»   »  చీటింగ్ కేసు: ప్రియుడితో కలిసి పరారైన సినీ నటి

చీటింగ్ కేసు: ప్రియుడితో కలిసి పరారైన సినీ నటి

Posted By:
Subscribe to Filmibeat Telugu

బెంగుళూరు: మలయాళ హీరోయిన్‌ లీనా మరియాపాల్‌ వేల కోట్ల రూపాయలు చీటింగుకు పాల్పడిన కేసులో ఇటీవల అరెస్టయిన సంగతి తెలిసిందే. లీనాతో పాటు అరెస్టయిన ఆమె ప్రియుడు బెయిల్‌పై విడుదలయ్యారు. మళ్లీ వారిని పోలీసులు కస్టడీలోకి తీసుకునే అవకాశం ఉండటంతో పోలీసులకు చిక్కకుండా పరారయ్యారు.

కర్ణాటక ప్రభుత్వం ప్రవేశ పెట్టిన కొన్ని పథకాల నిర్వహణకు సంబంధించిన ఉద్యోగాలు ఇప్పిస్తానని చెప్పి నటి లీనాతో పాటు, ఆమె ప్రియుడు చంద్ర శేఖర్ అనేక మంది నిరుద్యోగులను నుండి కోట్లాది రూపాయలు వసూలు చేసారు. కొన్ని సంస్థలు కూడా వీరి వలలో చిక్కుకుని మోసపోయాయి.

Actress leena abscond with her lover

కర్ణాటక ప్రభుత్వానికి సంబంధించిన వ్యవహారం కావడంతో పలు పరిశ్రమలు కూడా వీరితో ఒప్పందం కుదుర్చుకున్నాయి. ఈ మొత్తం వ్యవహారంలో వీరు దాదాపు రూ. వెయ్యి కోట్ల మోసానకి పాల్పడ్డట్లు ఆరోపణలు ఉన్నాయి. పరారీలో ఉన్న వీరిని పట్టుకునేందుకు పోలీసులు అన్ని విధాలా ప్రయత్నిస్తున్నారు.

గతంలో తమ మోసం బయట పడ్డ తర్వాత అజ్ఞాతంలోకి వెళ్లిన లీనా మరియా పాల్, చంద్రశేఖర్‌లు గత సంవత్సరం ఢిల్లీలోని ఫతేపుర్‌బేరీలో దొరికిపోయారు. ఇపుడు మళ్లీ బెయిల్‌పై విడుదలైన తర్వాత కూడా పరారు కావడం చర్చనీయాంశం అయింది. ఈ సారి వారు దొరికితే కటకటాల పాలవ్వడం ఖాయంగా కనిపిస్తోంది.

English summary

 Actress Leena Maria Paul her boyfriend and co-accused, Sukesh Chandrashekhar alias Balaji, have absconded in conection with multi-crore cheating cases.
 

తక్షణ సినీ వార్తలు, మూవీ రివ్యూలను రోజంతా పొందండి - Filmibeat Telugu