»   » ఇది మా ఖర్మ అంటూ.... దర్శకుడు హరీష్ శంకర్ ఆవేదన!

ఇది మా ఖర్మ అంటూ.... దర్శకుడు హరీష్ శంకర్ ఆవేదన!

Posted By:
Subscribe to Filmibeat Telugu
హరీష్ శంకర్ ఈ విషయంలో ఇంతకన్నా ఏమి చేయలేడా?

మూవీ ఇండస్ట్రీకి అతిపెద్ద సమస్యగా మారిన అంశం పైరసీ. ప్రపంచ వ్యాప్తంగా దీని వల్ల కోట్లాది రూపాయలు నష్టం ఏర్పడుతోంది. తెలుగు సినిమా పరిశ్రమ కూడా దీని వల్ల చాలా నష్టపోవాల్సి వస్తోంది. 2017 సంవత్సరంలో అత్యధికంగా పైరసీకి గురైన తెలుగు సినిమాల వివరాలు బయటకు వచ్చాయి.

తెలుగు సినిమా పరిశ్రమలో అత్యధిక బడ్జెట్‌తో తెరకెక్కిన 'బాహుబలి-2' సినిమాతో పాటు, దువ్వాడ జగన్నాధమ్, అర్జున్ రెడ్డి సినిమాలు 2017లో ఎక్కువగా పైరసీకి గురయ్యాయట. ఈ విషయం దర్శకుడు హరీష్ శంకర్ దృష్టికి రావడంతో ట్విట్టర్ ద్వారా ఆవేదన వ్యక్తం చేశారు. ఇది సినిమా వాళ్లు చేసుకున్న ఖర్మ అంటూ ట్వీట్ చేశారు.

Movie piracy Harish Shankar tweeted it is our Kharma

కాగా... హరీష్ శంకర్ సినిమాల విషయానికొస్తే, 'దువ్వాడ జగన్నాధం' తర్వాత ఈ దర్శకుడి నుండి సినిమాలేవీ రాలేదు. ఏ ప్రాజెక్టు కూడా అఫీషియల్‌గా అనౌన్స్ చేయలేదు. నితిన్, శర్వానంద్ హీరోలుగా ఈ చిత్రం రూపొందనునట్లు తెలుస్తోంది. ఈ చిత్రానికి దాగుడుమూతలు అనే ఆసక్తికరమైన టైటిల్ పరిశీలిస్తున్నట్లు వార్తలు వినిపిస్తున్నాయి.

దీంతో పాటు 'సీటిమార్' టైటిల్‌తో మరో కథను సిద్ధం చేసుకున్నట్లు కూడా వార్తలు వినిపిస్తున్నాయి. అయితే ఈ ప్రాజెక్టులకు సంబంధించి అఫీషియల్ సమాచారం వెలువడాల్సి ఉంది.

English summary
As per the latest Survey on piracy reveals that Baahubali-2 is the movie which has suffered heavy losses because of piracy. Baahubali-2 is the movie which stands on top of the pirated movies, followed by Allu Arjun starrer DJ-Duvvada Jagannadham. In spite of all the trails, the movie makers are unable to eradicate the biggest bug which is killing the art of cinema. The director Harish Shankar tweeted it is our Kharma.
 

తక్షణ సినీ వార్తలు, మూవీ రివ్యూలను రోజంతా పొందండి - Filmibeat Telugu

X