»   » శక్తి, తీన్ మార్, కంటే మిస్టర్ ఫర్ ఫెక్ట్ సాంగ్స్ బంపర్ రేగ్గొట్టుతున్నాయా!

శక్తి, తీన్ మార్, కంటే మిస్టర్ ఫర్ ఫెక్ట్ సాంగ్స్ బంపర్ రేగ్గొట్టుతున్నాయా!

Posted By:
Subscribe to Filmibeat Telugu

సమ్మర్ లో సందడి చేయడానికి వస్తున్న ముగ్గురు పెద్ద హీరోల సినిమాల ఆడియోలు రిలీజ్ అయ్యాయి. ఎన్టీఆర్ శక్తి ఫిబ్రవరి27న, మిస్టర్ ఫర్ ఫెక్ట్ మార్చి 19న, తీన్ మార్ మార్చి 21న రీలీజ్ అయ్యాయి. అయితే ఈ మూడు ఆడియోల్లో ఆడియన్స్ దేనికి ఎక్కువ మార్కులు వేస్తున్నారంటే నిస్సందేహంగా మిస్టర్ ఫర్ ఫెక్ట్ కే అని చెప్పాలి. శక్తి, తీన్ మార్ చిత్రాలకు మణిశర్మ సంగీతం అందించగా, మిస్టర్ ఫర్ ఫెక్ట్ కు దేవిశ్రీప్రసాద్ మ్యూజిక్ చేశాడు. ఈ మూడు సినిమాల ఆడియోలు ఇంతకుముందు విన్న పాటల్లాగే అనిపిస్తాయి.

అయితే వాటిలో మిస్టర్ ఫర్ ఫెక్ట్ పాటలు మాత్రం విన్నపాటల్లా అనిపించినా జనం వింటున్నారు, ఎంజాయ్ చేస్తున్నారు. దీన్ని బట్టి చూస్తే మణి శర్మ దగ్గర స్టఫ్ అయిపోయిందేమో అన్న డౌట్ వస్తోంది. అంతకుముందు అతని పాటల్లో వున్న జోష్ ఇప్పుడు వుండడం లేదు. శక్తి, తీన్ మార్ లో కూడా కొన్ని మంచి పాటలు వున్నప్పటికీ టోటల్ ఆడియో మాత్రం మిస్టర్ ఫర్ ఫెక్టే బాగుందని ఆడియన్స్ ఫీల్ అవుతున్నారు. ఏప్రిల్ 1న శక్తి, ఏప్రిల్ 14న తీన్ మార్, ఏప్రిల్ 21న మిస్టర్ ఫర్ ఫెక్ట్ రిలీజ్ అవుతున్నాయి. ఆడియోలు ఎలా వున్నా ఏ సినిమా ఎలా ఉంటుందో తెలుసుకోవాలంటే అప్పటివరకు ఆగక తప్పదు.

English summary
Mr. Perfect is production no 13 in our Sri Venkateswara Creations banner, we almost completed the film shoot and ready to release in the month of April last week.
 

తక్షణ సినీ వార్తలు, మూవీ రివ్యూలను రోజంతా పొందండి - Filmibeat Telugu