతున్నట్టు తెలుస్తోంది.

ఎం.టి.వాసుదేవ నాయర్‌ రచించిన 'రాండమ్‌ఓజ్‌హమ్‌' అనే నవల ఆధారంగా ఈ చిత్రం తెరకెక్కబోతోందట. ఈ పుస్తకం మహాభారతంలోని భీముని దృక్కోణంలో సాగుతుందట. ఈ ఏడాది చివర్లో ఈ చిత్రం షూటింగ్‌ ప్రారంభమవుతున్నట్టు సమాచారం. ఇంత గొప్ప సినిమా పనులను పూర్తి చేసి ఇక సినిమాల నుంచి విశ్రాంతి తీసుకోవాలని మోహన్‌లాల్‌ భావిస్తున్నాడట. దాదాపు మూడు దశాబ్దాల పాటు మలయాళ సినిమా పరిశ్రమలో స్టార్‌గా కొనసాగిన మోహన్‌లాల్‌ దాదాపు 300 సినిమాల్లో నటించారు. పులిమురుగన్

English summary
According to a report in Manorama, Mohanlal said he would be wrapping up his on-screen stint in a few years, after completing Randamoozhan, an ambitious project being made for a mega budget of Rs 600 Crore.
 

తక్షణ సినీ వార్తలు, మూవీ రివ్యూలను రోజంతా పొందండి - Filmibeat Telugu

X