»   » బెడ్ రూం కి నేను రాను...తేల్చి చెప్పింది (వీడియో)

బెడ్ రూం కి నేను రాను...తేల్చి చెప్పింది (వీడియో)

Posted By:
Subscribe to Filmibeat Telugu

హైదరాబాద్: న్యూ ఏజ్ రొమాంటిక్ కామెడీల పేరుతో సెమీ శృంగార చిత్రాలు తీస్తున్నారు దర్శకులు. అఫ్ కోర్స్ ఇవి భాక్సాఫీస్ వద్ద బాగానే కలెక్ట్ చేస్తున్నాయనుకోండి. ఆ మధ్యన వచ్చిన త్రిష ఇలియానా నయనతార చిత్రం బాగా వర్కవుట్ అవటంతో మరో తమిళ చిత్రం తెలుగులోకి డబ్బింగ్ అవుతోంది.

Mr. Manmadhan For Sale Theatrical Trailer

శింబు, వరలక్ష్మి శరత్ కుమార్ కాంబినేషన్ లో 2012 లో వచ్చిన పోరా పోడి చిత్రం ఇప్పుడు తెలుగులోకి డబ్ చేసి వదులుతున్నారు. టైటిల్ కూడా చాలా క్యాచీగా మిస్టర్ మన్మధన్ ఫర్ సేల్ అని పెట్టారు. ఈ చిత్రం ట్రైలర్ ని వదిలారు. మీరూ ఈ ట్రైలర్ పై ఓ లుక్కేయండి.


ఈ ట్రైలర్ లో శింబు రెచ్చిపోయి, డైలాగులు చెప్తూ కనిపిస్తాడు. ఈ ట్రైలర్ ద్వారా ఖచ్చితంగా బిజినెస్ అవుతుందనే భావించి విడుదల చేసారు తెలుగు నిర్మాతలు. అయితే ఈ చిత్రం ఎప్పుడు రిలీజ్ అవుతుందనేది మాత్రం చెప్పలేదు. ఇంకో విషయం ఈ చిత్రం తమిళనాట పెద్ద ఫ్లాఫ్.

శింబుకు బీప్ సాంగ్ తో క్రేజ్ రావటంతో ఒక్కసారిగా ఇక్కడ కూడా మరోసారి వార్తల్లో నిలిచాడు. దాంతో శింబు గతంలో ఎప్పుడో వచ్చిన మన్మధ చిత్రం హిట్ కావటంతో సుబ్రమణ్యం ఫర్ సేల్ టైటిల్ ని మిక్స్ చేసి, మిస్టర్ మన్మధ ఫర్ సేల్ అని కిక్ ఎక్కించే ప్రయత్నం చేస్తున్నారు నిర్మాతలు. ఏమో ఇక్కడ ఆడినా ఆశ్చర్యం లేదు.

English summary
Here is the theatrical trailer of the upcoming film Mr. Manmadhan For Sale. It is a Telugu dub of Tamil movie Podaa Podi, which’s a 2012 Tamil release.
 

తక్షణ సినీ వార్తలు, మూవీ రివ్యూలను రోజంతా పొందండి - Filmibeat Telugu