»   » మోక్షజ్ఞ ఎంట్రీ ఈ ఏడాదే: దర్శకత్వం, నిర్మాణంలోకి వస్తా.. (బాలకృష్ణ ఇంటర్వ్యూ)

మోక్షజ్ఞ ఎంట్రీ ఈ ఏడాదే: దర్శకత్వం, నిర్మాణంలోకి వస్తా.. (బాలకృష్ణ ఇంటర్వ్యూ)

Posted By:
Subscribe to Filmibeat Telugu

హైదరాబాద్‌: నందమూరి బాలకృష్ణ వారసుడు మోక్షజ్ఞ రాక కోసం ఎదురు చూస్తున్న అభిమానులు ఇంకా ఎంతో కాలం ఎదురు చూడాల్సిన అవసరం లేదు. ఈ ఏడాదే మోక్షజ్ఞను వెండి తెరకు పరిచయం చేయబోతున్నట్లు బాలయ్య ప్రకటించారు. అంతే కాదు దర్శకత్వం, నిర్మాణ రంగంలోకి కూడా అడుగు పెట్టబోతున్నట్లు తెలిపారు.

తన తండ్రి ఎన్టీఆర్ వర్దంతి సందర్భంగా బుధవారం ఆయన మీడియాతో సమావేశం అయ్యారు. తండ్రి జ్ఞాపకాలను గుర్తు చేసుకున్నారు. ఈ సందర్భంగా మాట్లాడుతూ శాతకర్ణికి చిత్రానికి వస్తున్న స్పందన చూస్తుంటే సంతోషంగా ఉందని, చాలా కాలంగా సినిమాలు చూడని వాళ్లూ ఇప్పుడు 'గౌతమిపుత్ర శాతకర్ణి'ని చూడ్డానికి థియేటర్లకు వస్తున్నారు. ఇది మా విజయం కాదు.. తెలుగువాళ్ల విజయం అని బాలయ్య తెలిపారు.

శాతకర్ణి కేవలం తెలుగువాళ్ల సినిమా కాదు.... ఆయన భారతదేశానికి చక్రవర్తి కాబట్టి ప్రతి భారతీయుడు చూడాల్సిన సినిమా. అందుకే ఇతర భాషల్లో ఈ చిత్రాన్ని సబ్‌ టైటిల్స్‌తో విడుదల చేయడానికి సన్నాహాలు చేస్తున్నామని బాలయ్య తెలిపారు.

తన వారసుడి ఎంట్రీ గురించి

తన వారసుడి ఎంట్రీ గురించి

మోక్షజ్ఞను హీరోగా పరిచయం చేసేది ఈ ఏడాదే... కానీ దర్శకుడు ఎవరు, ఎలాంటి కథతో బాబు ఎంట్రీస్తున్నాడనే దానిపై ఇంకా ఎలాంటి నిర్ణయానికి రాలేదని బాలయ్య తెలిపారు. నాకు ముందస్తు ప్రణాళికలు వేసుకుని పనిచేయడం నచ్చదు. అప్పటికప్పుడు వేడివేడిగా వడ్డించేయడమే తెలుసు అని బాలయ్య తెలిపారు.

మోక్షజ్ఞతో కలిసి చేస్తే ఆ సినిమానే చేస్తా

మోక్షజ్ఞతో కలిసి చేస్తే ఆ సినిమానే చేస్తా

మోక్షజ్ఞ, నేను కలసి నటించాల్సివస్తే ‘ఆదిత్య 999' అయితే బాగుంటుందని నా అభిప్రాయం. అది తప్ప మా ఇద్దరికీ నప్పే కథలు లేవు. మల్టీస్టారర్‌ సినిమాలు చేస్తా. అది పౌరాణికం అయితే బాగుంటుందని బాలయ్య తెలిపారు.

త్వరలో ఆదిత్య 999

త్వరలో ఆదిత్య 999

బాలయ్య కెరీర్లో చెప్పుకోదగ్గ గొప్ప సినిమాల్లో ‘ఆదిత్య 369' ఒకటి. సైన్స్ ఫిక్షన్ నేపథ్యంలో వచ్చిన ఈ చిత్రం అప్పట్లో ఓ సంచలనం. తాజా దీనికి సీక్వెల్‌గా ‘ఆదిత్య 999' కూడా త్వరలో చేయబోతున్నట్లు బాలయ్య తెలిపారు.

దర్శకుడిగా, నిర్మాతగా మారబోతున్న బాలయ్య

దర్శకుడిగా, నిర్మాతగా మారబోతున్న బాలయ్య

ఇప్పటి వరకు కేవలం నటుడిగా మాత్రమే రాణించిన బాలకృష్ణ.... త్వరలో దర్శత్వం చేసే ఆలోచన, సినిమా నిర్మించే ప్లాన్స్ కూడా ఉన్నాయి, ఇది కూడా ఈ ఏడాదే ప్రయత్నించబోతున్నట్లు బాలయ్య తెలిపారు.

సమర్థుడు లేకుంటే నేను తీస్తా

సమర్థుడు లేకుంటే నేను తీస్తా

నాకు పౌరాణిక చిత్రాలంటే ఇష్టం. ఇలాంటి సినిమాలు చేయగల దర్శకులు మనకు చాలా మంది ఉన్నారు. నేను ఎంచుకునే పౌరాణిక కథకు ఏ దర్శకుడూ న్యాయం చేయలేడు, సమర్థుడు ఎవరూ లేరని అనిపిస్తే నా సినిమాని నేనే తీసుకుంటా అని బాలయ్య ఓ ప్రశ్నకు సమాధానం ఇచ్చారు.

నాన్నగారు చేయాలనుకున్నారు

నాన్నగారు చేయాలనుకున్నారు

నాన్నగారు శాతకర్ణి కథతో సినిమా చేద్దామనుకొన్నారు. అందుకు సంబంధించిన నోట్సు కూడా రాసుకొన్నారు. ఆయుధాలు ఎలా ఉండాలి? ఎలాంటి దుస్తులు ధరించాలి? అనే విషయంలో క్షుణ్నంగా అధ్యయనం చేశారు. అవన్నీ నేనూ పరిశీలించా అని బాలయ్య తెలిపారు.

అందుకే కిరీటం ఆలోచన తీసేసాం

అందుకే కిరీటం ఆలోచన తీసేసాం

ఈ సినిమాలో శాతకర్ణి కోసం ఓ కిరీటం తయారు చేయించాం. అయితే ఆ కాలం నాటికి కిరీటాలు ఇంకా రాలేదు. ఆ సంగతి తెలుసుకొని దాన్ని పక్కన పెట్టాం. ఏ భాష వాడాలి, ఏ మాండలికంలో మాట్లాడాలి? అనే విషయాల్లో చాలా కసరత్తులు చేశామని బాయ్య తెలిపారు.

సౌదర్య మరణంతో సాధ్యం కాలేదు, మళ్లీ ముట్టుకోను

సౌదర్య మరణంతో సాధ్యం కాలేదు, మళ్లీ ముట్టుకోను

అప్పట్లో ‘నర్తనశాల' సినిమా రీమేక్ చేయాలనుకున్నారు. కానీ సౌందర్య మరణంతో సాధ్యం కాలేదు. మళ్లీ ఆ కథ ముట్టుకోను. కొన్ని పాత్రలు కొంతమందే చేయగలరు. మన కథకు తగ్గ నటీనటులు దొరక్కపోతే సినిమా చేయడం ఎందుకు అని బాలయ్య నర్తనశాల సినిమా రీమేక్ కు సంబంధించిన ప్రశ్నకు సమాధానం ఇచ్చారు.

సిక్స్ ప్యాక్ మన సంసృతి కాదన్న బాలయ్య

సిక్స్ ప్యాక్ మన సంసృతి కాదన్న బాలయ్య

నాకు కొన్ని కథలు మాత్రమే సూట్ అవుతాయి. రొమాన్స్ చేయడం, సిక్స్ ప్యాక్ చేయడం లాంటివి చేస్తే చూడరు. అయినా సిక్స్ ప్యాక్ మన సంస్కృతి కాదు. నాకు సూట్ కాని కథలు నేను చేయను అని బాలయ్య తెలిపారు.

English summary
According to BalaKrishna, his son Mokshagna will be debuting in this year. Nandamuri fans are sure to re-joice at this bit of information. They have been waiting for news on Tollywood entry of this legend’s offspring for sometime now.
 

తక్షణ సినీ వార్తలు, మూవీ రివ్యూలను రోజంతా పొందండి - Filmibeat Telugu