»   » వాళ్ళకి ఇప్పుడు త్రివిక్రమ్ మోస్ట్ వాంటెడ్

వాళ్ళకి ఇప్పుడు త్రివిక్రమ్ మోస్ట్ వాంటెడ్

Posted By:
Subscribe to Filmibeat Telugu

ఈ రోజుల్లో ఒక డైరెక్టర్ ఒక హిట్ కొడితే చాలు నెక్స్ట్ సినిమా కోసం అతనికి ఆఫర్లు వచ్చి పడిపోతాయి. అదే వరుస హిట్ లు ఇచ్చిన దర్శకుడైతే.... ఎలా ఉన్నా మినిమం గ్యారెంటీ అనే భరోసా ఇచ్చే దైరెక్టర్ అయితే.... ఇక పరిస్థితేంటో మీరే ఊహించుకోవచ్చు. ఇప్పుడు టాలీవుడ్ లో త్రివిక్రం అదే పరిస్థితిలో ఉన్నాడు

తక్కువ బడ్జెట్ లోనే.... నార్మల్ పబ్లిసిటీతో వచ్చిన "అఆ" హిట్ తో మళ్ళీ త్రివిక్రమ్ టాక్ ఆఫ్ ద ఇండస్ట్రీ అయ్యాడు. ఇప్పుడు కొందరు స్టార్లు త్రివిక్రం తో ఒక సినిమా అయినా చేయాలని ఉబలాట పడుతున్నారట.... వారిలో ముఖ్యంగా చెప్పుకోవాల్సింది జూనియర్ ఎన్ టీ ఆర్, రామ్ చరణ్, పవన్‌ కళ్యాణ్‌, అఖిల్‌. త్రివిక్రమ్ ...జూనియర్ ను కలిసి స్టోరీ లైన్ చెప్పినట్టు, జూనియర్ దానికి ఓకే చెప్పినట్టు తెలిసింది. ప్రస్తుతం జనతా గ్యారేజ్ సినిమాతో బిజీగా ఉన్న ఎన్టీఆర్ ...అది కంప్లీట్ అయ్యాక చేయవచ్చని ఒక వర్గం అంటోంది.

Most Wanted Director of Tolly Wood Trivikram

ఇక రామ్ చరణ్ కూడా త్రివిక్రమ్ తో చేయాలని అనుకుంటున్నాడట. చెర్రీకి ఈమధ్య చెప్పుకోదగ్గ సక్సెస్ లు లేవు ఇప్పుడు వస్తూన్న దృవ తో బాటు మంచి హిట్ ఇంకొకటి కూడా ఉండటం ప్లస్ అవుతుంది కాబట్టి.త్రివిక్రమ్ తో చేయాలనుకుంటున్నాడట.

వీరిద్దరే కాక పవన్ కళ్యాణ్ కూడా డాలీతో సినిమా కంప్లీట్ చేసి, త్రివిక్రమ్ తో చేయాలనుకుంటున్నాడట. అక్కినేని ఫ్యామిలీ హీరో అఖిల్ అయితే సెకండ్ మూవీ అయినా సక్సెస్ చేసుకోవాలనే ఆసక్తితో ఉన్నాడు. అతను కూడా త్రివిక్రమ్ అయితే బెటర్ అనుకుంటున్నాడట. మరి ఈ మాటల మెజీషియన్ ఎవరితో చేతులు కలుపుతాడో చూడాలి....

English summary
Star Heroes NTR, Ram Charan, akhil, Pawan kalyan are now shewing interest on Trivikram for their next projects
 

తక్షణ సినీ వార్తలు, మూవీ రివ్యూలను రోజంతా పొందండి - Filmibeat Telugu