»   » కమల్ ప్రవర్తనని భరించలేకే...... బ్రేకప్ కి కారణం చెప్పిన గౌతమి

కమల్ ప్రవర్తనని భరించలేకే...... బ్రేకప్ కి కారణం చెప్పిన గౌతమి

Posted By:
Subscribe to Filmibeat Telugu

దేశం గర్వించదగ్గ నటుడు కమల్ హాసన్. సినిమాల్లో మాదిరే నిజజీవితంలో కూడా ప్రేమించి పెళ్లి చేసుకున్నాడు. కానీ ఎవో కారణాల వల్ల విడాకులు తీసుకున్నారు. కమల్ , సారిక చాలా సినిమాల్లో కలిసి నటించారు.సినిమాలు చేసే టైంలోనే వీరి మధ్య ప్రేమ చోటుచేసుకోవడంతో పెళ్లి చేసుకున్నారు. ఆ తరువాత వారికి ఇద్దరూ కుమార్తెలు కూడా జన్మించారు. ప్రస్తుతం స్టార్ హీరోయిన్ గా వెలుగుతున్న శృతిహాసన్ ఒక కుమార్తె కాగా రెండో కుమార్తె పేరు అక్షరహాసన్.

అయితే కమల్ సారికతో విడాకులు తీసుకుని గౌతమి తో కలిసి ఉంటున్న విషయం తెలిసిందే... అయితే ఇప్పుడు ఈ పదమూడేళ్ళ బందం కూడా తెగిపోయింది ఒక్క సారిగా కమల్ అభిమానులకీ, సన్నిహితులకీ షాక్ ఇస్తూ ఈ విషయాన్ని బయట పెట్టింది గౌతమి. మొదటి భార్య వాణీ గణపతి, రెండో భార్య సారిక తో కూడా ఎక్కువ రోజులు భందాన్ని నిలుపుకోలేక పోయిన కమల్... ఇప్పుడు గౌతమి తోకూడా తెగదెంపులు చేసుకున్నాడు.... అయితే ఎందుకు ఈ దూరం అన్నది ఏవ్రూ చెప్పలేదు అయితే రీసెంట్ ఇంటర్వ్యూలో గౌతమి మాత్రం ఆ బ్రేకప్ గురించి మరిన్ని సంగతులు చెప్పింది, ఇండైరెక్ట్ గా కమల్ ప్రవర్తన ని భరించలేకే తాను బయటకు రావాల్సి వచ్చింది అని చెప్పినట్టే.., ఇంతకీ ఆమె ఏం చెప్పిందీ అంటే...

ఆ బాధను రోజూ అనుభవించలేకే:

ఆ బాధను రోజూ అనుభవించలేకే:

కమల్ నుంచి విడిపోతున్నా అని చెప్పింది కానీ.. దీనికి కారణాలేంటో వెల్లడించలేదు గౌతమి. కమల్ తో కలిసి ఉన్న చివరి రోజుల్లో ప్రతి రోజూ చాలా బాధను అనుభవించాల్సి వచ్చిందని.. ఆ బాధను రోజూ అనుభవించలేకే బయటికి వచ్చేశానని తాజాగా ఒక ఇంటర్వ్యూలో వ్యాఖ్యానించింది గౌతమి. ఎంతో బాధతో బయటికి వచ్చినప్పటికీ తనకు కమల్ మీద ఎలాంటి కోపమూ లేదని ఆమె పేర్కొంది.

కోపం, కక్ష ఉంటే :

కోపం, కక్ష ఉంటే :

ఆ వ్యక్తి మీద కోపం, కక్ష ఉంటే అంత హుందాగా ఆ ఇంటి నుంచి బయటకు రాను. ఆయన కూడా డిగ్నిఫైడ్‌ పర్సన్‌. మేమిద్దరం మా డిగ్నిటీని కాపాడుకున్నాం. విడిపోవాలన్నది ఇద్దరి నిర్ణయం. నా చిన్నప్పటి నుంచి ఇప్పటివరకూ చాలా హుందాగా బతికాను. ఆ హుందాతనం కోసమే బయటికి వచ్చాను.

నా వయసులో ఉన్న ఏ స్త్రీ అయినా:

నా వయసులో ఉన్న ఏ స్త్రీ అయినా:

నా జీవితంలో నేను తీసుకున్న అతి పెద్ద నిర్ణయం అది అని ఆ రోజే ట్విట్టర్‌లో చెప్పాను. నా వయసులో ఉన్న ఏ స్త్రీ అయినా ఇలాంటి నిర్ణయం తీసుకోవడం కష్టం. కానీ తీసుకోవాల్సిన పరిస్థితి వచ్చింది. పరిస్థితిలో మార్పు వస్తుందని కొన్ని ఛాన్సులు ఇచ్చి చూసుకున్నాను. కానీ ఇక ఇలానే ఉంటుంది అని ఇద్దరికీ తెలిసిపోయింది.

అందుకే ఆ నిర్ణయం :

అందుకే ఆ నిర్ణయం :

అందుకే ఆలోచించుకుని నిర్ణయం తీసుకున్నాం. ఉదయం లేచినప్పుడు ఈ రోజు బాగుంటుందని.. భవిష్యత్తు బాగుంటుందని అనుకుంటూ నిద్ర లేవాలి. కానీ ఈ రోజు ఎలా ఉంటుందో.. ఎంత భారంగా గడుస్తుందో అనుకోకూడదు. అందుకే ఆ నిర్ణయం తీసుకోవాల్సి వచ్చింది" అంటూ కమల్‌తో కలిసున్న చివరి రోజుల్లో తాను ఎంత వేదనకు గురైంది వెల్లడించింది గౌతమి.

రాత్రికి రాత్రి :

రాత్రికి రాత్రి :

ఏ వయసు అయితేనేం, ఇద్దరు వ్యక్తులు కలిసి జీవించలేరనుకున్నప్పుడు విడిపోవడమే మేలు.. అన్నది నేటి నయా ట్రెండ్‌. కలిసి వుండడం, విడిపోవడం.. ఆయా వ్యక్తుల ఇష్టమే కావొచ్చుగాక. కానీ, రాత్రికి రాత్రి అభిప్రాయాలు ఎలా మారిపోతాయో ఏమో.!

13 ఏళ్ళ బంధాన్ని :

13 ఏళ్ళ బంధాన్ని :

కమల్‌హాసన్‌ - గౌతమి.. పెళ్ళి చేసుకోలేదు. కానీ, పుష్కరకాలంపైగానే ఇద్దరూ సహజీవనం చేశారు. అవును, 13 ఏళ్ళ బంధాన్ని తెగతెంపులు చేసుకోవాలని నిర్ణయించుకున్నానని గౌతమి, సోషల్‌ మీడియా ద్వారా తన 'బ్రేకప్‌ స్టోరీ'ని వివరించారు. ఈ విషయంలో తనను ఎవరూ అపార్థం చేసుకోవద్దని ఆమె విజ్ఞప్తి చేయడం గమనార్హం.

కమల్‌ నా జీవితంలో వెరీ వెరీ స్పెషల్‌:

కమల్‌ నా జీవితంలో వెరీ వెరీ స్పెషల్‌:

గత కొంతకాలంగా కమల్‌హాసన్‌ - గౌతమి మధ్య విభేదాలున్నాయంటూ గుసగుసలు విన్పిస్తున్నాయి. అయితే గౌతమి మాత్రం, ఆ గాసిప్స్‌ని కొట్టి పారేశారు. 'కమల్‌ నా జీవితంలో వెరీ వెరీ స్పెషల్‌..' అంటూ చెప్పుకొచ్చిందామె. అలాంటిది, అనూహ్యంగా గౌతమి, కమల్‌తో బ్రేకప్‌ స్టోరీ వెల్లడించడం గమనార్హం.

రాజకీయాల్లో యాక్టివ్‌ :

రాజకీయాల్లో యాక్టివ్‌ :

అన్నట్టు, గౌతమి ఈ మధ్య రాజకీయాల్లో యాక్టివ్‌ అవ్వాలనుకుంటున్నట్టుంది. అందుకు తగ్గట్టుగానే ఆమె, సేవా కార్యక్రమాల పేరుతో ప్రధాని నరేంద్రమోడీనీ, కేంద్ర మంత్రి వెంకయ్యనాయుడునీ కలిశారు. అక్కడినుంచే ఇద్దరి మధ్యా ఉన్న చిన్న చిన్న పొరపొచ్చాలు పతాక స్థాయికి చేరి పోయాయి.

ఇద్దరూ వేర్వేరు దారుల్లో:

ఇద్దరూ వేర్వేరు దారుల్లో:

ఇంతకీ, కమల్‌హాసన్‌తో గౌతమి విడిపోవడానికి కారణమేంటట.? ఏంటంటే, ఇద్దరూ వేర్వేరు దారుల్లో నడవాలనుకుంటున్నప్పుడు, ఆ వేర్వేరు దారుల్ని ఎంచుకోవడం మంచిది అంటూ చెప్పటం లోనే గౌతమి కమల్ ల జీవితాల్లో ఏం జరిగిందో చెప్పకనే చెప్తున్నాయి. ఇదే మార్పు జయ లలిత చనిపోయిన కొద్దిగంటల్లోనే కనిపించింది.

జయలలిత చనిపోగానే :

జయలలిత చనిపోగానే :

జయలలిత చనిపోగానే కమల్ ఆమె మరణానికి ఏమాత్రం భాద పడకపోగా "ఆమె మీద ఆధారపడి జీవించే వారికి నా సానుభూతి అంటూ ట్వీట్ చేయగా, దానికి భిన్నంగా గౌతమి మాత్రం జయ మరణం లో తనకి అనుమానాలున్నాయని ఆమె మరణం సహజ మరణమేనా అన్న విషయం పై విచారణ జరగాలీ అంటూ ప్రధానికి లేఖ రాసింది.

English summary
One Month Back actress Gautami Tadimalla announced that she had split with actor Kamal Haasan, her partner of almost 13 years. and in recent Interview Gauthami says more about her breakup with kamal hassan
 

తక్షణ సినీ వార్తలు, మూవీ రివ్యూలను రోజంతా పొందండి - Filmibeat Telugu