»   » ‘మా’ తరుపున ‘వేదం’ నాగయ్యకు సహాయం

‘మా’ తరుపున ‘వేదం’ నాగయ్యకు సహాయం

Posted By:
Subscribe to Filmibeat Telugu

హైదరాబాద్: వేదం సినిమాలో సిరిసిల్ల చేనేత కార్మికుడు రాములగా నటించిన నటుడు నాగయ్య తన పెర్ఫార్మెన్స్‌తో అందరి మనసు దోచుకున్నాడు. అయితే ఆ సినిమా తర్వాత నాగయ్యకు అవకాశాలు రాలేదు. ఆర్థిక ఇబ్బందుల పాలైన నాగయ్య ఇటీవల ఫిల్మ్ నగర్లో బిక్షాటన చేస్తున్న విషయం మీడియా కంట పడింది.

ఈ విషయం మీడియాలో రావడంతో విషయం తెలంగాణ ఐటీ శాఖ మంత్రి కె.తారక రామారావు వరకు వెళ్లింది. పేదరికంతో భిక్షాటన చేస్తున్న వార్తను మీడియాలో చూసి కేటిఅర్ గారు చలించిపోయారు. వెంటనే నాగయ్యను తన ఆఫీస్ కి పిలుపించుకొని మరి రూ.లక్ష ఆర్థిక సాయం అందించారు.

అలాగే మా అసోసియేషన్ అధ్యక్షుడు రాజేంద్రప్రసాద్ గారితో మాట్లాడి అతనికి ‘మా' తరుపున కూడా సహాయం అందేలా చూస్తామన్నారు. భవిష్యత్తులో కూడా ప్రభుత్వం అండగా ఉంటుందని అభయమిచ్చారు. నాగయ్య స్వస్థలం ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలోని గుంటూరు.

Movie Artist Association Helps Vedam Nagaiah

తాజాగా మా(మూవీ ఆర్టిస్ట్ అసోసియేషన్) అధ్యక్షుడు రంగంలోకి దిగి నాగయ్యకు అసోసియేషన్ తరుపున సహాయం అందజేసారు. ఫిల్మ్ చాంబర్లో ఏర్పాటు చేసిన కార్యక్రమంలో నాగ్యతో పాటు లవకుశ చిత్రంలో నటించిన నటుడు సుబ్రహ్మణ్యంకు రూ. 25 వేల చొప్పున ఆర్థిక సహాయం అందజేసారు. అదే విధంగా సంపూర్ణ సూపర్ మార్కెట్ తరుపున నాగయ్య సరుకుల కొనుగోలు కోసం 12 వేల సహాయం అందుకున్నారు.

ఈ సందర్భంగా రాజేంద్రప్రసాద్ మాట్లాడుతూ... సినిమా కళాకారుల సంక్షేమమే మా ధ్యేయం. రకరకాల మార్గాల నుండి నిధుల్ని సేకరించి వీలైనంత ఎక్కువ మందికి సహాయం చేయాలనుకుంటున్నాం. ఇందుకోసం వెల్ఫేర్, విజిలెన్స్ అని రెండు కమిటీలను ఏర్పాటు చేసాం. వెల్ఫేర్ కమిటీకి సినియర్ నరేష్, విజిలెన్స్ కమిటీకి కాదంబరి కిరణ్ చైర్మన్లుగా వ్యవహరించనున్నట్లు రాజేంద్రప్రసాద్ తెలిపారు. కళాకారుల పించను రూ. 1000 నుండి 1500కు పెంచామని, ఈ మొత్తాన్ని‘మా' నిధి నుండి కాకుండా ఇతర మార్గాల ద్వారా సేకరించి ఇస్తున్నట్లు తెలిపారు.

English summary
Movie Artist Association Helps Vedam Nagaiah and Promises To Help Telugu Artists.
Please Wait while comments are loading...