For Quick Alerts
  ALLOW NOTIFICATIONS  
  For Daily Alerts

  M.S.ధోనీ లవర్ చనిపోయింది.... మరి సినిమాలో ఆమెనెలా చూపిస్తారు?....

  |

  బాలీవుడ్ లో ఇప్పుడంతా బయోపిక్ హవా నడుస్తోంది.మంచి హిట్ పిక్చర్లుగా నిలుస్తున్నాయి. ఇండియా పేరును అంతర్జాతీయ స్థాయిలో మారుమోగించిన క్రీడాకారుల జీవిత చరిత్రల ఆధారంగా సినిమాలు తీయడం ఇటీవల కాలంలో ట్రెండ్ గా మారింది.. అంతేకాదు, ఆ ట్రెండ్ ఇంకా కొనసాగుతుంది. ఫ్లయింగ్ సిక్ గా పేరున్న ఒలింపిక్ రన్నర్ జీవితకథతో ఫరాన్ అక్తర్ తీసిన 'భాగ్ మిల్కా భాగ్' ఎంత పెద్ద హిట్ అయిందో తెలిసిందే.

  ఆ సినిమా రూ.100 కోట్లకు పైగా కలెక్షన్లతో వసూళ్ల వర్షం కురిపించిన సంగతీ తెలిసిందే. ఆ తరువాత ఈమధ్యే ఇండియన్ స్టార్ బాక్సర్.. లేడీ పంచ్ మాస్టర్ మేరీ కోమ్ జీవితం ఆధారంగా తెరకెక్కించిన సినిమా కూడా సూపర్ హిట్ గా నిలిచింది. బాలీవుడ్ అందాల తార ప్రియాంకాచోప్రా ఈ సినిమాలో మేరీ కోమ్ పాత్రలో నిజంగానే జీవించేసింది. ఇక సల్మాన్ ఖాన్ "సుల్తాన్, అమీర్ఖాన్ "దంగల్" లు కూడా మల్ల యోదుల నిజ జీవిత ఆధార్ కథలే. దీంతో ఈ తరహా సినిమాల నిర్మాణంలో బాలీవుడ్ దర్శకులు బిజీగా మారుతున్నారు. ప్రసిద్ధ క్రీడాకారుల జీవితాలను తెరకెక్కించేందుకు ఉత్సాహం చూపిస్తున్నారు.

  అలాగే నీరజ్ పాండే దర్శకత్వంలో టీమిండియా కెప్టెన్ మహేంద్ర సింగ్ ధోనీపై సినిమా సిద్ధమవుతుంది. ఆ సినిమా పేరు 'ఎంఎస్ ధోనీ.. ద అన్ టోల్డ్ స్టోరీ'. భారత్ కు వన్డే, టీ20 వరల్డ్ కప్ లు సాధించిన క్రికెట్ హీరో ధోనీ పాత్రను తెరపై సుశాంత్ సింగ్ రాజ్ పుత్ పోషిస్తున్నాడు.

  MS Dhoni's biopic to reveal his untold love story

  అయితే ఈ బయోపిక్‌లో ధోనీ జీవితానికి సంబంధించి మనకు తెలియని ఎన్నో విశేషాలను దర్శకుడు చెప్పబోతున్నాడట. అంతేకాదు, ధోనీ ఫస్ట్ లవ్ గురించి కూడా ఉందట. అవును, ధోనీ 20 సంవత్సరాల వయసులో ప్రియాంకఝా అనే యువతితో ప్రేమలో పడ్డాడు. తనతోనే జీవితాంతం గడపాలని ధోనీ అనుకున్నాడట. కానీ విధి ఆడిన వింత నాటకంలో వారి ప్రేమ ఓడిపోయింది. ఓ యాక్సిడెంట్‌లో ధోనీ లవర్ చనిపోయింది.

  దాదాపు సంవత్సరం పాటు ఈ బాధలో ధోనీ కుమిలిపోయాడు. చివరికి అన్నీ విషయాలు మర్చిపోయి జీవితంలో ఉన్నత స్థాయికి ఎదగాలన్న తల్లిదండ్రుల మాటను ధోనీ నిజం చేశాడు. పెళ్లి చేసుకున్న తర్వాత సాక్షిని ధోనీ సంతోషంగా చూసుకుంటున్నాడు. ఈ బయోపిక్‌లో లవ్ స్టోరీని చిత్రీకరించే విషయంలో ధోనీని సంప్రదించామని, ధోనీ కూడా గ్రీన్ సిగ్నల్ ఇచ్చారని నీరజ్ పాండే తెలిపారు.

  ధోనీ ఎక్స్ గర్ల్‌ఫ్రెండ్ పాత్రలో హీరోయిన్ దిషాపటాని కనిపించనున్నట్లు సమాచారం. అయితే సినిమాలో ఈ పాత్ర చనిపోయినట్టు చిత్రించాలా వద్దా అనే విశయం లో ఆమె తల్లితండ్రుల పర్మిషన్ కోసం కూడా సంప్రదిస్తున్నారట... వారి అనుమతిని బట్టే సినిమాలో ప్రియాంక పాత్ర పై ఒక క్లారిటీ రానుంది...

  English summary
  The Dhoni biopic directed by Neeraj Pandey promises many untold stories from the life of Captain Cool. Mirror has learnt that one of them is a love story that didn't end happily every after for the cricketer and his first love
   
  న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
  Enable
  x
  Notification Settings X
  Time Settings
  Done
  Clear Notification X
  Do you want to clear all the notifications from your inbox?
  Settings X
  X