twitter
    For Quick Alerts
    ALLOW NOTIFICATIONS  
    For Daily Alerts

    మళయాళంలో 'బాహుబలి' రేంజ్ : 'మన్యం పులి' ఈ రోజే రిలీజ్, కథేంటి?

    మళయాళంలో ఘన విజయం సాధించిన 'మన్యం పులి' చిత్రాన్ని తెలుగులో డబ్బింగ్ చేసి భారీ ఎత్తున విడుదల చేస్తున్నారు.

    By Srikanya
    |

    హైదరాబాద్:ఒక భాషలో సూపర్ హిట్టైన సినిమాని వేరే భాషలో ప్రేక్షకులు కూడా ఖచ్చితంగా ఆదరిస్తారని అనిపించినప్పుడు డబ్బింగ్ చేయటమో లేక రీమేక్ చేయటమే చేస్తారు. ముఖ్యంగా మ్యాజిక్ ని రిపీట్ చేయలేం అని అనిపించినప్పుడు డబ్బింగ్ కు వెళతారు. ఈ రోజు రిలీజ్ అవుతున్న డబ్బింగ్ చిత్రం మన్యం పులిదీ అదే పరిస్దితి.

    మళయాళంలో ఘన విజయం సాధించిన ఈ చిత్రాన్ని తెలుగులో డబ్బింగ్ చేసి భారీ ఎత్తున విడుదల చేస్తున్నారు. మోహన్‌లాల్‌ ప్రధాన పాత్రలో నటించిన 'పులి మురుగన్‌' చిత్రం భారీ కలెక్షన్లతో దూసుకుపోతోంది. ఈ సినిమా రూ.100 కోట్ల క్లబ్‌లో ఎప్పుడో చేరింది. తర్వాత 125 కోట్లు రీచ్ అయ్యింది. ఈ చిత్రాన్ని తెలుగులో 'మన్యం పులి' పేరుతో నిర్మాత 'సింధూర పువ్వు' కృష్ణారెడ్డి విడుదల చేస్తున్నారు.

    పులి ఎప్పుడు వచ్చినా

    పులి ఎప్పుడు వచ్చినా

    కేరళలో అడవి పక్కన పులివూరె అని ఓ చిన్న గ్రామం ఉంటుంది. అడవిలోంచి పులులు వచ్చి గ్రామస్థులపై దాడి చేసి చంపేస్తుంటాయి. అలా ఎప్పుడు పులి వచ్చినా అందరూ మురుగన్‌ (మోహన్‌లాల్‌) కోసమే చూస్తుంటారు. లారీ డ్రైవర్‌గా పనిచేసే మురుగన్‌ పులులను వేటాడి చంపడంలో దిట్ట.

    మనుష్యుల్లోనూ పులులు

    మనుష్యుల్లోనూ పులులు

    చిన్నప్పుడే తన కళ్లముందే ఓ పులి తన తండ్రిని చంపేస్తుంది. దానికి ప్రతీకారంగా చిన్నప్పుడే ఆ పులిని వేటాడి చంపుతాడు. అప్పట్నుంచీ మనుషులపై దాడి చేసే పులులను వేటాడుతుంటాడు. అయితే మనుషుల్లోనూ పులి లాంటి క్రూరస్వభావులు ఉన్నారని అతనికి తెలుస్తుంది. వారినీ వేటాడాల్సిన అవసరం ఉందని అర్థమవుతుంది. మరి అతని వేట ఎలా సాగిందన్నదే 'మన్యం పులి‌' కథ.

    పులులను వేటాడే

    పులులను వేటాడే

    56 ఏళ్ల వయసులో యంగ్ హీరోలకు దీటుగా ఎనర్జిటిక్‌గా నటించారు మోహన్‌లాల్‌. పులులను వేటాడే సన్నివేశాలను ఉత్కంఠభరితంగా తెరకెక్కించారు దర్శకుడు వైశాఖ్‌. పీటర్‌ హెయిన్స్‌ సారథ్యంలో మోహన్‌లాల్‌ చేసిన పోరాటాలు అభిమానులతో ఈలలు వేయిస్తున్నాయి.

    కమిలినీ, జగపతిబాబు

    కమిలినీ, జగపతిబాబు

    ఈ చిత్రంలో మోహన్‌లాల్‌ సరసన కమలినీ ముఖర్జీ హీరోయిన్ గా నటించగా, తెలుగు నటుడు జగపతిబాబు కీలక పాత్రలో నటించాడు. రూ.25 కోట్లతో రూపొందిన ఈ చిత్రం మలయాళంలో రూ.100 కోట్లు వసూళ్లు సాధించిన తొలి చిత్రంగా నిలవడం విశేషం.

    రికార్డ్ ల మీద రికార్డ్ లు...

    రికార్డ్ ల మీద రికార్డ్ లు...

    తొలి రోజే రూ.4 కోట్లకు పైగా వసూళ్లతో అత్యధిక తొలిరోజు వసూళ్లందుకున్న మలయాళ చిత్రంగానూ ప్రత్యేకత చాటింది 'పులిమురుగన్‌'. ఆడియో, ఓవర్సీన్‌, శాటిలైట్‌ హక్కుల ద్వారా పులిమురుగన్‌ రూ.15 కోట్లు ఆర్జించింది. ఈ చిత్రం తెలుగులో 'మన్యం పులి' పేరుతో విడుదలవుతోంది.

    పులల వేటగాడుగా

    పులల వేటగాడుగా

    మలయాళంలో స్టార్ హీరో అంటే మోహన్‌లాల్‌ అనే చెబుతారు. కంప్లీట్‌ యాక్టర్‌గా అభిమానులు పిలుచుకునే మోహన్‌లాల్‌ ప్రతి సినిమాలోనూ తనను తాను కొత్తగా ఆవిష్కరించుకునేందుకు తపిస్తాడు. ఈ ఏడాది విడుదలైన 'ఒప్పమ్‌'లో సినిమా మొత్తం అంధుడిగా నటించే సాహసం చేయడమే అందుకు తార్కాణం. ఇటీవల విడుదలైన 'పులిమురుగన్‌' కూడా ఆయనలోని తృష్ణకు అద్దంపట్టేదే. ఇందులో పులుల వేటగాడిగా సాహసోపేతమైన పాత్రలో నటించారు మోహన్‌లాల్‌.

    యాక్షన్ సీన్స్ అన్ని రోజులు పాటు

    యాక్షన్ సీన్స్ అన్ని రోజులు పాటు

    ఈ సినిమా కోసం చిత్ర టీం దాదాపు 2 సంవత్సరాలు కష్టపడ్డారు. సినిమాను 180 రోజులు పైగా చిత్రీకరిస్తే 110 రోజులు యాక్ష‌న్ సీన్స్‌ను చిత్రీక‌రించారు. అందులో టైగ‌ర్ ఫైట్‌ను 43 రోజుల పాటు చిత్రీక‌రించారు.

    పులలేమీ నచ్చక

    పులలేమీ నచ్చక

    మళయాళంలో పులి మురగన్ నిర్మించిని తొమిచన్ ముల్కపాదమ్ మాట్లాడుతూ.. - `` టైగ‌ర్ ఫైట్ కోసం పులి కోసం సౌతాఫ్రికా, వియ‌త్నాంలో చూశాం. అక్క‌డ చూసిన పులులేవీ మాకు న‌చ్చ‌లేదు. చివ‌ర‌కు థాయ్‌లాండ్‌లో రెండు పులుల‌ను సెల‌క్ట్ చేసుకుని వాటితో టైగ‌ర్ ఫైట్‌ను షూట్ చేశాం. దీని కోసం మాకు 43 రోజుల స‌మయం ప‌ట్టింది. సినిమా క్లైమాక్స్ 28 నిమిషాలుంటుంది. దీన్ని 58 రోజుల్లో చిత్రీక‌రించాం. సినిమా కోసం రెండేళ్ల పాటు బాగా క‌ష్ట‌ప‌డ్డాం. మ‌ల‌యాళంలో సినిమా ఎంత పెద్ద హిట్ట‌య్యిందో తెలుగులో కూడా అంతే పెద్ద హిట్ కావాలి`` అన్నారు.

    అంతంత మాత్రమే

    అంతంత మాత్రమే

    పెద్ద నోట్ల ప్రభావం సినిమా పరిశ్రమపైనా, వసూళ్లపైనా పడుతుందని అందరూ అంచనాలు వేసారు. అయితే అది అంతంత మాత్రంగానే కనిపిస్తోంది. ఇటీవల విడుదలైన 'ఎక్కడికి పోతావు చిన్నవాడా' చిత్రానికి మంచి వసూళ్లు దక్కడంతో సినీ పరిశ్రమ వూపిరి పీల్చుకొంది.

    కంటెంట్ బాగుంటే ఖచ్చితంగా..

    కంటెంట్ బాగుంటే ఖచ్చితంగా..

    ''ఎక్కడికి పోతావు చిన్నవాడా' సినిమా హిట్ అవటంతో .. బాగుంటే తప్పకుండా చూస్తారు' అనే నమ్మకం కలిగింది. అందుకే వరుసగా సినిమాల్ని వదలడానికి నిర్ణయించుకొన్నారు. డిసెంబరు 1 నుంచి నెలాఖరు వరకూ ప్రతీవారం కొత్త సినిమాలు వరుస కట్టేస్తున్నాయి. 1న 'బేతాళుడు' ఈ పరంపరకు శ్రీకారం చుట్టాడు. 2న 'మన్యం పులి' విడుదల అవుతోంది. రెండూ అనువాద చిత్రాలే అయినా... వీటిపై మంచి అంచనాలే ఉండటంతో ప్లస్ అవుతోంది.

    ధైర్యం చేసి మరీ...

    ధైర్యం చేసి మరీ...

    'మన్యం పులి' నిర్మాత 'సింధూర పువ్వు' కృష్ణారెడ్డి మాట్లాడుతూ ''కరెన్సీ కష్టాలు చిత్రసీమకూ ఉన్నాయి. అయితే ఆ ప్రభావం ఇప్పుడు కాస్త తగ్గింది. ఆ ధైర్యంతోనే సినిమాల్ని విడుదల చేయడానికి ధైర్యం చేస్తున్నారు. డిసెంబరులో ఒకట్రెండు పెద్ద సినిమాలు మినహా స్టార్లెవరూ కనిపించడం లేదు. జనవరి వరకూ ఆగితే సంక్రాంతి సినిమాల నుంచి పోటీ మొదలైపోతుంది. అందుకే చిన్న సినిమాలకు ఇదే మంచి తరుణమ''అన్నారు.

    తెర వెనక, ముందు

    తెర వెనక, ముందు

    మోహన్ లాల్, జగపతి బాబు, కమలినీ ముఖర్జీ కీలక పాత్రల్లో నటించిన ఈ సినిమాకు దర్శకుడు : వైశాఖ, కథ: ఉదయకృష్ణ, సంగీతం: గోపీ సుందర్, కెమెరా: షాజీకుమార్‌, ఎడిటింగ్: జాన్ కుట్టి, షిజాస్ పి.యూన‌స్‌, విజువ‌ల్ ఎఫెక్ట్స్: విజ‌య్‌, స్రిస్‌, పిక్స్‌ల్‌, నిర్మాత: సింధూర‌పువ్వు కృష్ణారెడ్డి, ద‌ర్శ‌క‌త్వం: వైశాక్‌

    English summary
    The Telugu dubbed version of Malayalam superstar Mohanlal’s blockbuster film Pulimurugan is all set to hit the screens in Telugu states on December 2. It created history by becoming the first ever Malayalam movie to collect Rs 100 crore from ticket sales even as it opened up new markets around the world for Malayalam movies.
     
    న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
    Enable
    x
    Notification Settings X
    Time Settings
    Done
    Clear Notification X
    Do you want to clear all the notifications from your inbox?
    Settings X
    X