For Quick Alerts
  ALLOW NOTIFICATIONS  
  For Daily Alerts

  ఈ వీకెండ్ : 6 తెలుగు సినిమాలు రిలీజ్

  By Bojja Kumar
  |

  హైదరాబాద్ : వీకెండ్ రాగానే ఏదో ఒక సినిమా రిలీజ్‌కు రెడీ అవుతుంది. అయితే ఈ శుక్రవారం(మార్చి 15) ఏకంగా అరడజను తెలుగు సినిమాలు విడుదలకు సిద్ధం అవుతున్నాయి. అయితే ఇందులో అన్నీ చిన్న సినిమాలే కావడం గమనార్హం. పరీక్షల సమయం కావడంతో పెద్ద సినిమాల దర్శక నిర్మాతలు పెద్దగా ఆసక్తి చూపడటం లేదు.

  రాష్ట్రంలోని ప్రముఖ టెర్రిటరీల్లో థియేటర్లన్నీ భారీ నిర్మాతల గుప్పిల్లో చిక్కుకున్నాయి. పెద్ద సినిమాలు విడుదలకు రెడీగా ఉన్న సమయంలో చిన్న సినిమాలకు కనీసం పట్టుమని పది సినిమాలు కూడా దొరికే పరిస్థితి ఉండదు. థియేటర్ల గుత్తాధిపత్యం వల్ల ఎన్నో సినిమాలు విడుదలకు నోచుకోలేదు.

  అసలు థియేటర్లకు దొరకడమే కష్టంగా మారిన పలు చిన్న సినిమాలు ఇదే మంచి అవకాశంగా థియేటర్లలోకి రావడానికి సిద్ధం అవుతున్నాయి. ఇందులో మధుర శ్రీధర్ దర్శకత్వంలో వస్తున్న 'బ్యాక్ బెంచ్ స్టూడెంట్' చిత్రంతో పాటు, ఆపరేషన్ దుర్యోధన 2, రయ్ రయ్, 3జి లవ్, జగన్, అలజడి సినిమాలు ఉన్నాయి.

  స్లైడ్ షోలో సినిమాల వివరాలు...

  మహత్ రాఘవేంద్ర, పియా బాజ్‌పాయ్, అర్చన కవి నటించిన చిత్రం 'బ్యాక్ బెంచ్' స్టూడెంట్ . వాడి బ్రేకప్ లవ్‌స్టోరీ అనేది ఉపశీర్షిక. మధుర శ్రీధర్ దర్శకుడు. మల్టీ డైమన్షన్ ప్రై.లి సమర్పిస్తోంది. షిరిడీ సాయి కంబైన్స్ పతాకంపై ఎం.వి.కె.రెడ్డి నిర్మించారు. ఈ నెల 15న చిత్రాన్ని విడుదల చేయనున్నారు.

  జగపతిబాబు, పోసాని కృష్ణమురళి, ఏరాసు ప్రతాపరెడ్డి ముఖ్యపాత్రల్లో నందం హరిశ్చంద్రరావు దర్శకత్వంలో రూపొందిన ‘ఆపరేషన్ దుర్యోధన-2' ఈనెల 15న ప్రేక్షకుల ముందుకు రానుంది. నీలాంజలి, చిన్న ప్రొడక్షన్స్ బ్యానర్‌పై ఎ.బి.శ్రీనివాసరావు, జిట్టా సురేందర్‌రెడ్డి సంయుక్తంగా చిత్రాన్ని నిర్మించారు.

  శ్రీ, అక్ష జంటగా శ్రావ్య బాలాజీ మూవీస్ పతాకంపై నిర్మిస్తున్న చిత్రం ‘రయ్ రయ్'. సిహెచ్.సుధీర్‌రాజు దర్శకత్వంలో బి.ఆర్.కృష్ణ, ఎస్.ఎన్.రెడ్డి ఈ చిత్రాన్ని రూపొందిస్తున్నారు. ఈ నెల 15న విడుదలువుతోంది.

  స్క్వేర్ ఇండియా స్టూడియో ప్రై.లిమిటెడ్ పతాకంపై 15 మంది యువ హీరోలు, 11 మంది యువ కథానాయికలు నటిస్తున్న ‘3జి లవ్' చిత్రం ఈనెల 15న ప్రేక్షకుల ముందుకు రానుంది. గోవర్ధన్‌కృష్ణ దర్శకత్వంలో కోలగట్ల ప్రతాప్ నిర్మిస్తున్నారు.

  శివ, సంజన, సరయు ప్రధానపాత్రధారులుగా వెంకన్నబాబు యేపుగంటి దర్శకత్వంలో రూపొందుతున్న చిత్రం ‘జగన్'. ఐ.ఎస్.జె ఫిలింస్ పతాకంపై నిర్మిస్తున్న చిత్రం శాఖమూరి మల్లికార్జున రావు, తోట హేమచందర్ నిర్మిస్తున్న ఈ చిత్రం ఈ నెల 15న విడుదల కానుంది.

  శుభోదయ ప్రొడక్షన్స్ పతాకంపై శ్రీ మల్లిఖార్జున్ దర్శకత్వంలో రూపొందుతోన్న చిత్రం ‘అలజడి' శ్రీమతి టి. లక్ష్మీ సౌజన్య గోపాల్ ఈ చిత్రాన్ని నిర్మిస్తున్నారు. ఈ నెల 15న విడుదలువుతోంది. అన్విత్-విన్ని, బలరామ్-రితిక, లడ్డు-రాధిక, రవి-శ్వేత, కాదంబరి కిరణ్, అస్మిత, మేల్కోటే, కొండవలస, ముఖ్యపాత్రలు పోషిస్తున్న ఈ చిత్రానికి మాటలు: కాలెపు శివ శేఖర్, పాటలు: వెంకటరమణ, ఎడిటింగ్: ఎన్. శ్రీనుబాబు, కో-డైరెక్టర్: బి.వి. గోవిందరాజ్, నిర్మాత: లక్ష్మీ సౌజన్య గోపాల్, స్క్రీన్ ప్లే, దర్శకత్వం: శ్రీమల్లికార్జున్.

  English summary
  Movies releasing details on this Friday : Six Telugu movies are releasing on this friday (March 15, 2013).Almost all the films are small budget films, hero Jagapathi Babu’s Operation Duryodhana 2 is also releasing on the same day.Operation Duryodhana 2,Backbench Student,Rai Rai, Jagan, 3G Love and Alajadi movies are releasing on this friday.
   
  న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
  Enable
  x
  Notification Settings X
  Time Settings
  Done
  Clear Notification X
  Do you want to clear all the notifications from your inbox?
  Settings X
  X