»   » అంధుడిగా మోహన్ లాల్ మరో సంచలన చిత్రం (ఫోటోస్)

అంధుడిగా మోహన్ లాల్ మరో సంచలన చిత్రం (ఫోటోస్)

Posted By:
Subscribe to Filmibeat Telugu

మ‌ల‌యాళ అగ్ర‌హీరో మోహ‌న్ లాల్ - ప్రియ‌ద‌ర్శ‌న్ కాంబినేష‌న్లో రూపొందిన క్రైమ్ థ్రిల్ల‌ర్ ఒప్ప‌మ్. ఈ చిత్రం మ‌ల‌యాళంలో అన్నివ‌ర్గాల ప్రేక్ష‌కులను ఆక‌ట్టుకుని సెన్సేష‌న్ క్రియేట్ చేసింది. మ‌ల‌యాళంలో సెప్టెంబర్ 8న విడుదలైన ఒప్పం చిత్రం ఇప్పటి వరకు 50 కోట్లు వసూలు చేసి స‌రికొత్త రికార్డ్ క్రియేట్ చేసింది.

ఒప్పం క‌థ విష‌యానికి వ‌స్తే....ఈ చిత్రంలో మోహ‌న్ లాల్ అంధుడిగా న‌టించారు. అంధుడైన‌ మోహ‌న్ లాల్ ఓ అపార్టెమెంట్ లో లిఫ్ట్ ఆప‌రేట‌ర్ గా వ‌ర్క చేస్తుంటాడు. ఒక రోజు ఆ అపార్ట్ మెంట్ లో మ‌ర్డ‌ర్ జ‌రుగుతుంది. ఆ మ‌ర్డ‌ర్ చేసిన కిల్ల‌ర్ త‌ప్పించుకుంటాడు. అయితే....మ‌ర్డ‌ర్ చేసిన కిల్ల‌ర్ ను అంధుడైన‌ మోహ‌న్ లాల్ ఎలా ప‌ట్టుకున్నాడు అనేది ఒప్ప‌మ్ క‌థ‌.

సంచ‌ల‌నం సృష్టించిన‌ ఒప్పం చిత్రాన్ని తెలుగులో రీమేక్ చేసేందుకు చాలా మంది ఇంట్ర‌స్ట్ చూపించారు కానీ...రీమేక్ రైట్స్ ఎవ‌రికీ ఇవ్వ‌కుండా తెలుగులో క‌నుపాప అనే టైటిల్ తో డ‌బ్ చేసి రిలీజ్ చేస్తున్నారు.

మోహ‌న్ లాల్ పట్ల తెలుగు ప్రేక్ష‌కుల‌ ఆసక్తి

మోహ‌న్ లాల్ పట్ల తెలుగు ప్రేక్ష‌కుల‌ ఆసక్తి

జ‌న‌తా గ్యారేజ్, మన్యంపులి చిత్రాల విజ‌యాల‌తో మోహ‌న్ లాల్ తెలుగు ప్రేక్ష‌కుల‌కు బాగా ద‌గ్గ‌ర‌య్యారు. దీంతో క‌నుపాప‌ మూవీ పై టాలీవుడ్ లో మంచి క్రేజ్ ఏర్ప‌డింది. జ‌న‌తా గ్యారేజ్, మన్యంపులి చిత్రాల‌తో వ‌రుసగా స‌క్సెస్ సాధించిన మోహ‌న్ లాల్ క‌నుపాప చిత్రంతో తెలుగులో హ్యాట్రిక్ సాధిస్తార‌నే అంచ‌నాలు ఉన్నాయి. ఓవర్ సీస్ నెట్ వర్క్ ఎంటర్టెన్మెంట్ బి.దిలీప్ కుమార్ తో కలిసి మోహన్ లాల్ ఒప్పం తెలుగు వెర్షన్ క‌నుపాప చిత్రాన్ని రిలీజ్ చేయటానికి సన్నాహాలు చేస్తున్నారు.

సినిమా గురించి మాట్లాడుతూ

సినిమా గురించి మాట్లాడుతూ

ఈ సంద‌ర్భంగా క‌నుపాప మూవీ గురించి మోహ‌న్ లాల్ మాట్లాడుతూ....నిర్మాత దిలీప్ కుమార్ బొలుగోటి ఒప్పం తెలుగు డ‌బ్బింగ్ రైట్స్ ద‌క్కించుకున్నారు. ఈ చిత్రానికి తెలుగులో టైటిల్ క‌నుపాప‌. ఈ చిత్రంలో నేను అంధుడిగా న‌టించాను. ఓవర్ సీస్ నెట్ వర్క్ ఎంటర్ టైన్మెంట్ సంస్థ క్రిస్మ‌స్ కానుక‌గా ఈనెలాఖ‌రున‌ ఈ చిత్రాన్ని రిలీజ్ చేస్తుంది. మ‌ల‌యాళంలో ఒప్పం చిత్రాన్ని ఆద‌రించిన‌ట్టే తెలుగులో క‌నుపాప‌ చిత్రాన్ని ఆద‌రిస్తార‌ని ఆశిస్తున్నాను అన్నారు.

నిర్మాత మాట్లాడుతూ

నిర్మాత మాట్లాడుతూ

నిర్మాత దిలీప్ కుమార్ బొలుగోటి మాట్లాడుతూ...ఒప్పం చిత్రాన్ని తెలుగులో డ‌బ్ చేసే అవ‌కాశం నాకు రావ‌డం ఆనందంగా ఉంది. కొత్త నిర్మాత అయిన నాకు డ‌బ్బింగ్ రైట్స్ ఇవ్వ‌డంతో పాటు ఈ మూవీకి మోహ‌న్ లాల్ గారు స‌మ‌ర్ప‌కుడిగా వ్య‌వ‌హరిస్తుండ‌డం చాలా హ్యాపీగా ఫీల‌వుతున్నాను అన్నారు.

రిలీజ్ ఎప్పుడంటే

రిలీజ్ ఎప్పుడంటే

ఈనెల రెండో వారంలో ఆడియో రిలీజ్ చేసి ఈ నెలాఖ‌రున చిత్రాన్ని గ్రాండ్ గా రిలీజ్ చేసేందుకు ప్లాన్ చేస్తున్నాం. మ‌ల‌యాళంలో కంటే పెద్ద విజ‌యాన్ని తెలుగులో సాధిస్తుంద‌నే నమ్మ‌కం ఉంది అన్నారు నిర్మాత

English summary
Malayalam crime thriller 'Oppam', starring Mohanlal in the role of a blind man, is going to be released as 'Kanupapa' towards December end.Pipping the records of even superhits, this Mohan Lal-starrer, which was released on Sept 8, has collected Rs. 50 cr so far. Such is the Box Office stamina of this Priyadarshan-directed entertainer. Telling the story of a blind elevator operator (a challenging role essayed with panache by the redoubtable Complete Actor), who has to nab the actual killer when he is wrongly charged with a murder at the apartment, the film comes with nuanced elements like Mohan Lal's character possessing certain extra-ordinary sensory powers.
 

తక్షణ సినీ వార్తలు, మూవీ రివ్యూలను రోజంతా పొందండి - Filmibeat Telugu