»   »  అచ్చుగుద్దినట్టు ఓషో లాగే.... అద్బుతంగా సూటయ్యాడు.. హ్యాట్సాఫ్ మోహన్ లాల్

అచ్చుగుద్దినట్టు ఓషో లాగే.... అద్బుతంగా సూటయ్యాడు.. హ్యాట్సాఫ్ మోహన్ లాల్

Posted By:
Subscribe to Filmibeat Telugu

కమర్షియల్ హీరోగా కొనసాగుతూనే ప్రయోగాత్మక పాత్రలు చేస్తున్న ఈ కంప్లీట్ యాక్టర్ మోహన్ లాల్ ఇప్పుడు ఇంకో పాత్ర కోసం రెడీ అయ్యాడు. ప్ర‌ముఖ ఆధ్యాత్మిక గురువు, వ‌క్త ఓషో జీవిత గాథ‌ను తెర‌పై ఎక్కించేందుకు మ‌ళ‌యాల సూప‌ర్ స్టార్ ప్ర‌య‌త్నిస్తున్న‌ట్టు స‌మాచారం. ఓషో వేష‌ధార‌ణ‌లో ఉన్న త‌న ఫోటోను ఫేస్ బుక్ అభిమానుల‌తో పంచుకున్నారు మోహ‌న్ లాల్.

ఇప్పుడు బాలీవుడ్ లో బయోపిక్‌ల రాజ్యం నడుస్తోంది. తెలుగులోనూ ఇప్పుడిప్పుడే బయోపిక్ లుకు తెర తీస్తున్నారు. ఈ నేపధ్యంలో ఓషో బయోపిక్ తో మోహన్ లాల్ మన ముందుకు రావటానకి నిర్ణయించుకున్నాడా అనే చర్చ నడుస్తోంది. ఈ మధ్య కాలంలో క్రీడా, సినిమా నేపథ్యం ఉన్న పలువురి జీవితగాథలు భాక్సాఫీస్ వద్ద కలెక్షన్స్ వర్షాన్ని కురిపించాయి. ఈ నేపథ్యంలో మలయాళ సూపర్‌స్టార్‌ మోహన్‌లాల్‌ ఓ వినూత్న జీవితగాథను వెండితెరపై ఆవిష్కరించే పనిలో పడినట్లు చెప్పుకుంటున్నారు.

Mohanlal thrills his fans with Osho look

ప్రపంచ ప్రఖ్యాత ఆధ్యాత్మిక తత్వవేత్త ఓషో పాత్రో నటించనున్నాడన్న వార్త ఇప్పుడు మాలీవుడ్ సర్కిల్స్ లో హాట్ టాపిక్ గా మారింది. అయితే ఈ సినిమాపై ఎలాంటి ప్రకటన చేయకపోయినా.. మోహన్ లాల్ తన సోషల్ మీడియాలో పోస్ట్ చేసిన ఫోటోతో చర్చ మొదలైంది.,,ట్విట్టర్ పేజ్ లో తాను ఓషో వేషదారణలో ఉన్న ఫోటోను పోస్ట్ చేసిన మోహన్ లాల్, 'ఆధ్యంతాలు లేని వ్యక్తి వేషంలో.. సముద్రమంత ప్రేమతో..' అంటూ కామెంట్ చేశాడు.

ప్రస్తుతం నార్త్ సౌత్ ఇండస్ట్రీలో బయోపిక్ ల ట్రెండ్ నడుస్తుండటంతో మోహన్ లాల్ కూడా ఓషో బయోపిక్ ను తెరకెక్కించనున్నాడన్న టాక్ మొదలైంది. సినిమా పై ఎలాంటి ప్రకటన లేకపోయినా.. మోహన్ లాల్ గెటప్ కు మాత్రం మంచి స్పందన వస్తోంది.

ఫిలాసాఫర్ గా ఎంతో మందిని ప్రభావితం చేసిన ఇండియన్ పీపుల్ లో ఓషో ఒకరు. ఆయన బయోపిక్ నే ఇప్పుడు బాలీవుడ్ తెరకెక్కించబోతున్నట్టు సమాచారం. అయితే ఈ బయోపిక్ సూపర్ హిట్ గ్యారెంటీ అన్నదానికి సాక్ష్యంగా ఆ పాత్రకు ఎంచుకున్న నటుడు నిలుస్తుండటం విశేషం. ఆ మేకప్ లో మోహన్ లాల్ కాదు ఓషో నే కనిపిస్తున్నారు. అచ్చుగుద్దినట్టు ఆయన్ మొహం లానే కనిపిస్తున్నాడు మోహన్ లాల్.

English summary
Mohanlal thrills his fans with Osho look. insocial meadia he Shared the photo and he wrote, ''In disguise of the limitless man - The Ocean of Love''.
 

తక్షణ సినీ వార్తలు, మూవీ రివ్యూలను రోజంతా పొందండి - Filmibeat Telugu