»   » సచినే అణుచుకోలేదు, అందుకే ధోనీ కర్మయోగి: ఆడియో వేడుకలో రాజమౌళి

సచినే అణుచుకోలేదు, అందుకే ధోనీ కర్మయోగి: ఆడియో వేడుకలో రాజమౌళి

Posted By:
Subscribe to Filmibeat Telugu

హైదరాబాద్: టీమిండియా క్రికెటర్ మహేంధ్ర సింగ్ ధోనీ జీవితం ఆధారంగా తెరకెక్కిన చిత్రం 'ఎంఎస్. ధోనీ'. ఈచిత్రాన్ని హిందీ పాటు తెలుగులో కూడా రిలీజ్ చేస్తున్న సంగతి తెలిసిందే. ఈ చిత్రానికి సంబంధించిన ఆడియో రిలీజ్ కార్యక్రమం శనివారం సాయంత్రం హైదరాబాద్ లోని జే.ఆర్.సి కన్వెషన్ సెంటర్లో జరిగింది.

ఈ ఆడియో వేడుకకు చిత్ర బృందంతో పాటు ఎంఎస్ ధోనీ కూడా హాజరయ్యారు. ఆడియో రిలీజ్ కార్యక్రమానికి దర్శకు ధీరుడు రాజమౌళి ముఖ్య అతిథిగా హాజరై ధోనీతో కలిసి ఆడియో రిలీజ్ చేసారు. ఈ కార్యక్రమానికి యాంకర్ సుమ వ్యాఖ్యాతగా వ్యహరించారు.

ఈ సందర్భంగా రాజమౌళి మాట్లాడుతూ.... ధోనిపై ప్రశంసల వర్షం కురిపించారు. ధోనీని కర్మయోగిగా పేర్కొన్నారు. గవాస్కర్, కపిల్ దేవ్ లాంటి ఎంతో మంది దిగ్గజాలు ఆడుతున్న సమయం నుండి మనం క్రికెట్ చూస్తున్నా. కానీ ఆ కాలంలో ఓ భయం ఉండేది. మ్యాచ్ గెలుస్తామా? ఓడుతామా? అని. కానీ ధోనీ కెప్టెన్ అయ్యాక ఆ భయం అనేది లేకుండా పోయింది. అలాంటి ఫీల్ అభిమానుల్లో ధోనీ కల్పించారు అన్నారు.

 కర్మ యోగి

కర్మ యోగి

1983 తర్వాత వరల్డ్ కప్ తర్వాత చాలా లాంగ్ గ్యాప్ తర్వాత ధోనీ గారీ సారథ్యంలోనే 2011లో కల సాకారం అయింది. భగవద్గీతలో ఓ స్లోకం ఉంటుంది. కేవలం నీ పని నీవు చేయి ఫలితం ఆశించకు అని. కప్ గెలిచాక 130 కోట్ల మంది భారతీయులంతా సంబరాల్లో మునిగిపోయారు. ధోనీ మాత్రం కప్ ను అందుకుని దానిని సహచరులకు అందించి, తను మాత్రం పక్కకు వెళ్లి నిలబడ్డాడని, అందుకే ఆయన కర్మ యోగి అన్నారు.

 సచినే అణుచుకోలేదు

సచినే అణుచుకోలేదు

2011లో వరల్డ్ కప్ సాధించిన సమయంలో క్రికెట్ గాడ్ గా మనమంతా పిలుచుకునే సచిన్ టెండూల్కర్ తన భావోద్వేగాలను అణచుకోలేకపోయారని, ధోనీ మాత్రం ఎలాంటి భావోద్వేగాలు లేకుండా నిల్చుకున్నారు. అందుకే ఆయన కర్మయోగి. ఇంతకన్నా కర్మయోగిని మనం చూస్తామా? ఆయన ఇలాంటి కర్మయోగి ఎలా అయ్యారు అని నీరజ్ పాండే గారు మనకు సినిమా రూపంలో చూపించారు. సినిమా ఫస్ట్ డే ఫస్ట్ షో చూసేందకు ఎదురు చూస్తున్నాను అని రాజమళి తెలిపారు..

పరకాయ ప్రవేశం చేసాడు

పరకాయ ప్రవేశం చేసాడు

ఈ చిత్ర హీరో సుశాంత్ సింగ్ గురించి రాజమౌళి మాట్లాడుతూ...సుశాంత్ ఈ పాత్రలో జీవించాడు... ధోనిని ఏ మాత్రం ఇమిటేట్ చేసిన ఫీలింగ్ కలుగలేదు. ఒక డైరెక్టర్ గా ఈ విషయం చెబుతున్నాను అని రాజమౌళి తెలిపారు.

ఒక నార్మల్ టికెట్ కలెక్టర్

ఒక నార్మల్ టికెట్ కలెక్టర్

ఒక నార్మల్ టికెట్ కలెక్టర్ ఇంత పెద్ద క్రికెటర్ అయి దేశానికి వరల్డ్ కప్ అందించిన వైనం వెనక దాగి ఉన్న కష్టాన్ని దర్శకుడు నీరజ్ పాండే తెరపై చూపించబోతుండటం, ఈ గ్రేట్ మ్యాన్ గురించిన అసలు జీవితాన్ని మనకోసం తెరపైకి తేవడం ఎంతో గొప్ప విషయం అని రాజమౌళి అన్నారు.

బిర్యానీ, నా భార్యకు గాజులు

బిర్యానీ, నా భార్యకు గాజులు

ధోనీ మాట్లాడుతూ...హైదరాబాద్ అంటే బిర్యానీ గుర్తుకొస్తుందని, 2000వ సంవత్సరంలో ఇక్కడ క్రికెట్ ఆడటానికి వచ్చినపుడు తొలిసారి బిర్యానీ రుచి చూసానని తెలిపారు. టీమిండియా ఎప్పుడు హైదరాబాద్ లో మంచి పలితాలే దక్కాయన్నారు. ఇక్కడ గాజులు చాలా పేమస్ తన భార్య కోసం తీసుకెళ్లానన్ని తెలిపారు.

అందరిలాగే తాను కష్టపడ్డాను

అందరిలాగే తాను కష్టపడ్డాను

అభిమానులకు ఏదైనా చెప్పండి అని యాంకర్ సుమ అడగ్గా....అందర్లాగే తాను చాలా కష్టపడి క్రికెటర్ అయ్యానని, ఏదైనా సాధించాలన్న క్లారిటీతో కష్టపడితే లక్ష్యాన్ని చేరుకోవడం సులభమన్నారు. పెద్దలకు గౌరవం ఇస్తూ లక్ష్యం చేరుకోవడానికి హార్డ్ వర్క్ చేయాలని ధోనీ సూచించాడు.

తెలుగు సినిమాలు చూసారా?

తెలుగు సినిమాలు చూసారా?

తెలుగు సినిమాలు చూసారా? అని సుమ అడగ్గా.....తెలుగులో వచ్చిన 'అపరిచిత్', 'బాహుబలి' హిందీలో వస్తే చూసానని ధోని తెలిపారు. సౌత్ లో గుడ్ యాక్టర్స్ ఉన్నారు. ఇక్కడ మంచి దర్శకులు ఉన్నారు. మంచి సినిమాలు వస్తున్నాయి....సినీ రంగాన్ని, స్టార్లను అభిమానించే ఫ్యాన్స్ ఉన్నారని ధోనీ వ్యాఖ్యానించారు.

అది మామూలు విషయం కాదన్న ధోనీ

అది మామూలు విషయం కాదన్న ధోనీ

సుశాంత్ సింగ్ రాజ్ పుత్ గురించి మాట్లాడుతూ.....అతను మంచి యాక్టర్, 9 నెలలు ఈ సినిమా కోసం చాలా హార్డ్ వర్క్ చేసి క్రికెట్ షాట్లు కొట్టడంలో శిక్షణ తీసుకున్నాడని తెలిపారు. ఒక వ్యక్తి ఆటోబయోగ్రఫీలో ఇంకో వ్యక్తి నటించడం అంటే మామూలు విషయం కాదు...సుశాంత్ ఈ విషయంలో పూర్తి న్యాయం చేసాడన్నారు.

ఇదే తొలిసారి

ఇదే తొలిసారి

ఒక క్రికెటర్ జీవితంపై సినిమా రావడం... అది అతని రిటైర్మెంటుకు ముందే రిలీజ్ అవ్వడం ఇదే తొలిసారి. ధోని గురించి మనకు తెలిసింది చాలా తక్కువ. ఎక్కడో జార్ఖండ్ రాష్ట్రలో మామూలు మధ్య తరగతి కుటుంబంలో పుట్టిన ఇద్ద పెద్ద క్రికెట్ స్టార్ గా ఎదగడం వెనక చాలా విషయాలు ఉన్నాయి. అవన్నీ సినిమాలో చూపించబోతున్నారు. హిందీతో పాటు తెలుగు, తమిళం, ఇంగ్లీషులో కూడా ఈ సినిమాను రిలీజ్ చేయబోతున్నారు. అత్యంత భారీ స్థాయిలో ఈ సినిమా వేలాది థియేటర్లలో ప్రపంచ వ్యాప్తంగా రిలీజ్ చేసేందుకు ప్లాన్ చేస్తున్నారు.

సెప్టెంబర్ 30న

సెప్టెంబర్ 30న

ఈ సినిమా సెప్టెంబర్ 30న తెలుగు, తమిళం, హిందీ భాషలలో విడుదల కానుంది. 80 కోట్ల ఖర్చుతో తెరకెక్కిన ఈ సినిమా రిలీజ్ కి ముందే మంచి శాటిలైట్ రైట్స్ ని సంపాదించుకుంది. సినిమాను సాధ్య‌మైనంత స‌హ‌జంగా తీసేందుకు కొన్ని రియ‌ల్ లొకేష‌న్ల‌లో చిత్రీక‌రించారు.

కైరా అడ్వాణీ

కైరా అడ్వాణీ

ఈ సినిమాలో ధోనీ భార్య పాత్రలో కైరా అడ్వాణీ నటించారు.

ఎదురు చూస్తున్నారు

ఎదురు చూస్తున్నారు

ధోని చిన్న తనం నుండి ఆయన దేశం గర్వించదగ్గ క్రికెటర్ గా ఎదిగే వరకు అతని జీవితంలో చోటు చేసుకున్న అన్ని ముఖ్య సంఘటనలు ఈ సినిమాలో చూపించబోతున్నారు. ట్రైలర్ రిలీజ్ తర్వాత ఈ సినిమాపై క్రికెట్ అభిమానుల్లో అంచనాలు మరింత పెరిగాయి.

గల్లీ గల్లీలో ధోనీ

ఇటీవల ఎమ్మెస్ ధోనీ: ది అన్‌టోల్డ్ స్టోరీ సినిమాకు సంబంధించి వీడియో సాంగ్ ని విడుదల చేశారు. ప్రతి గల్లీలో ధోని అంటూ సాగే ఈ పాటని ఎస్పీ బి చరణ్, చైతన్య ప్రసాద్ ఆలపించగా ఈ వీడియో అభిమానులను ఎంతగానో అలరిస్తోంది. మరి ఈ సాంగ్ పై మీరు ఓ లుక్కేయండి.

సినిమా ట్రైలర్ తెలుగు

ధోనీ సినిమాకు సంబంధించిన టెలుగు ట్రైలర్ పై మీరూ ఓ లుక్కేయండి

English summary
Cricketer Mahendra Singh Dhoni and director SS Rajamouli launced the music of the Telugu version of Bollywood movie MS Dhoni: The Untold Story at a grand event in Hyderabad today.
 

తక్షణ సినీ వార్తలు, మూవీ రివ్యూలను రోజంతా పొందండి - Filmibeat Telugu