»   » ఆస్కార్ చరిత్రలోనే ఘోర తప్పిందం.. అదేంటంటే..

ఆస్కార్ చరిత్రలోనే ఘోర తప్పిందం.. అదేంటంటే..

Posted By:
Subscribe to Filmibeat Telugu

సినీ నోబెల్ ఆస్కార్ అవార్డుల పురస్కారం కన్నుల పండువగా జరిగింది. దిగ్గజ తారలతో ఆస్కారు అవార్డుల వేదిక కళకళలాడింది. 89వ వార్షిక్ అకాడమీ అవార్డుల పండుగలో భయంకరమైన తప్పు దొర్లింది. ఉత్తమ చిత్రం పేరును తప్పుగా చదవడం వివాదాస్పదమైంది. బెస్ట్ పిక్చర్ అవార్డు పేరును మూన్ లైట్‌కు బదులుగా గోస్ 'టూ లా లా ల్యాండ్' అని చదివారు.

జరిగిన ఘోర తప్పిదమిదే..

జరిగిన ఘోర తప్పిదమిదే..

ఉత్తమ చిత్రం అవార్డు పేరు ప్రకటించగానే లా లా ల్యాండ్ చిత్ర బృందం వేదికపైకి వెళ్లింది. అప్పుడే తప్పు ఏమి జరిగిందో అర్థమైంది. దాంతో తప్పును సరిద్దిద్దుకొని వెంటనే మూన్ లైట్ చిత్రానికి అవార్డును అందజేశారు.

తప్పు జరిగిన తీరుపై వివరణ

తప్పు జరిగిన తీరుపై వివరణ

ఉత్తమ చిత్రం అవార్డు ప్రకటన తప్పగా ఎలా జరిగిందో అనే విషయాన్ని వారెన్ బీటీ తర్వాత వివరించారు. పేరు ప్రకటించే యాక్టర్‌కు ఒక కవరుకు బదులు మరో కవర్ ఇచ్చామని, దాంతో తప్పు ఆయన తప్పుగా పేరు ప్రకటించారు.

తప్పుదిద్దుబాటు ఇలా..

తప్పుదిద్దుబాటు ఇలా..

తప్పు జరిగిందని తెలుసుకోకముందే లాలా ల్యాండ్ బృందం వేదికపైకి చేరుకొన్నది. ఆ చిత్ర నిర్మాత జోర్డాన్ హోరోవిట్జ్ ఆ అవార్డును అంగీకరించినట్టు ప్రసంగం చేశారు. ఆ లోపే తప్పు జరిగిందని ప్రకటించారు. దాంతో 'మీరు జోక్ చేయడం లేదు కదా' అని ప్రశ్నించడం జోర్డాన్ వంతైంది. ఆ తర్వాత అతని చేతే మూన్ లైట్‌కు ఉత్తమ అవార్డును ప్రకటింపజేశారు.

ఈ ఏడాది అవార్డు విజేతలు వీరే..

ఈ ఏడాది అవార్డు విజేతలు వీరే..

ఉత్తమ చిత్రంగా మూన్ లైట్ నిలిచింది. ఉత్తమ నటుడిగా క్యాసీ అఫ్లెక్ (మాంచస్టర్ బై ది సీ), ఎమ్మా స్టోన్ (లాలా ల్యాండ్), ఉత్తమ సహాయ నటుడిగా మహెర్ షా అలీ (మూన్ లైట్) ఉత్తమ సహాయ నటిగా వైయోలా డేవిస్ (ఫెన్స్) ఎంపికయ్యారు.

English summary
Moonlight wins Best Picture - but La La Land is announced by mistake. The error was only realised after Damien Chazelle and the La La Land team had taken to the stage. It looks like the actor was given the wrong envelope by mistake.
 

తక్షణ సినీ వార్తలు, మూవీ రివ్యూలను రోజంతా పొందండి - Filmibeat Telugu